పశ్చిమగోదావరి

కాపీ కింగ్‌లుగా మారారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 7: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు జరిగిన తీరుపై స్వయంగా జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు కాపీకింగ్‌లుగా మారిపోయారనే అర్ధం వచ్చేలా పలు వ్యాఖ్యానాలు చేశారు. టెన్త్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ చేయించిన తీరును కలెక్టరు తప్పుపట్టారు. పరీక్షల ముందు విద్యార్ధుల సత్తా బయటపడితే చాలని, ఉత్తీర్ణతాశాతాల కోసం పోటీలు పడి కాపీయింగ్ విధానానికి పాల్పడవద్దని తాను ఇంతకుముందే చెప్పానని, అయినప్పటికీ ఈసారి మాస్‌కాపీయింగ్ జరిగిందని తన వద్ద సమాచారం ఉందని, దీనివల్ల విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతాయంటూ కలెక్టరు భాస్కర్ విద్యాశాఖాధికారులకు అక్షింతలు వేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖాధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాస్‌కాపీయింగ్ చేయించి ప్రమాణాలు దిగజార్చవద్దని, విద్యార్ధుల్లో అక్రమ ఆలోచనలను కల్పించవద్దని కలెక్టరు మరోసారి విద్యాశాఖాధికారులకు స్పష్టం చేశారు. విద్యార్ధుల్లో చదువు సత్తా ఎంతుందో తేలడానికే పరీక్షా విధానాలను రూపొందించారని, దానిలో మార్కుల కోసం కక్కుర్తిపడే విధంగా మాస్‌కాపీయింగ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని చెప్పారు. మంచి పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువులే విద్యార్ధినీవిద్యార్ధులలో ఇలాంటి ఆలోచనలు కల్పిస్తే ఎలా అని ప్రశ్నించారు. కష్టపడి చదివే పద్దతిని విద్యార్ధినీవిద్యార్ధులకు అలవాటు చేయాల్సిన వారు వారికి చిన్నప్పటినుంచే దొంగదారులు చూపిస్తే ఎలా అభివృద్ధి సాధిస్తారని ప్రశ్నించారు. జిల్లాలో కొన్నిచోట్ల మాస్‌కాపీయింగ్ జరిగినట్లు తనకు తెల్సిందని, ఇది దారుణమని, అక్రమమని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు భవిష్యత్‌లో కొనసాగితే సహించేది లేదన్నారు. అనుభవం, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు వేలాదిమంది ఉన్నారని, వారంతా బాధ్యతగా పనిచేస్తే ప్రతి విద్యార్ధి మెరిట్ సాధిస్తారని తెలిపారు. వేసవి సెలవుల్ల్లో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని డిఇఓ మధుసూధనరావును ఆదేశించారు. ఈ సెలవుల్లో ఉపాధ్యాయులకు మండలస్దాయిలో 15రోజులకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తేదీలు నిర్ణయించి ఉపాధ్యాయులకు సమాచారం అందించి నైపుణ్యం పెంపొందేలా ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. జిల్లాలో క్లస్టర్ రిసోర్స్‌పర్సన్‌ల ఉద్యోగాలను నేరుగా కాకుండా ఎంపిక పరీక్ష ద్వారా నిర్వహించాలన్నారు. వేసవి శెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాలుగురోజులకు ముందుగానే పాఠశాలల్లో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటుచేసి ప్రతి విద్యార్ధికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించాలన్నారు. పాఠశాలల మొదటిరోజున ఏ విద్యార్ధి అయిన యూనిపారం లేకుండా వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే ఇంతవరకు కనీసం యూనిపారం క్లాత్ కూడా తీసుకురాకపోవటం పట్ల కలెక్టరు అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. విద్యాశాఖలో అన్నిస్ధాయిల్లోనూ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం కన్పిస్తోందని, సమావేశాల నాటికి లక్ష్యాలు పూర్తిచేసి హాజరుకావాలని ఆదేశించారు. ఈసందర్భంగా డిఇఓ మధుసూధనరావు కల్పించుకుని కలెక్టరు సమీక్షలు నిర్వహించటం వల్లే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనికి కలెక్టరు స్పందిస్తూ ముఖస్తుతి కోసం ఇలాంటి మాటలు చెప్పవద్దని, సకాలంలో నిర్దేశించిన పనులు చేసి చూపించాలని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఎస్‌ఎ పిఓ డాక్టరు వి బ్రహ్మనందరెడ్డి, ఐటిడిఎ పిఓ షాన్‌మోహన్, ఎంఇఓలు పాల్గొన్నారు.