పశ్చిమగోదావరి

వేదాలే దేశానికి నిజమైన సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, డిసెంబర్ 4: దేశానికి నిజమైన సంపదలు వేద శాస్త్రాలేనని కంచి పీఠ ఉత్తరాధికారి శ్రీ విజయేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఆకివీడు మండలంలోని అయి భీమవరంలో నెలకొన్న వేద పాఠశాల సమీపాన ఉన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆలయానికి ఆయన ఆదివారం వచ్చారు. శతాభిషేక మహోత్సవాల్లో భాగంగా ఆయన ఉదయం నుంచి గోపూజ, త్రికాల పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వేదాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వేద శాస్త్రాలను ప్రచారం చేయడం కూడా అంతే అవసరం అన్నారు. మానవతా విలువలను కాపాడేది వేదాలు మాత్రమేనని అని పేర్కొన్నారు. వాటిని కాపాడితే జీవిత విధానాలే మారతాయన్నారు. అయి భీమవరం గ్రామంలోని వేద పాఠశాలలో విద్యార్థులు సామవేదం, రుగ్వేదం, యజుర్వేదాలు చక్కగా అభ్యసించారన్నారు. అధర్వణ వేదం మాత్రం తగ్గిందన్నారు. గురుకుల పద్ధతులు, ఆచార వ్యవహారాలు చక్కగా ఉన్నాయన్నారు. ఆచారం, అధ్యయనం, అర్ధజ్ఞానం ముఖ్యమన్నారు. వేద మంత్రాలు పఠించేటప్పుడు నియమాలు కచ్చితంగా పాటించాలన్నారు. గ్రామీణ ధార్మిక అభివృద్ధి అయి భీమవరం గ్రామంలో సంపూర్ణంగా జరుగుతోందన్నారు. ధార్మిక అవసరాలు పూర్తిచేసే కేంద్రంగా అభివృద్ది చెందుతుందన్నారు. అనంతరం కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి పీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా పుష్పాభిషేకం చేశారు. అనంతరం గ్రామస్థులు వీరి ఇరువురిని ఘనంగా సన్మానించారు. ఎంపి గోకరాజు గంగరాజు, టిటిడి మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, అన్నపూర్ణమ్మ దంపతులు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయలు, గోకరాజు రామరాజు, ఎఎంసి చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, కనుమూరి రఘురామకృష్ణంరాజు, పాతపాటి సర్రాజు, ఆకివీడు మండల బిజెపి అధికార ప్రతినిధి నేరేళ్ళ పెదబాబు, మనే్న లలితాదేవి, పిన్నంరాజు వాణి, పొత్తూరి ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.