పశ్చిమగోదావరి

అందుబాటులోకి ఆధునిక యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 18 : డ్రైన్లలో పూడిక తీయాలన్నా, రోడ్డులో గతుకులను సరిచేయాలన్నా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలన్నా ఆధునిక యంత్రాలు అందుబాటులోనికి వచ్చాయని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు తూర్పులాకుల వద్ద కొమడవోలు గ్రామ పంచాయితీలో ఈ యంత్రంను శుక్రవారం బడేటి బుజ్జి స్వయంగా నడిపి ప్రారంభించారు. ఇరుకు సందుల్లో కూడా ఈ యం6తాన్ని తీసుకువెళ్లే వసులుబాటు ఉన్నదని ఈ యంత్రానికి పలు పరికరాలను ఎటాచ్ చేసి పలు కార్యక్రమాలను వినియోగించుకోవచ్చునని గ్రామ పంచాయితీలలో పారిశుద్ధ్య పనులు నిర్వహణకు ఈ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. 20 లక్షల రూపాయలు ఖరీదైన ఈ యంత్రానికి మరో 30 లక్షల రూపాయలు విలువైన అయిదు రకాల యంత్రాలను అనుసంధానం చేసుకోవచ్చునని ఈ యంత్రం ద్వారా గ్రామాల్లో రోడ్డు లెవెలింగ్ పనులు, చిన్న చిన్న డ్రైన్లలో కూడా పూడిక తీత పనులను చేయించవచ్చునని ముఖ్యంగా చెత్తకుప్పలను తొలగించి రోడ్లను అందంగా తీర్చిదిద్దే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. 50 లక్షల రూపాయలు విలువైన ఈ యంత్రం అద్దె ప్రాతిపదికపై కూడా సమకూరుస్తున్నారని గ్రామ పంచాయితీలు తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ యంత్రాలను అద్దెకు తీసుకుని పల్లెల్లో పారిశుద్ధ్య పనులకు వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో డిపివో కె సుధాకర్, ఎంపిపి రెడ్డి అనురాధ, జడ్పీటిసి మట్టా రాజేశ్వరి, మండల పరిషత్తు ఉపాధ్యక్షురాలు మోరు హైమావతి, ఎండివో ప్రకాష్‌రావు, డ ఇల్‌పివో రాజ్యలక్ష్మి, ఏలూరు కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సూర్యారావు, సర్పంచ్ గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జిలతో కాంట్రాక్ట్ లెక్చరర్ల నిరసన
జంగారెడ్డిగూడెం, నవంబర్ 18: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పదవ పిఆర్‌సి సూచించిన విధంగా బేసిక్, డిఎలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ నిరసన తెలిపినట్టు లెక్చరర్లు పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరిస్తామని, 22 నుండి 24 వరకు పోస్టుకార్డుల ఉద్యమం, 25 నుండి 28వరకు వినతిపత్రాలు, 28న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, డిసెంబర్ 1న కాంట్రాక్ట్ లెక్చరర్లు కుటుంబ సభ్యులతో కలసి ఛలో విజయవాడ, 2న నిరవధిక సమ్మె నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నిరసనలో సిహెచ్ రమాదేవి, ఎం.ఉషారాణి, టి స్కైలాబ్, వి శ్రీనివాస్, బి చంద్రశేఖర్, పిఎన్ సత్యనారాయణ, వి సుబ్బారావు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.