పశ్చిమగోదావరి

దేశాన్ని దగా చేసిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దగా చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆరోపించారు. దేశంలో 25 శాతం నకిలీ నోట్లు చలామణీలో ఉంటే ఆ ప్రభుత్వం చూస్తూ ఉందన్నారు. 75 ఏళ్లలో ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారన్నారు. ఇప్పుడు దేశానికి మోదీ దేశానికి ఐకాన్‌గా మారారన్నారు. శుక్రవారం భీమవరంలో ఎంపి డాక్టర్.గోకరాజు గంగరాజు కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలోని స్వామివారి దర్శనానికి క్యూలో గంటల తరబడి నిలబడటం,సినిమా టిక్కెట్లు కోసం క్యూ కడతాం, విపత్తుల సమయంలో లైన్లో ఉంటాం. కాని కరెన్సీ మార్పు చేసుకునేందుకు నిముషం కూడ క్యూలో వేచి ఉండకపోతే ఎలా అని ప్రశ్నించారు. దేశం కోసం సంయమనం పాటించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భావితరాల కోసం ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని ఆయన కోరారు. నోట్ల మార్పిడిపై హడావుడి చేస్తున్న మమతా బెనర్జీ బెంగాల్‌లో 30 శాతం నకిలీ కరెన్సీ ఉందని గుర్తుంచుకోవాలన్నారు. దేశానికి ఐకాన్‌గా ఉన్న నరేంద్ర మోదీని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు. బీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జల్లి మధుసూధన్ మాట్లాడుతూ రాజమండ్రిలో నిర్వహించిన సభ కన్న తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన రైతు సభ చాలా పెద్ద సభ అని అన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ గ్రామ స్ధాయిలో పర్యటనలు చేస్తుందన్నారు. అన్నదాతల ఆత్మగౌరవాన్ని బిజెపి ఏ విధంగా కాపాడిందో అమిత్‌షా వివరిస్తారన్నారు. దేశంలోని వ్యవసాయరంగానికి బిజెపి ఏం చేసిందో చెప్పడం జరుగుతుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షులు అల్లూరి సాయిదుర్గరాజు, పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, ఆకివీడు మండ ప్రతినిధి నేరేళ్ళ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.