పశ్చిమగోదావరి

అక్కడ సన్మానం... ఇక్కడ సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 18 : అక్కడ సన్మానం జరుగుతుంటే ఆ ప్రభావం పక్కజిల్లా అయినా పశ్చిమ గోదావరిపై గట్టిగానే కనిపిస్తోంది. రాజకీయ కారణాలో లేక ఇతర సాంకేతిక అంశాలో గానీ తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర అధినేతకు ఘన సన్మానం జరుగుతోంది. దీనితో రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఆ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు అతి భారీ ఏర్పాట్లు యధాప్రకారం చేశారు. అయితే అంచనాలు వేసుకున్నదానికి తగ్గట్టుగా జనాన్ని తరలించాలంటే ఆ జిల్లాలో వున్న బస్సులు సరిపోకపోవడంతో పశ్చిమగోదావరిలో వున్న స్కూలు బస్సులపై కనే్నశారు. ఈ కార్యక్రమానికి జనాన్ని తరలించేందుకు తప్పనిసరిగా బస్సులను పంపించాలని హుకుంలు జారీ చేశారు. దాదాపుగా ప్రభుత్వమే ఇలాంటి హుకుం జారీ చేయడంతో ప్రైవేటు స్కూళ్లన్నీ కిక్కురుమనకుండా బస్సులను లైన్‌లో పెట్టేశారు. అయితే బస్సులన్నీ తూర్పుగోదావరికి పంపిస్తున్నందున ఆ స్కూళ్లన్నీ శనివారం సెలవు ప్రకటించాయి. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. శనివారానికి బదులు ఆదివారం తరగతులు నిర్వహిస్తామంటూ కొన్ని స్కూళ్లు ప్రకటించేశాయి కూడా. ఈ పరిణామాలతో విద్యార్దినీ విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు బస్సులు ఎందుకు పంపిస్తున్నారో తెలియక ఆదివారం తరగతులు ఎలా నిర్వహిస్తారో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి కార్తీకమాసం కావడంతో ఈ ఆదివారం భారీ ఎత్తున వివిధ సంఘాలు, యూనియన్లు వన భోజనాల కార్యక్రమాలను ఏర్పాటుచేసుకున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో మరింత పెరిగిన కుల సంఘాల ఆధ్వర్యంలోనూ ఈ వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరకు రావడంతో ఈ ఆదివారం వన భోజనాలకు విపరీతమైన డిమాండ్ వచ్చిపడింది. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లకు శనివారం సెలవు ఇచ్చి ఆదివారం నిర్వహించాలని యాజమాన్యాలు నిర్ణయించడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు కూడా అక్కడ భారీ ఎత్తున సాగాయి. మరో వైపు ఉభయగోదావరి జిల్లాల పరిధి నుంచి జనాన్ని భారీ సంఖ్యలో తరలించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అక్కడ జిల్లాలో వున్న స్కూల్ బస్సులను ఆ జిల్లా పరిధిలో ప్రజల తరలింపునకు వినియోగించినా పశ్చిమ నుంచి ఈ తరలింపునకు మరింత సంఖ్యలో బస్సులు అవసరం కావడంతో పశ్చిమ బస్సులపై కనే్నశారు. అనుకున్నదే తడవుగా మరిన్ని బస్సుల కోసం యధాప్రకారం రవాణా శాఖను పలకరించిన వెంటనే వారు కోరిన సంఖ్యలో బస్సులను సిద్దం చేసేందుకు ఈ శాఖ రెడీ అయ్యింది. అధికారులు అనుకుంటే జరగనిది ఏముంటుందనుకుని స్కూళ్ల యాజమాన్యాలకు బస్సులు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దానికి యాజమాన్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించి ఉన్న బస్సులను వారికి అప్పగించేశారు. యాజమాన్యాల బలహీనతో అధికారుల ఆదేశాల బలమో గానీ స్కూల్ బస్సులన్నీ రవాణా శాఖ పరం కాగా శనివారం నాటికి పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి బదులుగా ఆదివారం తరగతులు నిర్వహించుకోండని అధికారులు పారేసిన ఉచిత సలహా భుజాన వేసుకుని ఆ రోజున తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. ఇప్పుడు ఇదే తల్లిదండ్రుల్లో అసంతృప్తికి, ఆవేదనకు కారణమవుతోంది.