పశ్చిమగోదావరి

హడలెత్తిస్తున్న భారీ గిరినాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, ఏప్రిల్ 5: మండలంలోని చింతలగూడెం, నిమ్మలగూడెం, మంగయ్యపాలెం తదితర గ్రామాల శివారు పరిసరాల్లో భారీ గిరినాగు సంచరిస్తున్నట్లు ఆయా గ్రామాల గిరిజన యువకులు తెలిపారు. యువకులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగురోజుల క్రితం చింతలగూడెం సమీపంలోని పొలాల్లో పనిచేసుకుని ఇళ్ళకు వెళుతుండగా, సుమారు 15 అడుగుల పొడవుతో ఉన్న భారీ గిరినాగు తుప్పల్లో నుండి వెళ్ళడం గమనించారు. తిరిగి ఆదివారం అదే పరిమాణంలో గిరినాగు నిమ్మలగూడెం సమీపంలోని జామాయిల్ తోటల్లో కనబడిందని మరికొందరు తెలిపారు. గతంలో నిమ్మలగూడెం, చింతలగూడెం పరిసరాల్లో భారీ గిరినాగు పాములు గ్రామస్థుల చేతికి చిక్కి హతమయ్యాయి. మండలంలో ఈ ప్రాంతంలోనే గిరినాగులు దర్శనమివ్వడం విశేషం.