పశ్చిమగోదావరి

ముక్కుతూ...మూలుగుతూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 5: రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టిడిపి అధిష్ఠానం సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టిసారిస్తే, జిల్లాలో మాత్రం సభ్యత్వ నమోదు అంతంతమాత్రంగా సాగుతోంది. నవంబర్ 30 నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియాల్సివుండగా మరో పక్షం రోజులు పెంచారు. డిసెంబర్ 15తో సభ్యత్వ నమోదు ముగుస్తుంది. అయితే గత ఏడాది కన్నా ఈ ఏడాది సభ్యత్వ నమోదు మందగించిందని చెప్పవచ్చు. గత ఏడాది జిల్లాలో 4.2 లక్షల సభ్యత్వాలు చేయగా ఈ ఏడాది 5.3 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రంలోనే ప్రథమంలో ఉండాలని జిల్లా టిడిపి భావిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే సభ్యత్వాలు గత ఏడాది స్థాయికి చేరే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, నేతలు సభ్యత్వ నమోదుపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని కొంతమంది కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయత్వానికి నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిన్నటి వరకు జన చైతన్య యాత్రల వల్ల సభ్యత్వ నమోదు మందగించిందని పార్టీ భావించింది. కాని ఈ యాత్రలు ముగిసినా నమోదు అదే తీరులో ఉండటంపై పార్టీ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక జిల్లాలో నూరుశాతం లక్ష్యాన్ని పూర్తిచేసి, ఇంకా నమోదు చేస్తున్న వాటిలో పాలకొల్లు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టిసారించడంతో నూరుశాతం సభ్యత్వం పూర్తిచేశారు. అదే వరుసలో పోలవరం, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు చేరాయి. ఇక ఈ సభ్యత్వ నమోదులో భీమవరం నియోజకవర్గం బాగా వెనుకబడి ఉంది. జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు నియోజకవర్గం తాడేపల్లిగూడెంలోనూ అదే సీను. ఇక గనుల శాఖా మంత్రి పీతల సుజాత నియోజకవర్గం చింతలపూడిలో కూడ 50 శాతం సభ్యత్వం పూర్తికాలేదు. వీరి బాటలోనే నరసాపురం, తణుకు నియోజకవర్గాలు క్యూ కట్టాయి. మరి కొన్ని నియోజకవర్గాలు ఫర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. ఇదిలావుండగా ఈ నెల 15తో ముగియునున్న సభ్యత్వ నమోదు ఎంత వరకు వేగం పుంజుకుని టార్గెట్‌ని పూర్తి చేస్తుందో వేచి చూడాల్సిందే.