పశ్చిమగోదావరి

భీమవరం మున్సిపాలిటీకి మిగులు బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 26: భీమవరం పురపాలక సంఘం 2017-18 సంవత్సరానికి మిగులు బడ్జెట్‌ను ఆమోదించారు. బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. కొనే్నళ్ల క్రితం నుంచి ప్రవేశపెట్టిన వాటికి భిన్నంగా 2017-18 అంచనాలను రూపొందించారు. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ నాగనర్సింహరావు ముందు నుంచి బడ్జెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని అకౌంటెంట్ సాగి సత్యనారాయణరాజు తన విభాగంతో కలిసి బడ్జెట్‌కు కొత్తదనాన్ని ఇచ్చారు. 2017-18 సంవత్సరానికి బడ్జెట్‌కు సాధారణ, కాపిటల్ జమ కలిపి ప్రారంభ నిల్వగా రూ.5,79,03,000 తీసుకుని సాధారణ, మూలధనం ఆదాయం రూ.83,54,79,000 అంచనా జమలుగా తీసుకుని రూ.88,44,83,000 ఖర్చులుగా అంచనా వేశారు. రూ.88,99,000 అంత్య నిల్వతో ముగించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 2016-17కి రివైజ్డు బడ్జెట్‌లో రూ.650 లక్షలతో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రావిజన్‌ను చూపించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2016-17కి రివైజ్డు బడ్జెట్‌లో రూ.490 లక్షలు, 2017-18 బడ్జెట్‌లో రూ.566 లక్షలు విడుదలవుతాయని అంచనాలను చూపించారు. పట్టణంలోని మోడ్రన్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కోసం 2017-18 సంవత్సరంలో రూ.100 లక్షలు బడ్జెట్‌లో ప్రావిజన్‌ను చూపించారు. అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత) గ్రాంటు విషయంలో మున్సిపాల్టీ షేరు 30 శాతంతో మంచినీటి సరఫరా అభివృద్ధి నిమిత్తం 2016-17 రివైజ్డు బడ్జెట్‌లో రూ.650 లక్షలు, 2017-18లో రూ.2,600 లక్షలు బడ్జెట్‌లో ప్రావిజన్ చూపించారు. జిఒ 265 ప్రకారం ఇయర్ మార్కుడ్ ఫండ్స్‌గా పట్టణంలో స్లమ్ ఏరియా అభివృద్ధికి 40 శాతం అంటే రూ.456 లక్షలు కేటాయించారు. వీటిలో షెడ్యూల్డు కులాలు నివశించే ప్రాంతానికి 15 శాతం రూ.171 లక్షలు, షెడ్యూల్డు తెగలు నివసించే వారికి 7.5 శాతం అంటే రూ.85.50 లక్షలు, స్ర్తి శిశు సంక్షేమ కార్యక్రమాలకు 5 శాతం రూ.57 లక్షలు కేటాయించారు. ప్రభుత్వ నిధుల కన్నా, మున్సిపల్ నిధులతో పట్టణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రహదార్లు, డ్రెయిన్లకు ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్ తియ్యగా ఉందని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తియ్యగా ఉందని వ్యాఖ్యానించగా, ఇది అంకెల గారడీ అని ప్రతిపక్షం వ్యాఖ్యానించడం విశేషం.

స్వచ్ఛ భారత్‌పై షార్టు ఫిల్మ్
తొలి ప్రదర్శన ప్రారంభించిన మంత్రి మాణిక్యాలరావు
పాలకొల్లు, డిసెంబర్ 26: స్వచ్ఛ్భారత్‌పై సందేశాత్మకంగా రాష్ట్ర స్వచ్ఛ్భారత్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్.సత్యనారాయణమూర్తి (బాబ్జి) నిర్మించి నటించిన షార్టు ఫిల్మ్ తొలి ప్రదర్శనను స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో సోమవారం దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలారవు స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు. పాలకొల్లు అంటే సినీ దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణుల కేంద్రమని, ఇక్కడ ప్రభుత్వం తరఫున ఫిల్మ్ ఇనిస్టిస్ట్యూట్ ఏర్పాటు చేయమని మాజీ ఎంపి జోగయ్య కోరారని, తప్పనిసరిగా దీనికోసం తాను కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. షార్టు ఫిల్మ్ అంటే సందేశం ఒక్కటే ఉండటం కాకుండా చక్కని వినోదం, హాస్యం, సందేశాత్మకం మిళతం చేసి చేసిన చిత్రీకరణ ఆదర్శంగాను,చూడ దగినదిగాను ఉందని ఆయన వాఖ్యానించారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర స్వచ్ఛ్భారత్ కన్వీనర్‌గా ఉన్న బాబ్జి తీసిన ఈ పిల్మిం పార్టీ ప్రయోజనాలకోసం, లేదా వ్యక్తి ప్రయోజనాలు కాకుండా అందరూ ఆచరించ తగన మనం పిల్మిం అని దీనికి మనం జనం ప్రభజనం అనే పేరు పెట్టడం కూడా బాగుందని ఆయన అన్నారు. సంగీత అందించటం పాట అందించటం, చక్కని ఫోటోగ్రాఫీ కూడా ఉందన్నారు. డాక్టర్ బాబ్జీ, ఆయన మనుమడు కూడా ఈ చిత్రంలో నటించటం వారి అనుబంధానికి నిదర్శనమన్నారు. భారత ప్రదాని నరేంద్రమోడి 2014 స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భారత మహిళ సిగ్గు విడిచి రోడ్డు మీద కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి పోవాలని, స్వచ్చ భారత్ కావాలని పిలునిచ్చారని ఆయన వెల్లడించారు. మహత్మా గాంధీ స్వాంత్రత్య తేగలాగారని కాని ఆయన కోరిన స్వచ్చ భారత్ రాలేదని ఆయన అన్నారు. మార్చి నెలాఖరుకు పశ్చిమ గోదావరి జిల్లా నూరుశాతం మరుగుదొడ్లు గల గృహాలు ఉన్న జిల్లాగా ప్రకటించటానికి కృషి జరుగుతుందనని ఆయన వెల్లడించారు. మాజీ పార్లమెంటు సభ్యుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య మాట్లాడుతూ తాను 8 సినిమాలు తీశానని, కానీ డాక్టర్ బాబ్జీ ఒక షార్టు ఫిల్మ్ తీయడమే కాకుండా దానిలో ఆయన నటించటం గొప్పదనమన్నారు. దీనిని జనవరిలో పాలకొల్లులో నిర్వహించనున్న అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించాలని ఆయన ఆహ్వానించారు. దీనిలో నటించిన నటులకు, సంగీతం, ఫొటోగ్రఫీ, ఇతర సాంకేతిక నిపుణులకు మంత్రి మాణిక్యాలరావు మెమెంటోలు అందించారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, జి మాణిక్యాలరావు, యర్రా నవీన్, డాక్టర్ బాబ్జీ, సిరయల్ జోసఫ్ కోరియా, శిడగం పాపారావు, మామిడి శివయ్య, రావూరి సుధ, నాళం బాబీ, డాక్టర్ కెఎస్‌పిఎన్ వర్మ, కబర్ది తదితరులు పాల్గొన్నారు.