పశ్చిమగోదావరి

రహదారి నిబంధనలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జనవరి 20: రహదారి నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను, మరణాలను నివారించేందుకు సమన్వయంతో కృషిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. జాతీయ భద్రతా వారోత్సవాల గోడ పత్రికలను స్థానిక మంత్రి కార్యాలయంలో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని వాహనచోదకులకు తెలియజెప్పేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్ ద్వారా కూడా హెచ్చరికలు పంపడం వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని చక్కగా అమలు చేస్తుందన్నారు. మీ భద్రతే మీ కుటుంబానికి రక్ష అనే నినాదంతో ద్విచక్ర వాహనదారుల నుంచి ట్రక్ డ్రైవర్ల వరకూ అవగాహన కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రన్న బీమా రూ. 5 లక్షలతో అమలు జరుపుతుందన్నారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు విజయరాజ్, వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు పేరిచర్ల మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

పందులు, కుక్కలను నిర్మూలించాలి
డయల్ యువర్ కలెక్టర్‌లో ప్రజల ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్:పంచాయతీ అధికార్లకు మూడు నెలల గడువు
ఏలూరు, జనవరి 20 : జిల్లాలోని అన్ని పంచాయతీలలో మూడు నెలల్లోగా పందులు, కుక్కలను నిర్మూలించాలని పంచాయతీ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ, మరుగుదొడ్లు, గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలపై ఫోన్ ద్వారా ప్రజల నుండి వచ్చిన సమస్యలపై కలెక్టరు స్పందించి వాటి సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలోని వివిధ పల్లెల్లో పందులు బెడద వలన అనారోగ్యపాలవుతున్నామని మెదడు వాపు వ్యాధితో పలువురు చిన్నారులు మరణించారని, కుక్కల భయం కూడా తీవ్రంగా ఉన్నదని పలు చోట్ల కుక్కకాటుకు పలువురు చిన్నారుల కూడా బలైయ్యారని ప్రజలను రక్షించాలని నరసాపురం మండలం సరిపల్లి గ్రామానికి చెందని శాంతకుమారి, తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన నందమూరి రామకృష్ణ తదితరులు ఫోన్‌లో కలెక్టరును కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ గ్రామీణ ప్రాంతాలలో పందులు, వీధి కుక్కల బెడద ఎక్కువగా వుందని, వాటిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, జిల్లాలో ఏ పంచాయతీలోనూ పందులు, వీధి కుక్కలు కనపడడానికి వీల్లేదన్నారు. పంచాయితీ అధికారులకు మూడు నెలల సమయం ఇస్తున్నానని ఈ లోగా వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. గడువు అనంతరం ఎక్కడైనా పందులుగాని, వీధి కుక్కలు కాని కనపడితే సంబంధిత పంచాయతీ సెక్రటరీలను బాధ్యులనుచేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పందులను పెంచదలచుకున్నవారు వారి స్వంత స్థలాలలో పెంచుకోవాలే తప్ప వాటిని రోడ్లుపైకి వదిలితే సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామానికి చెందిన దండు కృష్ణంరాజు మాట్లాడుతూ గ్రామంలో దోమల బెడద తీవ్రంగా ఉన్నదని చెప్పగా ప్రతీ పల్లెలో దోమల నివారణకు పంచాయితీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఉమా శేషగిరి మాట్లాడుతూ దువ్వ కూడలిలో రోడ్డులపై తోపుడు బండ్ల వలన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వున్నదని చెప్పగా ఈ విషయంపై తగు చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అత్తిలి మండలం వరిఘేడు పంచాయితీకి చెందిన అడ్డాల వెంకటరత్నం మాట్లాడుతూ గ్రామంలో 33 మంది అర్హులకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చెప్పగా కలెక్టర్ స్పందిస్తూ రాజకీయాలు విడనాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. అర్హులుంటే పెన్షన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన సోమేశ్వరరావు గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్లే దారిలో రోడ్డు మధ్యన ఒక జాతీయ నాయకుని విగ్రహం పెడుతున్నారని, దీనివలన ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పగా కలెక్టర్ స్పందిస్తూ ఏ విగ్రహాలు పెట్టాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని, ఎవరిష్టం వచ్చినట్లు వారు విగ్రహాలు పెట్టకూడదని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మండలాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పల్లెల్లోగానీ, పట్టణాల్లో గానీ చెత్త రోడ్లపై, డ్రైన్లలో వేస్తే మురుగునీటి పారుదలకు అవరోధంగా మారుతుందని ప్రతీ పల్లెలో పంచాయితీ అధికారులు రోజూ విస్తృతంగా గ్రామాల్లో పర్యటించి డ్రైన్లలో చెత్త వేసే వారిని గుర్తించి పెనాల్టీ విధించాలని దీని వలన కొన్నాళ్లకు మార్పు వస్తుందని చెప్పారు. మార్చినాటికల్లా జిల్లాలోని అన్ని పంచాయతీలలో డంపింగ్ యార్డులు నిర్మించి అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో డిపివో కె సుధాకర్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, డ్వామా పిడి ముళ్లపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.