పశ్చిమగోదావరి

జన్మభూమితో గ్రామాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, జనవరి 3: ప్రజాసమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ప్రజల వద్దకే అధికారులను తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేసిన జన్మభూమి గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని పాందువ్వ, ఉణుదుర్రు గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి పల్లె సిమెంట్ రోడ్డు, సిమెంట్ డ్రెయిన్‌లతో వుందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లేనన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు రేషన్‌కార్డులు, చంద్రన్న కానుకలు పంపిణీ అమలు జరుపుతున్న ఖ్యాతి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మాట్లాడుతూ ప్రజలు జన్మభూమికి అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలు వివరించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, వృద్ధులకు పింఛన్లు పంపిణీ, కొత్త రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి దలియా లక్ష్మి, జడ్పీటీసీ కరిమెరక వెంకట సత్యతులసి, తహసీల్దార్ వై.దుర్గాకిషోర్, జుత్తిగ శ్రీనివాస్, ఆయా గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
- ధర్మాజీగూడెం ఎస్‌బిఐని తనిఖీచేసిన మంత్రి సుజాత
-ఖాతాదార్ల ఇబ్బందులపై మేనేజర్‌ను నిలదీసిన మంత్రి
లింగపాలెం, జనవరి 3: ఖాతాదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత హెచ్చరించారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ఎస్‌బిఐలో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న మంత్రి మంగళవారం బ్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్యాంకులో కొందరికి మాత్రమే నగదు ఇస్తున్నారని ఖాతాదారులు చెప్పడంతో మంత్రి బ్యాంకు మేనేజర్ బాల భాస్కరరావును నిలదీశారు. తమకు వచ్చిన నగదును ఖాతాదారులందరికీ ఇస్తున్నామని, తగినంత నగదు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఏలూరులో ఉన్న ఎజిఎంతో మంత్రి ఫోనులో మాట్లాడారు. త్వరలో ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎజిఎం మంత్రి సుజాతకు హామీ ఇచ్చారు.