పశ్చిమగోదావరి

తెలంగాణలో ‘ప్రత్యామ్నాయ’ం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, నవంబర్ 8: తెలంగాణలో అప్రజాస్వామికంగా ఏకపక్ష కుటుంబ పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్ పాలనకు వ్యతిరేకంగా భావసారుప్యత గల పార్టీలన్నింటినీ సంఘటితం చేసి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని రూపొందించడానికి సిపిఐ ఆధ్వర్యంలో ప్రయత్నాలను ముమ్మరం చేశామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి వెల్లడించారు. తొర్రూరు మండలకేంద్రంలో జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నిర్మాణ మహాసభల్లో భాగంగా మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రెండున్నరేళ్ల ప్రభుత్వపాలనపై ప్రజల్లో చర్చ, అసంతృప్తి మొదలైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి అశాస్ర్తియంగా జిల్లాల పునర్విభజన చేపట్టారని, అదేవిధంగా ప్రజా సమస్యలపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు నియోజకవర్గాల పునర్విభజన అంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పాత హామీలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త హామీలు ఇస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ప్రజలతో మైండ్‌గేం ఆడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనకు, ప్రభుత్వానిక అనుకూలంగా బూటకపు సర్వే ఫలితాల పేరుతో ప్రకటనలు చేస్తూ కేసిఆర్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బంగారు తెలంగాణ చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి దానిని విస్మరించి తాజాగా ఆధ్యాత్మిక తెలంగాణ అంటూ కొత్త పాట ఎంచుకున్నారని, తెలంగాణ ప్రజలు సామాజిక బతుకు తెలంగాణ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కేవలం రెండున్నరేళ్ల లోనే కోటి ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అదుపుతప్పుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. లక్షా 30 వేల బడ్జెట్ అంటూ అంకెల గారడీతో ప్రజలను మరోసారి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధణ చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసే చర్యలో భాగంగా ఇప్పటి వరకు 11 జిల్లాల్లో జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీల ఏర్పాటు పూర్తి అయిందని, ఈ నెలాఖరుకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ పాలనలో సంఘ్‌పరివార్ ఆగడాలు పెరిగాయనీ.. నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తోందని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తమ్మెర విశే్వశ్వర్‌రావు, సిఐఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.