పశ్చిమగోదావరి

రేషన్ డీలర్లు నెలాఖరుకు బిఎఫ్‌డి పూర్తిచేయాలి:ఆర్డీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, అక్టోబర్ 25: రేషన్ షాపు డీలర్లంతా విధిగా ఈ నెలాఖరునాటికి బిఎఫ్‌డి పూర్తిచేయాలని కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు రేషన్ షాపు డీలర్లను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం రేషన్ డీలర్లు, గ్యాస్ కంపెనీ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్డీవో హాజరై ప్రసంగించారు. దేవరపల్లి మండలంలో బిఎఫ్‌డి 81.89 శాతం ఉందని, దీనిని 85 శాతానికి పూర్తిచేయాలన్నారు. ఈ మండలం జిల్లాలో వెనుకబడి ఉందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇన్‌ఛార్జి డీలర్లు సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని ఆయన హెచ్చరించారు. మండలంలో 6,042 గ్యాస్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం 800 పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ మూడు రోజుల్లో కనెక్షన్ ఇవ్వాలని గ్యాస్ డీలర్లకు ఆర్డీవో ఆదేశించారు. దేవరపల్లి హెచ్‌పి గ్యాస్‌కు 218 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీ డీలర్లకు విఆర్వోలు సహకరిస్తారని, ఇంటింటి సర్వేచేసి ఎవరైనా దరఖాస్తు చేసుకోకుంటే వారిపేరు నమోదుచేసి కనెక్షన్ మంజూరు చేయాలన్నారు. డిసెంబర్ ఆఖరుకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్నవారందరికీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలన్నారు. అర్హులైన వారికి కనెక్షన్లు మంజూరు చేయడంలో జాప్యం జరిగితే గ్యాస్ డీలర్లపై చర్య తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ అక్బర్ హుస్సేన్, సివిల్ సప్లరుూస్ డిటి పోతురాజు, ఎఎస్వో ఆనందరావు, ఎంపిడిఒ కోటేశ్వరరావు, ఇవో పిఆర్డీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.