పశ్చిమగోదావరి

చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 18: 2014 ఎన్నికలకు ముందు జిల్లాలోని పాదయాత్ర చేస్తున్న సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ హామీలను మర్చిపోయారని జిల్లా కాపునాడు అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడు అన్నారు. అసలు సీఎంకు చిత్తశుద్ధిలేదన్నారు. ఇచ్చిన హామీలను మరిచిపోతున్న చంద్రన్న భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని వెంకట్రాయుడు తెలిపారు. శుక్రవారం భీమవరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 30 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీల పట్ల శ్రద్ధ వహించడం లేదని వివరించారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు నాయుడు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. కాపులకు ప్రత్యేక కోటా ఇవ్వాలని మరో పక్క బీసీలు కూడా చెబుతున్నారని చెప్పారు. కాపు జాతి కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడను గృహనిర్బంధం చేయడం తగదన్నారు. ఎప్పటికైనా ఆయన పాదయాత్ర చేస్తారన్నారు. పోలీసులు ఆయనను విడుదల చేయకపోతే రానున్న కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో, జెఎసితో చర్చించి చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటామని వెంకట్రాయుడు చెప్పారు. రాష్ట్ర జెఎసి నాయకులు ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ టిడిపిలోకాపులు తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చెలమలశెట్టి రామానుజయకు పాదయాత్రలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. నెలకో పథకాన్ని ప్రవేశపెట్టి కాపులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1000 కోట్లు పై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో సొమ్ములు దుర్వినియోగం జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడుని కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని పట్టణ అధ్యక్షులు బేతు కృష్ణారావు అన్నారు. యువ కాపునాడు జిల్లా అధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు, కోయ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.