పశ్చిమగోదావరి

హాస్టళ్ల పనితీరు మెరుగునకు ప్రత్యేకాధికార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 5 : జిల్లాలో సంక్షేమ హాస్టల్స్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి హాస్టల్స్‌ను మరింత పటిష్టవంతంగా నిర్వహించడానికి 47 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించామని, ప్రతీ వారం అధికారి హాస్టల్‌లో రాత్రి మకాం చేసి విద్యార్ధినీ విద్యార్ధులో మమేకం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 173 ఎస్‌సి, ఎస్‌టి, బిసి హాస్టల్స్ ఉన్నాయని ఈ హాస్టల్స్‌లో ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్ధినీ విద్యార్ధులకు సక్రమంగా భోజనాలు పెడుతున్నారా? హాస్టల్స్‌లో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా? విద్యార్ధినీ విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితులు ఎలా వున్నాయి అనే అంశాలపై ప్రతీ మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించామన్నారు. వీరు ప్రతీ వారం హాస్టల్స్‌ను తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే హాస్టల్స్ స్థానంలో రెసిడెన్షియల్ పాఠశాలల వైపు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూడా వౌలిక వసతులు ఎలా వున్నాయి? విద్యార్ధినీ విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందా లేదా అనే అంశాలపై సమగ్రంగా చర్చించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో హాస్టల్స్‌కు ప్రత్యేకాధికారి గార్డియన్‌గా వ్యవహరించాలని విద్యార్ధుల పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ప్రతీ వారం అధికారులు ఒక హాస్టల్‌లో బస కచ్చితంగా చేసి తీరాలని చెప్పారు. సంక్షేమ హాస్టల్స్ పనితీరుపై ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, హాస్టల్‌లో డ్రైవింగ్ హాల్, వంటగది తదితర పరిసరాలు ఎలా వున్నాయో ఫొటోలను తీసి అప్పటికప్పుడే ఆన్‌లైన్ ద్వారా యాప్‌లో పొందుపర్చాలని కలెక్టర్ సూచించారు.
పట్టాలివ్వకపోతే మేమే పంచుతాం
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 5: జంగారెడ్డిగూడెం పట్టణంలో, రూరల్ మండలంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు తక్షణమే నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలుగా పంపిణీ చేయాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతి తామే పేదలకు పంపిణీ చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ అధికారులకు అల్టిమేటం జారీచేశారు. పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో, రూరల్ మండలంలో పేదలకు ఇళ్లు లేక ఒక్కొక్క ఇంట్లో రెండు, మూడు కుటుంబాల వారు నివసిస్తున్నారన్నారు. సిపిఐ మండల కార్యదర్శి బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ పట్టణంలో 20 వార్డులలోను, మండలంలోని 20 పంచాయతీలలోను పేదలు ఇళ్ళ స్థలాలు లేక ఇక్కట్లు పడుతున్నారని పేర్కొన్నారు. ధర్నా అనంతరం ఆర్డీవో ఎస్ లవన్నకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో లవన్న వెంటనే ఇళ్ళు లేని నిరుపేదల జాబితా తయారుచేయాలని తహసీల్దారు జివివి సత్యనారాయణను ఆదేశించారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. సిపిఐ నేతలు బూరుగుపల్లి సూరిబాబు, మన్నవ కృష్ణచైతన్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ సాలి రాజశేఖర్ తదితరులు నాయకత్వం వహించారు.