పశ్చిమగోదావరి

అందుబాటులో పోటీ పరీక్షల పుస్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 18: వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తి చెప్పారు. మంగళవారం స్థానిక జిల్లా శాఖ గ్రంధాలయంలో ఏర్పాటుచేసిన పోలీసు కానిస్టేబుల్స్ ఉచిత శిక్షణా తరగతులు ముగింపు సమావేశానికి ఛైర్మన్ శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ప్రస్తుతం గ్రంధాలయంలో అందుబాటులో ఉన్నాయని, ఇవేకాకుండా ముఖ్యమైన పుస్తకాలు కావాల్సి ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తహసీల్దార్లు కెవి చంద్రశేఖరరావు, సోమశేఖర్, గ్రంధాలయ సంస్థ కార్యదర్శి సిహెచ్ మదారు, కో ఆర్డినేటర్లు డాక్టర్ గిరిబాబు, జె రమేష్, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కక్షసాధిం.పుతో అలైన్‌మెంటు మార్చారు

ద్వారకాతిరుమల, అక్టోబర్ 18: తాడిపూడి ఎత్తిపోతల పథకం నాలుగో లిఫ్ట్ ప్రధాన కాలువ తవ్వకం పనుల్లో అధికారులు కక్ష సాధింపు చర్యగా తన భూమి వద్దే అలైన్‌మెంటు మార్పుచేశారని మంగళవారం సర్వే చేసేందుకు వచ్చిన అధికార్లను అడ్డుకున్న ఒక రైతు పురుగుమందు తాగేందుకు ప్రయత్నించాడు. దీనిని అధికారులు అడ్డుకుని సర్వే జరిపేందుకు పోలీసుల సాయం కోరారు. అయితే తమ భూములకు హైకోర్టు స్టేటస్ కో ఆర్డరు ఇచ్చిందని, వాటి ప్రతులను అధికారులకు చూపడంతో ఎట్టకేలకు సాయంత్రం వారు వెనుతిరిగారు. వివరాల ప్రకారం మండలంలోని రాజుపాలెం శివారు నారాయణపురం పరిధిలో నాదెళ్ల కృష్ణకుమారికి 14.44 ఎకరాల భూమి ఉంది. తాడిపూడి కాలువ నిమిత్తం 2009లో 2.86 ఎకరాల భూమిని అధికారులు భూసేకరణ జరిపారు. ఇదిలావుంటే గత రెండు నెలల క్రితం అధికారులు ఆ భూమిలో తిరిగి రెండుసార్లు సర్వే చేసి రాళ్లు పాతారు. అయితే హఠాత్తుగా మంగళవారం అక్కడకు వచ్చిన అధికారులు రైతుపై తమకు ఫిర్యాదు వచ్చిందని, ఈ కారణంగా కాలువ అలైన్‌మెంటును వంకర్లు లేకుండా నిలువుగా చేస్తామని వారు సర్వే జరుపబోయారు. దీనిపై రైతు కృష్ణకుమారి కుమారుడు పూర్ణచంద్రరావు అధికార్లను అఢ్డుకుని కాలువ ప్రారంభమైన లక్ష్మీనగర్ నుండి దెందులూరు మండలం కన్నాపురం వరకు 28 కిమీ మేర ల్యాండ్ ప్లాన్ షెడ్యూలు ప్రకారం సర్వే చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయినా సర్వే నిమిత్తం వచ్చిన ఇరిగేషన్ డిఇ శివరామకృష్ణయ్య, జెసి రాంప్రసాద్, విఆర్వో నాగేశ్వరరావు తదితరులు సాయంత్రం వరకు వేచి ఉన్నారు. అయితే అధికారుల చర్యలతో రైతు పురుగుమందు తాగేందుకు ప్రయత్నింఛడంతో విషయాన్ని తహసీల్దారు మణికి తెలిపి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సాయం కోరారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సర్వేకు సహకరించాలని రైతును కోరారు. దీంతో రైతు తమ పొలాలకు స్టేటస్ కో ఉందని కాపీ చూపడంతో అధికారులు వెనుతిరిగారు.