పశ్చిమగోదావరి

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంటు-2016కు పరీక్షా కేంద్రాల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంటు-2016కు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ పరీక్షకు భీమవరం రీజియన్ కోఆర్డినేటరుగా పెనె్మత్స రామకృష్ణంరాజును ప్రభుత్వం నియమించింది. జెఎన్‌టియు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు కన్వీనర్‌గా అదే యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సిహెచ్ సాయిబాబు కన్వీనరుగా వ్యవహరిస్తున్నారని పిఆర్‌కెఆర్ శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో చెప్పారు. భీమవరం రీజియనులో సుమారు 10వేల మంది ఈ నెల 6న 18 పరీక్ష కేంద్రాలలో పరీక్షకు హాజరవుతారని తెలిపారు. అభ్యర్థులు ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు సంబంధిత సెంటర్లో వారికి కేటాయించిన హాలులో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్ష ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. పరీక్షకు సంబంధించి భీమవరం రీజియన్‌లో ఎస్‌ఆర్‌కెఆర్ క్యాంపస్‌లో మూడు పరీక్ష కేంద్రాలు, పద్మశ్రీ డాక్టర్ బివి రాజు కళాశాల క్యాంపస్‌లో నాలుగు పరీక్ష కేంద్రాలు, డిఎన్‌ఆర్ కాలేజి క్యాంపస్‌లో నాలుగు పరీక్ష కేంద్రాలు, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఒకటి, వియస్‌కె కళాశాలలో ఒకటి, కెజిఆర్ కళాశాలలో మూడు, ఆదిత్య కళాశాలలో రెండు ఏర్పాటు చేసామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.