పశ్చిమగోదావరి

ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 8: మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఆలయ ప్రాంగణంలో ఘర్షణకు దిగారు. ఈ విషయం తారస్ధాయికి చేరడంతో ధర్మకర్తల మండలి గురువారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఛైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన దేవస్థానంలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్ బి బాబురావు, ముఖ్య అర్చకులు ఎం వెంకటరమణశర్మ ఆలయ ప్రాంగణంలో గొడవకు దిగారు. ఈ గొడవ ఘర్షణకు దారి తీసింది. దీంతో వారిలో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళావేదిక వద్ద ఇరువురు ఉద్యోగులు వీధిరౌడీల్లా కొట్టుకోవడంపై సమావేశంలో చర్చించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసి, దేవాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇద్దరిని సస్పెండ్ చేశామని ఛైర్మన్ వివరించారు. ఒకేసారి క్రమశిక్షణ చర్యలో భాగంగా ఇరువురినీ సస్పెండ్‌చేసి తదుపరి వీరిపై విచారణ కూడా తొందరగా చేపట్టి బాధ్యలైన వారిపై చర్యలు తీసుకోవలసిందిగా కమిషనర్‌ను కోరుతూ ట్రస్ట్‌బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు.