పశ్చిమగోదావరి

నేడు గోపాలపురం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, జనవరి 20: గోపాలపురం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక శనివారం నిర్వహించనున్నారు. ఎంపిపి గద్దే వెంకటేశ్వరరావు మృతితో ఖాళీ అయిన ఆ పదవిని భర్తీ చేసేందుకు శనివారం అధికారులు ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. చిట్యాల ఎంపిటిసి స్థానానికి దివంగత గద్దే సతీమణి అరుణకుమారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపిపి పదవిని సైతం ఆమెకే కట్టబెట్టేందుకు ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు సముఖత వ్యక్తం చేశాయి. దీంతో ఎంపిపి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ ఎన్నికను అధికారికంగా నిర్వహించాల్సి ఉండడంతో శనివారం ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాధ్యక్ష ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. గతంలో వైస్ ఎంపిపి ఎం రత్నాజీచౌదరి ఎంపిపి గద్దే అకాల మృతితో ఎంపిపిగా బాధ్యతలు స్వీకరించారు. గత ఎన్నికల్లో జరిగిన పెద్దల ఒప్పందం మేరకు రత్నాజీచౌదరి రెండున్నరేళ్లు ఆ పదవిలో కొనసాగగా, ఆ తర్వాత కరగపాడు ఎంపిటిసికి కొర్లపాటి జ్యోతికి ఆ పదవి కట్టబెట్టాల్సివుంది. అయితే రత్నాజీచౌదరి మాత్రం తననీ ఈ పదవిలోనే ఉండేలా చర్య తీసుకోవాలని నాయకులపై వత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. వైస్ ఎంపిపిగా జ్యోతిని ఎన్నుకోవాలని కొందరు భావిస్తున్నారు. ఇదే సందర్భంలో సంజీవపురం ఎంపిటిసి వి దుర్గారావు పేరు సైతం వైస్ ఎంపిపిగా నియమించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైస్ ఎంపిపి ఎవరనేది శనివారం స్పష్టం కానుంది.

రేపటి నుంచి దాళ్వాకు వంతుల వారీ విధానంలో నీరు
ఏలూరు, జనవరి 20: జిల్లాలో రబీ పంటకు అవసరమైన నీటిని అందించడానిళకి ఈనెల 22వ తేదీ నుండి వంతుల వారీ విధానాన్ని పటిష్టవంతంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ఫోన్‌లో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి జలాలను విడుదల చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జలాలు జిల్లాకు చేరడానికి మరో 48 గంటలు పట్టనున్న దృష్ట్యా రైతాంగానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నిరంతరం నీటి లెవెల్స్ కొనసాగేలా చూడాలని కోరారు. గోదావరి పశ్చిమ డెల్టా పరిధిలోని అన్ని కాల్వలకు రబీ 2016-17నకు వంతుల వారీ విధానాన్ని ఈ నెల 22వ తేదీ నుండి అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని ప్రాంతాలతోపాటు సంబంధిత శివారు ప్రాంతాలకు సక్రమంగా సాగునీరు సరఫరా చేయడంలో సహకరించాలని కోరారు. మొదటి వంతు ఈ నెల 22వ తేదీ ఉదయం 6 గంటల నుండి 27వ తేదీ ఉదయం 6 గంటల వరకూ, రెండవ వంతు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు. అదే విధంగా ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 6 గంటల నుండి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండవంతు, ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 6 గంటల నుండి మార్చి 1వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండవంతు, మార్చి 7వ తేదీ ఉదయం 6 గంటల నుండి మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, మార్చి 12వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండవ వంతు, మార్చి 18వ తేదీ ఉదయం 6 గంటల నుండి మార్చి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మొదటి వంతు, మార్చి 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ రెండవ వంతు నీటి సరఫరా సాగుతుందని కలెక్టర్ చెప్పారు.