పశ్చిమగోదావరి

భూసారం పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 5: పంటలకు అధిక దిగుబడులు, ఆదాయం వచ్చేందుకు భూసారం పెంచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం రూరల్ మండలం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నేలల దినోత్సవం, కిసాన్ సమ్మేళన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ వ్యవసాయానికి నీరు, నేల ప్రధాన అంశాలని, అవి కాలుష్యానికి గురి కావడంతో రైతులు మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. సేంద్రీయ ఎరువులతో భూసారాన్ని పెంపొందించుకుని ఆరోగ్యకరమైన పంటలు, అధిక దిగుబడులు సాధించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా రైతులకు ఇప్పటికే భూసార కార్డులు అందించామన్నారు. శాస్తవ్రేత్తలు తెలిపిన విధంగా ఎరువులు వినియోగించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలన్నారు. సీనియర్ శాస్తవ్రేత్త ఇ కరుణశ్రీ మాట్లాడుతూ కూరగాయల పంటలు పండించే రైతులు నేలను సారవంతం చేసుకోవాలన్నారు. అనంతరం గిరిజన ఉపప్రణాళిక, ఇతర కార్యక్రమాల్లో భాగంగా 250మంది రైతులకు భూసార పరీక్షా కార్డులను మంత్రి మాణిక్యాలరావు పంపిణీ చేశారు. గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధి, ఆహార భద్రతకై కోడిపిల్లలు, తేనెటీగల పెంపకంపై శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్ట్ఫికెట్లు పంపిణీ చేశారు. జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పరిశోధనలు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రైతులు భూసారాన్ని పరీక్షించుకుని దానికనుగుణంగా పంటలు వేసుకుని లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పాతూరి రాం ప్రసాద్ చౌదరి, కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ సంచాలకులు డాక్టర్ ఆర్‌వి ఎస్‌కె రెడ్డి, పరిశోధన సంచాలకులు డాక్టర్ జె దిలీప్‌బాబు, డాక్టర్ ఎంవిఎన్ రావు, పిఆర్వో రత్నకిషోర్ తదితరులు పాల్గొన్నారు.