పశ్చిమగోదావరి

8నుండి ప్రత్యేక సాధికార సర్వే:జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 5 : జిల్లాలో ప్రజాసాధికార సర్వేలో పాల్గొనని కుటుంబాలకు ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక సర్వే కార్యక్రమం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రజాసాధికార సర్వే అమలుపై శనివారం సాయంత్రం మండల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 3975332 మంది జనాభాకు గాను ఇంతవరకు 3332906 మంది ప్రజల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగిందని, ఇంకా 625873 మంది వివరాలను సేకరించాల్సి వుందన్నారు. వీరిలో చాలా మంది సర్వే సమయంలో ఇంటిలో లేకపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్లడం తదితర కారణాలతో వివరాలను అందించలేకపోయారన్నారు. వీరి వివరాలను నమోదు చేసేందుకు 8 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని, ఆయా తేదీల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సర్వే నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంపై టాంటాం ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఈ సర్వే వివరాలు ఎంతగానో ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. సమీక్షలో డి ఆర్‌వో కె హైమావతి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆర్‌వి సూర్యనారాయణ, ఆర్‌డివో శ్రీనివాసరావు, నిక్‌నెట్ అధికారి శర్మ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ దొర తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సహకారంతో రాష్ట్రంలో వైద్యశాలలు
ఆరోగ్యశాఖ మంత్రి కామినేని
పోలవరం, నవంబర్ 5: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని వైద్యశాలలకు నూతన భవనాలు నిర్మించడంతో పాటు వైద్యపరంగా ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎల్‌ఎన్‌డి పేట గ్రామంలో సుమారు 68 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వైద్యశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల వైద్యశాలల్లో ఒపి కేసులు పెరగడంతో పాటు డెలివరీలు కూడ పెరిగాయన్నారు. ఏజన్సీ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు జీతం కాకుండా అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ చివరగా ఉందన్నారు. అలాగే డెంగ్యూ వ్యాధులు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ వైద్యశాలలను తరచు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, డిఎంహెచ్‌ఒ కె కోటేశ్వరి, ఎఎంసి చైర్మన్ పారేపల్లి రామారావు, ఆర్డీవో ఎస్ లవన్న, ఎంపిపి పైల అరుణకుమారి, జడ్పీటీసీ కుంజం సుభాషిణి, ఎల్‌ఎన్‌డి పేట సర్పంఛ్ సోయం పద్మ, కుంచే దొరబాబు, బొరగం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వచ్చే బడ్జెట్‌లో కొవ్వూరు-్భద్రాచలం రైల్వేలైన్‌కు నిధులు
ఎంపి మాగంటి బాబు
జంగారెడ్డిగూడెం, నవంబర్ 5: రానున్న కేంద్ర బడ్జెట్‌లో కొవ్వూరు-్భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు మంజూరు కానున్నట్టు ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) చెప్పారు. శనివారం ఆయన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద దేవస్థానం ఛైర్మన్ యిందుకూరి రంగరాజు, ఇఒ పెనె్మత్స విశ్వనాథరాజు (శివ) స్వాగతం పలికి, పూజల అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు. స్వామివారి అన్నదాన సత్రంలో భక్తులకు వడ్డన చేసిన ఎంపి మాగంటి బాబు సత్రంలోనే భోజనం చేశారు. అనంతరం స్టీమ్ సిస్టమ్ వంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాగంటి విలేఖరులతో మాట్లాడుతూ కొవ్వూరు-్భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే పూర్తయిందని చెప్పారు. గత 40 ఏళ్లుగా మెట్ట ప్రాంత ప్రజానీకానికి కలగా మిగిలిపోయిన ఈ రైల్వేలైన్‌కు సర్వే పూర్తి చేయడం ఈ ప్రభుత్వ ఘనత అన్నారు. ఈ రైల్వేలైన్ పూర్తయితే ఒనగూరే ప్రయోజనాలు గత నెల 26న కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్‌ప్రభును కలసి వివరించి, నిధులు మంజూరుచేయాలని కోరినట్టు బాబు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి సురేష్‌ప్రభు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. తన హయాంలోనే ఈ రైల్వేలైన్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని బాబు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఒక కల అని, ఆ కలను నేడు ప్రధాని నరేంద్రమోది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల పోలవరం ప్రాజెక్టు వంటి ప్రయోజనం సిద్ధించిందన్నారు. విభజన వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13 కేంద్ర విద్యాసంస్థలు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన జరగకపోతే ఇటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వచ్చేవేకావన్నారు. మెట్ట ప్రాంతంలో పొగాకు, పామాయిల్, చెరకు, మొక్కజొన్న వంటి వివిధ రకాల పంటలు పండుతున్నాయని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు దేవుని సొమ్ముకు జవాబుదారీగా ఉండాలని, ఐక్యంగా ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి జరుగుతోందని, విదేశాల నుండి దేశంలోకి వస్తున్న సిగరెట్లను నిరోధించినట్టయితే దేశీయ పొగాకు రైతులకు మంచి ధరలు లభిస్తాయన్నారు. పొగాకు రైతులు కూడా క్రమేపీ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు చింతల వెంకటరమణ, జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు శీలం రామచంద్రరావు, ఘంటా సుధీర్‌బాబు, పోలవరం ఎఎంసి ఛైర్మన్ పారేపల్లి రామారావు, టిడిపి నాయకులు మండవ లక్ష్మణరావు, గంగిరెడ్ల మేఘలాదేవి, పెనుమర్తి రామ్‌కుమార్, రాజాన సత్యనారాయణ, ముళ్ళపూడి శ్రీనివాసరావు, నంబూరి రామచంద్రరాజు, తూటికుంట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.