పశ్చిమగోదావరి

నిరుత్సాహాన్ని వదిలితే విజయాలు వరిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 26: క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరింత నైపుణ్యంతో ముందుకు సాగినప్పుడే విజయాలు వరిస్తాయని భీమవరం డియన్నార్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) అన్నారు. భీమవరం డియన్నార్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో మూడురోజులుగా జరుగుతున్న 62వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (అండర్-19) పోటీలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో గాదిరాజు బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మిగిలిన క్రీడలతో పోలిస్తే బాక్సింగ్ క్రీడకు ఒక ప్రత్యేకత ఉందని, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న అభిప్రాయం బాక్సర్లలో ఉంటుందన్నారు. ఈ పోటీల్లో బాలురతో సమానంగా బాలికలు కూడా క్రీడా నైపుణ్యం ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. గౌరవ అతిథి భీమవరం ఎక్సైజ్ సిఐ బలరామరాజు మాట్లాడుతూ క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకుని వాటి ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చునన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారులు క్రమశిక్షణ కలిగిన వారని అభినందించారు. బాలుర, బాలికల విభాగంలో విశాఖపట్టణం జిల్లా చాంపియన్స్‌గా నిలిచింది. విజేతలకు ట్రోఫీలతో పాటు మెడల్స్, బహుమతులు అందచేశారు. బాలికల విభాగంలో 12 మంది, బాలుర విభాగంలో 11 మంది ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ హైజాక్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ పి రామకృష్ణంరాజు, వ్యాయామ విద్యాశాఖాధిపతి బివి నరసింహరాజు తదితరులు పాల్గొనగా, అసిస్టెంటు ఫిజికల్ డైరెక్టర్ వి శ్రీనివాసరాజు వందన సమర్పణ చేశారు.