పశ్చిమగోదావరి

పేదలకు నాణ్యమైన సేవలందించేందుకు ఐదు ప్రత్యేక వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 2 : పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయిదు ప్రత్యేక వైద్య సేవలను ప్రారంభించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 108 లక్షల రూపాయలతో నిర్మించనున్న జిల్లా బాల భవిత కేంద్రం నిర్మాణానికి బుధవారం రాత్రి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌టి ఆర్ ఉచిత వైద్య పరీక్షలు, తల్లి - బిడ్డ ఎక్స్‌ప్రెస్, 102 కాల్ సెంటర్ తదితర సేవలు ప్రవేశపెట్టడం ద్వారా రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు. దీని వలన ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 40 నుంచి 50 శాతానికి పెరిగాయన్నారు. వైద్య రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న బాల భవిత కేంద్రం ద్వారా 18 సంవత్సరాలలోపు పిల్లలకు అవసరమైన వైద్యాన్ని మూడు నెలల వరకు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దీని వలన 150 వైద్య సీట్లు రావడంతోపాటు వీటిలో 75 ఉచితంగా అందించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. చిత్తూరులో పైలట్ ప్రాజెక్టుగా అపోలో ఆసుపత్రి భాగస్వామ్యంతో బోధనాసుపత్రి చేపట్టామని, దీని వలన అవుట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ విధంగా ఏలూరుతోపాటు మిగిలిన జిల్లాల్లో కూడా ఆ విధానాన్ని అమలు చేసేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, వారిచ్చిన నివేదిక అనంతరం మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఇదే స్ఫూర్తితో వుండాలన్నారు. రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ అందరికీ అందుబాటులో వైద్యాన్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి ఎన్నో సంస్కరణలను చేపట్టారన్నారు. జ్వరాలను నియంత్రించేందుకు దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను ప్రభుత్వం ఉద్యమ రూపంలో చేపట్టిందన్నారు. అనంతరం గుప్తా ఫౌండేషన్ అంధత్వ నివారణ కార్యక్రమం కోసం అందించిన ప్రత్యేక వాహనాన్ని మంత్రులు ప్రారంభించారు. అదే విధంగా ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన ప్రత్యేక షెడ్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, డి ఎంహెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎవి ఆర్ మోహన్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బిపిఎస్ గడువు పెంపు
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు: టౌన్ ప్లానింగ్‌ఆర్‌డి సాయబాబా
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, నవంబర్ 2: బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బిపిఎస్) గడుపు పెంచుతూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయం తీసుకుందని టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరక్టర్ ఎన్‌విఎస్ సాయిబాబా చెప్పారు. అయితే దరఖాస్తులు చేసుకోవడానికి కాదని, గతంలో ధరఖాస్తు చేసుకున్న వారిని పరిష్కరించుకోవడానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 30వ తేదీతో ఈ గడువు ముగుస్తోందన్నారు. గురువారం రాత్రి భీమవరం పురపాలక సంఘానికి వచ్చిన ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. దీనికి ముందు ఆయన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనర్సింహారావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని 4634 ధరఖాస్తులు బిపిఎస్ ద్వారా వచ్చాయన్నారు. ఈ ధరఖాస్తులకుగాను రూ.27 కోట్లు వసూలు చేశామని వివరించారు. అయితే ఈ ధరఖాస్తుల్లో కేవలం 50 శాతం మాత్రమే పరిష్కరించగలిగామని, ఈ నెలాఖరు నాటికి మిగిలిన ధరఖాస్తులను పరిష్కరిస్తామని ఆర్‌డి చెప్పారు. బిపిఎస్ కింద ధరఖాస్తు చేసుకున్న వారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ చట్ట ప్రకారం నిర్మాణాలు జరిగితేనే అనుమతులు జారీ చేస్తామని, ఒక వేళ నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు చేసి వాటిని బిపిఎస్ ద్వారా ధరఖాస్తు చేసే నిబంధనలు ప్రకారం యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయడమేకాకుండా, లైసెన్సు సర్వేయర్ల లైసెన్సును రద్దు చేస్తామని సాయిబాబా స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు వస్తున్నాయని, వీటి నిర్మాణ విషయంలో టిపిఎస్‌లు ఆయా నిర్మాణాల వద్దకు వెళ్లి తనిఖీలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన అడిషనల్ డిజి
పోలవరం, నవంబర్ 2: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో శాంతి, భద్రతల అడిషనల్ డిజి ఆర్‌పి ఠాకూర్, డిఐజి పివిఆర్ రామకృష్ణారావు, ఎస్పీ భాస్కర భూషణ్ బుధవారం పర్యటించారు. పోలీసు ఉన్నతాధికారులు సుమారు నాలుగు గంటలు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. వారి పర్యటననను అత్యంత గోప్యంగా ఉంచారు. అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను, స్పిల్ వే నిర్మాణ ప్రాంతాలను, పోలీసు చెక్‌పోస్టులను పరిశీలించారు. గత నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించినపుడు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం పోలీసు నిఘాలో ఉంటుందని, ప్రతిక్షణం పరిశీలించేందుకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి విజయవాడలో కమాండ్ రూంకు అనుసంధానం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు రక్షణ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చినట్టు తెలిసింది. ప్రతి నెల మూడో సోమవారం ప్రాజెక్టు పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి ఈ నెల 21న ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు. ఆ సమయానికి సిసి కెమెరాలతో పాటు 200 మంది పోలీసులతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఉన్నతాధికారులు వచ్చినట్టు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో సుమారు రెండు గంటలకు పైగా సమాలోచన చేశారు. వారి వెంట జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె వెంకట్రావు, సిఐ కె బాలరాజు, ఎస్సై కె శ్రీహరిరావు తదితరులున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా పండుగప్ప, పీతల పెంపకం
మత్స్యశాఖ డిడి జాకబ్ భాషాకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, నవంబర్ 2 : జిల్లాలో మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి 20 ఎకరాలను రైతుల వద్ద లీజుకు తీసుకుని పండుగప్ప, పీతల పెంపకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మత్స్యశాఖా డిడి జాకబ్ భాషాను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో బుధవారం వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం, ఎపి డెయిరీ, మార్కెటింగ్, ఆత్మ, బింధుసేద్యం తదితర ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతన రకాల చేపల ఉత్పత్తికి పశ్చిమ ఎంతో అనుకూలమైనదని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించడానికి అవకాశమున్న పండుగప్ప, పీతల పెంపకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని ఈ విషయంలో ఎప్పటికప్పుడు రైతులకు సరైన అవగాహన కలిగించడం వలన ఏడాదిలో పండుగప్ప, పీతల పెంపకం వలన ఎంత లాభం ఆర్జించవచ్చునో వివరించాలని కలెక్టర్ చెప్పారు. పది ఎకరాల్లో పీతలు, పది ఎకరాల్లో పండుగప్ప చేపల పెంపకాన్ని చేపట్టాలని ముఖ్యంగా ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉండే సముద్రతీర ప్రాంతంలో రైతులకు చెందిన 20 ఎకరాల చేపల చెరువులను లీజుకు తీసుకుని వాటిని పెంచాలని ఈ పెంపకం వలన అధికాదాయం లభిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పండుగప్ప, పీతల పెంపకాన్ని ప్రోత్సహించాలని దీని వలన జిల్లాలో అధికాదాయం చేకూరుతుందని చెప్పారు. బియ్యపుతిప్ప గ్రామంలో హార్బర్ ఏర్పాటు వవిషయంపై ఇకపై వారం వారం సమీక్షిస్తానని తాను కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాల్గవ రోజునే బియ్యపు తిప్ప గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో మత్స్య హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టానని అయితే హార్బర్ ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు లభించడంలో కొంత జాప్యం జరుగుతోందని, త్వరలోనే ఈ హార్బర్ ఏర్పాటైతే సముద్రంలో మత్స్యకారులు ఆధునిక బోట్ల సహాయంతో చేపలను వేటాది తీసుకురాగలుగుతారని వాటిని బియ్యపు తిప్ప హార్బర్ నుండి ఎగుమతి చేయడానికి అనువైన పరిస్థితులను నెలకొల్పుతామని చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చేపల రైతులకు పెద్ద ఎత్తున ఏడియేటర్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 25 వేల హెక్టార్లలో ఈ సంవత్సరం బింధు సేద్యం లక్ష్యం కాగా ఇప్పటి వరకు నాలుగు వేల హెక్టార్లలో మాత్రమే పూర్తి చేయడం జరిగిందని ఇంకా అయిదు నెలల కాలంలో 21 వేల హెక్టార్లలో బిందుసేద్యం ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా వరి విత్తనాలను మనమే ఉత్పత్తి చేసేందుకు అనువుగా వెయ్యి విత్తన సొసైటీలు ఏర్పాటు చేసి జిల్లాకు అవసరమయ్యే విత్తనాలను రైతులే పండించుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలని ఆత్మ పిడి ఆనంతకుమారిని కలెక్టర్ ఆదేశించారు. విత్తనాలను రైతులకు సరఫరా చేసే ముందు వాటి నాణ్యతను ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించాలని తద్వారా రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రైతులకు అవసరమయ్యే ఎరువులు, పెరుగుమందులను అందుబాటులో ఉంచుకోవాలని, డి ఎపి, ఫాస్పేట్ ఇతర ఫెర్టిలైజర్లను ఏ ఏ కంపెనీ నుండి సరఫరా జరుగుతోంది, ఏ నెలలో ఎంత వస్తోంది? ఎంత నిల్వ వుంది? ఇంకా ఎంత కావాలి అనే వివరాలు తనకు అందజేయాలని వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరిని ఆదేశించారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, సిపివో బాలకృష్‌ణ, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, ఎల్‌డి ఎం ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆత్మ పిడి ఆనందకుమార్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక, ఉద్యానవన శాఖ ఎడిలు దుర్గేష్, విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళ డిఆర్వోతో సమర్ధవంతమైన పాలన
స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత
ఏలూరు, నవంబర్ 2 : ఒక మహిళ డిఆర్‌వోగా రావడం వలన జిల్లాలో పాలనా వ్యవస్థ మరింత చురుగ్గా, సమర్ధవంతంగా ముందుకు నడుస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి డి ఆర్‌వోగా బాధ్యతలు స్వీకరించిన హైమావతి మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు రెవిన్యూ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కోరారు.
ఆటోమొబైల్ మెకానిక్ యూనిట్లు తరలించకపోతే విద్యుత్ కట్: కలెక్టర్
ఏలూరు, నవంబర్ 2 : ఆటోమొబైల్ మెకానిక్ యూనిట్స్ ఇప్పటి వరకూ తరలించని వారివి విద్యుత్తు కనెక్షన్లను వెంటనే తొలగించవలసిందిగా ఎపి ఇపిడిసిఎల్ డి ఇ రవికుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరు ఛాంబరులో జరిగిన జిల్లా పారిశ్రామిక ఔత్సాహక సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది ఆటో మొబైల్ యూనిట్ వారు నిర్లక్ష్య ధోరణితో యూనిట్లను కదల్చడం లేదని వారికి నోటీసులు జారీ చేసినా దానిపై స్పందన లేకపోవడంతో వారు ఆప్రదేశమంతా కూడా కాలుష్యాన్ని వెదజల్లి ప్రజలకిబ్బందికరంగా మారుతున్నారని అట్టి వారిపై కఠిన చర్య తప్పదని కలెక్టర్ చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి ఇ ఇ గత నెల 27వ తేదీన వారికి నోటీసులు పంపి అలాట్‌మెంట్ ఆర్డర్లను కూడా రద్దు చేయడం జరుగుతుందని కూడా తెలిపామని చెప్పామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారు వెంటనే ఖాళీ చేసి ఆటోనగర్‌లో కేటాయించిన షెడ్లలోకి వెళ్లాలని కలెక్టర్ హెచ్చరించారు. ఇనె్వస్ట్‌మెంట్ సబ్సిడీ రీ ఎంబర్స్‌మెంట్ బిసి కేటగిరిలో నందనం స్టీల్ వారికి 73 లక్షల 75 వేల 832 రూపాయలకు అనుమతివ్వడం జరిగిందని చెప్పారు. పవర్ సబ్సిడీ రీ ఎంబర్స్‌మెంట్ జనరల్ కేటగిరిలో యూనోపీడ్స్, ఓంకార్ ఫెర్టిలైజర్స్ ప్రైవేటు లిమిటెడ్, ధనలక్ష్మి ఐస్ కోల్డ్ స్టోరేజ్ ఐస్ ఫ్యాక్టరీ వారికి మొత్తం 12,19,121 రూపాయలకు అనుమతివ్వడం జరిగిందన్నారు. పావల వడ్డీ సబ్సిడీ రీ ఎంబర్స్‌మెంట్ జనరల్ కేటగిరీ వివిధ సంస్థలకు 12,44,414 రూపాయలకు అనుమతివ్వడం జరిగిందని చెప్పారు. సేల్స్ టాక్స్ రీ ఎంబర్స్‌మెంట్ జనరల్ కేటగిరీలో వివిధ యూనిట్లకు 8,47,261 రూపాయలు అనుమతించడం జరిగిందని చెప్పారు. గతంలో తిరస్కరించిన కేసులను సమీక్షిస్తూ మెసర్స్ జన్సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భీమవరం వారు వ్యవసాయ భూమిని పారిశ్రామిక అవసరాల కోసం అనుమతి కొరకు భీమవరం మున్సిపాల్టీకి దరఖాస్తు పెట్టుకున్నారని, దానిని జిల్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కోటయ్య ప్రభుత్వం దగ్గర పెండింగ్ వుందని చెప్పగా వచ్చేవారం సమావేశానికల్లా అనుమతిని వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీనివాసా రూఫింగ్ ఇండస్ట్రీస్, భీమవరం, అష్టలక్ష్మీ ఇంజనీరింగ్ ఎగ్ కేర్ ఇండస్ట్రీ, వేల్పూరు, తణుకు వారి ప్రతిపాదనలు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారి దగ్గర పెండింగ్‌లో వున్నాయని జి ఎం ఇన్‌ఛార్జి ఇండస్ట్రీస్ ఆదిశేషు చెప్పగా వీరిపై ప్రతిపాదనలు వెంటనే పంపాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రీనివాసా ఐస్ ఫ్యాక్టరీ, నరసాపురం, నవదుర్గా ఐస్ ఫ్యాక్టరీ నరసాపురం వారి ప్రతిపాదనలు పరిశీలించి అర్హులైతే అనుమతివ్వాలని లేదా తిరస్కరించాలే గానీ ప్రతిపాదనలను నెలలకొద్దీ పెండింగ్ ఉంచకూడదని సంబంధితాధికారులను ఆదేశించారు. మీనాక్షి ఫిషరీష్ ప్రైవేట్ లిమిటెడ్ ఉప్పాక పాడు విలేజ్ ఉంగుటూరు మండలం వారు ఫిష్ అండ్ ప్రాన్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్‌లను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రతిపాదన వచ్చిందని ఇ ఇ పొల్యూషన్‌కంట్రోలు బోర్డు చెప్పగా రూల్‌కు అనుకూలంగా ఉంటే అనుమతి ఇవ్వాలని, లేని ఎడల తిరస్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఐకె పవర్ వాష్ భీమవరం వారు ప్రతిపాదనలను ఇప్పటికే ఎపి ఐ ఐసి వారు ఎండార్స్‌మెంట్ ఇచ్చి ఉన్న బిల్డింగ్‌లోనే కొనసాగుతుంది కాబట్టి దానికి కలెక్టర్ అనుమతి తెలిపారు. సింగిల్ డెస్క్‌లో అనుమతి కొరకు అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకూ 11 పరిశ్రమలకు 5 కోట్ల 20 లక్షల 61 వేల రూపాయలకు అనుమతివ్వడం జరిగిందని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఏసుదాసు, డిపివో సుధాకర్, ఎస్ ఇ ఇరిగేషన్ శ్రీనివాస్, డిడి సోషల్ వెల్ఫేర్ రంగలక్ష్మీదేవి, డిసిటిపివో కోటయ్య, మున్సిపల్ కార్పొరేషన్ ఎసిపి శ్రీనివాస్, ఎపి ఇపిడిసి ఎల్ డి ఇ రవికుమార్, ఎపి ఎస్ ఎఫ్‌సి మేనేజరు సుబ్బారెడ్డి, ఫ్యాబ్సీ ప్రతినిధి సురేష్, ప్రతినిధులు చాంబర్ ఆఫ్ కామర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి
*ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్
ఏలూరు, నవంబర్ 2 : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టి రామారావు ఆశయ సాధనే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఈ మేరకు తగిన కృషి కూడా జరుగుతుందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వికలాంగుడు నెరుసు వెంకట రంగారావుకు లభించిన 140వ నెంబర్ రేషన్ షాపును చింతమనేని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం వికలాంగులకు కూడా ప్రాధాన్యతను ఇస్తుందని, అందుకు నిదర్శనమే రేషన్ షాపు కేటాయించడమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వార్డులు కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తగిన వౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల రహదారులు ఏర్పాటు చేయడం, ఉన్న రహదారులను బిటి, తారు, సిసి రోడ్లుగా మార్పు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పధకాలు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నేతల రవి, బాలకృష్ణ, మండల తహశీల్దార్ కెవి చంద్రశేఖరరావు, ఆర్ ఐలు రాధాకృష్ణ, రవిచంద్ర, వి ఆర్‌వో తాడి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు వార్డులను సందర్శించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సెల్‌ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీ విద్యుత్ బిల్లలు ప్రభుత్వమే చెల్లించాలి
ఎమ్మెల్సీ శేషుబాబు
పాలకొల్లు, నవంబర్ 2: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామాలకు విద్యుత్ బిల్లులను ప్రభుత్వ కట్టడంతో పంచాయతీ ఆదాయాన్ని అభివృద్ధి కోసం ఖర్చు చేయటానికి వీలు కలిగిందని, టిడిపి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దుచేసి కేంద్రం మంజూరు చేస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేయాలని చెప్పటంపై ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆక్షేపణ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఈ జిఒను వెంటనే రద్దుచేయాలని, ఇప్పటికే స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి సర్పంచ్‌లకు అధికారాలు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సర్పంచ్‌లు అలంకారప్రాయంగా మిగిలారని, ఇప్పుడు అభివృద్ధి కూడా చేయకుండా మొత్తం సొమ్మును పంచాయతీ చెల్లించాలని కోరితే రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగవని, మంచినీటి ఖర్చు రెట్టింపై పంచాయతీలపై భారం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే మూడుసార్లు విద్యుత్ బిల్లు పెంచారని, స్థానిక సంస్థలకు కనీసం విద్యుత్ బిల్లులో రాయితీలు కూడా లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అభివృద్ధికి నిరోధకంగా మారే బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని, ఇప్పుడు విడుదల చేసిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. వచ్చే మండలి సమావేశంలో ఈ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఆయన వెల్లడించారు. సమావేశంలో మైలాబత్తుల మైఖేల్‌రాజు, ఇస్సాకురాజు, కడలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రూ.120 కోట్లతో గ్రామాల్లో సిమెంటు రోడ్లు
జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి
ఏలూరు, నవంబర్ 2 : జిల్లాలో 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రూ.120 కోట్లతో పల్లెల్లో ఉపాధి హామీ పధకం కింద సిమెంటు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖాధికారులతో రోడ్లు, సిమెంటు డ్రైన్ల నిర్మాణ ప్రగతి తీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ 2019 నాటికల్లా జిల్లాలోని అన్ని గ్రామాలకు సిమెంటు రోడ్లు నిర్మించి తీరుతామని చెప్పారు. ఈ విషయంలో పంచాయితీరాజ్ అధికారులు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ ఏడాది జడ్పీ పరిధిలో రూ. 18.42 కోట్లతో చేపట్టిన 814 సిమెంటు రోడ్ల నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు 769 పనులకు సంబంధించి రూ.16.12 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులకు సంబంధించి బిల్లులను ఈ నెల 15 లోగా సమర్పించాలని చెప్పారు. జడ్పీ సాధారణ నిధులతో రూ.9.80 కోట్లతో 283 అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కేటాయించామని, అయితే ఈ పనులు నత్తనడకగా సాగుతున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ విధానాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. సమావేశంలో జడ్పీ సి ఇవో కె సత్యనారాయణ, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, ఇ ఇ ప్రకాష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకమైన పాలనకోసం ప్రతీ పంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్: కలెక్టర్
ఏలూరు, నవంబర్ 2 : జిల్లాలో గ్రామ పంచాయితీల్లో పారదర్శకమైన పాలన అందించడానికి ప్రతీ పంచాయితీకి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం గుంటూరు జిల్లా పంచాయితీ అధికారులకు నూతన ప్రత్యేక వెబ్‌సైట్, పనుల విధానం తదితర అంశాలపై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో అమలు చేసిన ఆన్‌లైన్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో పలు జిల్లాల అధికారులు ఆన్‌లైన్ విధానాన్ని అధ్యయనం చేయడానికి జిల్లాకు వస్తున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అధికారులకు అవగాహన కల్పించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ఎవరి సిఫార్సులకు తావు లేకుండా ఆస్థిపన్ను విధానాన్ని ఎవరి ఇంటి పన్ను వారే నిర్ధారించుకునే విధంగా నూతన విధానాన్ని ప్రవేశపెట్టామని, దీని వలన పంచాయితీలకు ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. పన్నుల వసూళ్లు కూడా ఆన్‌లైన్‌లో అమలు చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. పంచాయితీల్లో పౌరులకు అందించే పలు సేవలను కూడా ఆన్‌లైన్‌లో అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నర్సరావుపేట డి ఎల్‌పివో కృష్ణమోహన్, నల్లజర్ల ఎంపిడివో చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
సర్వే పనులు అడ్డుకున్న రైతులు
ద్వారకాతిరుమల, నవంబర్ 2: చింతలపూడి ఎత్తిపోతల పథకం (ఎంజె-4) కాలువ సర్వే పనులను మండలంలోని దొరసానిపాడు వాసులు బుధవారం అడ్డుకున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భూమికి తగు ధర నిర్ణయించి పరిహారం ప్రకటించే వరకు కాలువ సర్వే పనులు జరగనివ్వమని వారు హెచ్చరించారు. ఈ కాలువ చింతలపూడి నుండి దొరసానిపాడు, నల్లజర్ల మీదుగా కృష్ణాజిల్లాకు వెడుతుంది. కాలువ పరిధిలో మండలంలోని గుండుగొలనుగుంట, దొరసానిపాడు, రాళ్లకుంట గ్రామాలకు చెందిన రైతులు, గృహ యజమానులు సుమారు వెయ్యి మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సర్వే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ పరిహారం విషయంలో అధికారులు స్పష్టమైన ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ సర్వే నిలుపుదల చేశారు. పనులు అడ్డుకున్న వారిలో సర్పంచ్ మొగతడకల సత్యనారాయణ, ఎంపిటిసి రాయపాటి సోమేశ్వరరావు, రైతులు బి సత్యనారాయణ, షేక్ హైదర్ అలీ, ఎన్ వెంకటేశ్వరరావు, ఖాదర్‌వలి తదితరులున్నారు.

ప్రజలతో మమేకమయ్యేందుకే జనచైతన్య యాత్రలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 2: బుధవారం తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూరి మాట్లాడుతూ రైతు రుణ ఉపశమనం, డ్వాక్రా మహిళలకు మూలధనం చెల్లింపు వంటి అంశాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్‌టిఆర్ భరోసా, ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవ, చంద్రన్నబీమా, ఎస్సీ,ఎస్టీ,బిసి ఉపప్రణాళిక అమలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా చేయూత వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విశాఖ నగరం విషయంలో ముఖ్యమంత్రి దీర్ఘ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు, ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్), బ్రిక్స్ సదస్సులు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపును ఇస్తున్నారన్నారు. విశాఖను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారన్నారు. భవిష్యత్‌లో విశాఖ అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా రూపొందుతుందన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ టిడిపి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్ఘాటించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంతకు ముందు ఎమెల్సీ మూర్తి, ఎమ్మెల్యే వాసుపల్లి దుర్గాలమ్మ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాదయాత్రగా సభకు తరలివచ్చారు.
రాష్ట్భ్రావృద్ధే లక్ష్యం : ఎంపి ముత్తంశెట్టి
రాష్ట్భ్రావృద్ధే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తోందని అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 39వ వార్డు మాధవధారలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టారని, వీటిలో 40 శాతం పరిశ్రమలు స్థాపనకు ప్రాధమికంగా అంగీకారం కుదిరిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 2 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయన్నారు. అంతకు ముందు ఎంపితో పాటు టిడిపి అర్బన్ జిల్లా కార్యదర్శి సనపల పాండురంగారావు, వార్డు టిడిపి అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు మాధవధార నుంచి విద్యానగర్, కళింగనగర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
పోలీసు దిగ్బంధంలో విశాఖ మన్యం
పాడేరు, నవంబర్ 2: విశాఖ మన్యం పోలీసు దిగ్భందంలో చిక్కుకుంది. మన్యాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పకడ్భందీగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలోని బెజ్జంగి అటవీ ప్రాంతంలో గత నెల 24వ తేదిన జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అగ్ర శేణి మావోయిస్టులతో సహా 24 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి పాఠకులకు విధితమే. ఈ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఈ నెల 3వ తేది గురువారం ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టుల బంద్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం మన్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించి గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. రాష్ట్ర డి.జి.పి. ఆదేశాల మేరకు మన్యంలో అదనపు పోలీసు బలగాలను మోహరించి అణువణునా సోదా నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసు ఉన్నత అధికారులు అన్ని కోణాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసారు. ఎన్‌కౌంటర్‌లో చావు దెబ్బతిన్న మావోయిస్టులు ఎటువంటి విధ్వాంసకర సంఘటనలకు పాల్పడేందుకు వీలు లేకుండా పోలీసు అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎ.ఒ.బి.లోని మావోయిస్టు ప్రబావిత ప్రాంతాలలో వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుగ్రామాలలో నివసించే ఆదివాసులపై మావోయిస్టుల సమాచారం కోసం ప్రశ్నలు వర్షం కురిపిస్తూ పలు విధాలుగా వారిని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మారుమూల గ్రామాలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసు బలగాలు ప్రవేశించి సోదాలు నిర్వహిస్తుండడంతో కుగ్రామాల గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలను కట్టడి చేసేందుకు మారుమూల గ్రామాలలో జల్లెడ పడుతున్న పోలీసులు ప్రధాన మార్గాలలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏజెన్సీలోని పదకొండు మండలాల్లో ప్రతి మార్గంలో పోలీసు బలగాలు పహరా కాస్తూ వాహనాల తనిఖీలను ముమ్మరం చేసారు. రహదారులపై ప్రయాణిస్తున్న అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా సోదా చేసి వాహనాలలో ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ వాహనం ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది వంటి అంశాలను పోలీసులు ఆరా తీస్తుడడమే కాకుండా వాహనదారులు వెళుతున్న ప్రదేశాలకు ఎందుకు వెళుతున్నారనే దానిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏజెన్సీలో ఎక్కడ చూసినా అధిక సంఖ్యలో పోలీసులే దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఏజెన్సీలోని ప్రభుత్వ కార్యాలయాలపై మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసు భద్రతను పటిష్టం చేసారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రి వేళల నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు మన్యంలోని ప్రజా ప్రతినిధులకు, ముఖ్యమైన రాజకీయ నాయకులకు మావోయిస్టుల నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీసు అధికారులు ఇప్పటికే వారిని అప్రమత్తం చేసి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేసారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు మావోల నుంచి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న పోలీసు అధికారులు వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలతో ఇప్పటికే ఏజెన్సీలోని కొందరు నాయకులు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లిపోగా ఈ ప్రాంతంలోనే ఉన్న మరికొంత మంది నాయకులు మాత్రం తమను తాము రక్షించుకునేందుకు పోలీసుల సూచనల మేరకు పలు విధానాలను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా బంద్ మావోయిస్టులు తలపెట్టిన బంద్ దృష్ట్యా పోలీసు వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అన్ని ముందు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు. మావోల బంద్‌ను విఫలం చేసేందుకు, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనకు తావులేకుండా చర్యలు చేపట్టారు. మావోల బంద్ పిలుపుకు ఎవరు స్పందించరాదని, వ్యాపారులు తమ దుకాణాలను తెరిచి ఎప్పటివలే వ్యాపార లావాదేవీలను కొనసాగించాలని పోలీసు అధికారులు ఈ ప్రాంత వ్యాపారులకు హుకుం జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారుల ఆదేశాలు, హెచ్చరికలతో మన్యంలోని వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. పోలీసుల హెచ్చరికలతో తాము దుకాణాలు తెరిస్తే మావోయిస్టుల నుంచి ఎటువంటి ప్రమాదం సంబవిస్తుందోనని, దుకాణాలు తెరవకపోతే పోలీసులు తమపై ఏం చర్యలు తీసుకుంటారోనని మన్యం వ్యాపారులు ఆందోళన చెందుతూ తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల బంద్ పిలుపుకు వ్యాపారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని అంటున్నారు. ఏదిఎమైనా మవోల బంద్ పిలుపుతో మరింత అప్రమత్తమైన పోలీసు వర్గాలు మన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపడుతుండడంతో ఎప్పుడు ఎక్కడ మళ్లీ ఏం జరుగుతుందోనని ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తుంది.
పోలీస్‌స్టేషన్లు, ప్రజాప్రతినిధులే టార్గెట్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 2: మావోయిస్ట్ ఇచ్చిన బంద్ పిలుపు అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గత నెల 24న బెజ్జంగి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్ట్‌లు హతమైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారీ విధ్వంసానికి మావోయిస్ట్‌లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్న ఊహాగానాలు వెలువడడంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బెజ్జంగి ఎన్‌కౌంటర్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పోలీసులను ఆయుధంగా ఉపయోగించుకుని, నిరాయుధులైన మావోయిస్ట్‌లను కిరాతంగా హతమార్చారని దళ నేతలు పేర్కొంటున్నారు. దీంతో ప్రజా ప్రతినిధులు, పోలీసులు, పోలీస్ స్టేషనే్ల లక్ష్యంగా మావోయిస్ట్‌లు విధ్వంసానికి పాల్పడతారన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీతోడు బెజ్జంగి ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్‌లో మావోల హిట్ లిస్ట్‌లో సుమారు 20 మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో సీలేరు, అన్నవరం పోలీస్ స్టేషన్లను మావోయిస్ట్‌లు పేల్చేసిన ఘటనలు ఉన్నాయి. అలాగే ఏఓబిలోని మరికొన్ని పోలీస్ స్టేషన్లను పేల్చి వేస్తామని మావోయిస్ట్‌లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీస్ స్టేషన