పశ్చిమగోదావరి

విద్యార్థులను శాస్తవ్రేత్తలుగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 1 : సమాజ హితానికి దోహదపడే శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక కస్తూరిబా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంత్రి సుజాత మాట్లాడుతూ సమకాలిన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధుల్లో సైన్స్‌పై అవగాహన కలిగించి మంచి శాస్తవ్రేత్తలుగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత వుందన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాలన్నారు. అబ్దుల్ కలాం పేర్కొన్న విధంగా కలలను సాకారం చేసుకునే దిశగా బాలబాలికలు చిన్న నాటి నుండే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలన్నారు. తాము అనుకున్నది సాకారం చేసుకునేందుకు ప్రముఖ శాస్తవ్రేత్తల అనుభవాలను పరిశోధనల అంశాలను తెలుసుకోవాలన్నారు. భారతదేశంలో కూడా ఘనత వహించిన శాస్తవ్రేత్తలు ఎందరో వున్నారన్నారు. వారిలో ఆర్యభట్ట గొప్ప గణిత, ఖగోళ శాస్తవ్రేత్త అని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఏటా 20 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని జిల్లాలో ఇందుకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రధానంగా జాతి వృద్ధికి సైన్స్ టెక్నాలజీ, లెక్కలు దోహదపడతాయని ఈ విషయంపై జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రధానాంశంగా ఉంచడం జరిగిందన్నారు. ఆరోగ్యం, పరిశ్రమలు, రవాణా కమ్యూనికేషన్, ప్రకృతిని కాపాడుకునేందుకు వినూత్న వనరులు వినియోగం, ఆహార ఉత్పత్తి భద్రతకు వినూత్న ఆలోచనలు ఈ ప్రదర్శనలో ఉంచేందుకు ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి అందిస్తున్న సాకారాన్ని అందిపుచ్చుకుని బాలబాలికలు ఆయా రంగాల్లో ప్రతిభావంతులుగా నిలిచి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సుజాత ఆకాంక్షించారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్దినీ విద్యార్ధులు భవిష్యత్తుకు విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో కొత్త వంగడాలను సృష్టించడంతోపాటు సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా యువకులు, శాస్తవ్రేత్తలు ముందున్నారన్నారు. ఎమ్మెల్యే బడేటి కోట రామారావు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాలబాలికలకు ఆసక్తి పెంచుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. బాల బాలికలను భావిభారత పౌరులుగా, మేధావులుగా తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు. విద్యారంగానికి ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని బాలలు తమ భవిష్యత్తును ఉజ్వలంగా ఉంచుకోవాలన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ భారత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్దినీ విద్యార్ధులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఈ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడం అభినందనీయమని వీరంతా తమతోటి విద్యార్ధులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి సైన్స్ ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డి మధుసూధనరావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించబడుతుందన్నారు. ఈ ప్రదర్శనలో వ్యక్తిగత, బృంద, ఉపాధ్యాయుల ఎగ్జిబిట్స్‌ను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా మన కొల్లేరు మనం కాపాడుకుందాం, వైద్య ఆరోగ్యం, పరిశ్రమలు, రవాణా కమ్యూనికేషన్ తదితర రంగాలపై విడివిడిగా ఏర్పాటు చేసిన ప్రదర్శనాశాలలను రాష్ట్ర మంత్రి పీతల సుజాత, జడ్పీ ఛైర్మన్ బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎ ఎంసి ఛైర్మన్ కురెళ్ల రాంప్రసాద్, మండల ఉపాధ్యక్షురాలు మోరు హైమావతి, కార్పొరేషన్ విప్ గూడవల్లి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ వై సాయి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.