పశ్చిమగోదావరి

ద్వారకాతిరుమల ఆలయంలో... పెరగనున్న తలనీలాల టిక్కెట్ల రుసుము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, డిసెంబర్ 5: శ్రీవారికి భక్తులు సమర్పించే తలనీలాల టిక్కెట్ల రుసుము పెరగనుంది. ఇప్పటి వరకు రూ.10 ఉన్న టిక్కెట్టు రూ.15లకు పెంచేందుకు చిన వెంకన్న ట్రస్టు బోర్డు గతంలోనే నిర్ణయించగా రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ ఆమోద ముద్రవేశారు. దీంతో ప్రస్తుతం రూ.10లు ఉన్న పూర్తిక్షవరం, మూడు కత్తెరింపుల టిక్కెట్ల ధరలు రూ.15కు పెంచుతున్నారు. ఆలయంలో పనిచేసే క్షురకులకు ఇప్పటివరకు రూ.10ల టికెట్ రుసుములో రూ.5 కమిషన్‌గా దేవస్థానం అందిస్తోంది. టిక్కెట్ రుసుమును రూ.15లకు పెంచి అందులో రూ.10లకు క్షురలకు కమిషన్‌గా అందించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన అన్నవరం, సింహాచలం, విజయవాడ వంటి దేవాలయాల్లో ఈ టిక్కెట్ల రుసుమును కొనే్నళ్ల క్రితమే రూ.15కు పెంచారు. తాజాగా శ్రీవారి ఆలయంలో రుసుములను పెంచుతూ అధికారులు నిర్ణయించారు. అతిత్వరలో ఈ కొత్త ధరలు అమలవుతాయని ఆలయ ఇఒ వేండ్ర త్రినాథరావు తెలిపారు.