పశ్చిమగోదావరి

సోమారామంలో ‘గంగాహారతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 18: ఆధ్యాత్మిక కేంద్రం, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న చంద్రపుష్కరిణి వద్ద శుక్రవారం రాత్రి గంగాహారితి నిర్వహించారు. గంగాహారతిలో భాగంగ స్పటిక లింగాన్ని కూడ ఏర్పాటుచేశారు. ఈ గంగాహారతికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్యఅతిధిగా హారజయ్యారు. ముందుగా స్వామి వారికి ఎమ్మెల్యే పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు ఆద్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. స్పటిక లింగానికి కూడ భక్తుల సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గంగాహారతి ఇచ్చారు.హర హర మహాదేవ అంటూ భక్తులు గంగాహారతిలో స్వామివారి నామస్మరణ చేశారు.