పశ్చిమగోదావరి

దేశ అభ్యున్నతి, పేద ప్రజల సంక్షేమం బిజెపి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జనవరి 21: దేశాభ్యున్నతి, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని బిజెపి మహిళా మోర్ఛ జాతీయ కమిటీ ఇన్‌ఛార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి పేర్కొన్నారు. పెంటపాడు మండలం రాచర్ల ధర్మ ఫంక్షన్ హాలులో బిజెపి జిల్లాస్థాయి శిక్షణా తరగతులు శనివారం రెండో రోజు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పురంధ్రీశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరుశాతం పేద ప్రజలకు చేరేలా మరింత అవగాహన కల్పించాలన్నారు. బిజెపి, సంక్షేమ పథకాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో రెండున్నర సంవత్సరాల పాలనలో పేదల సంక్షేమం, భద్రత లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. జన్‌ధన్ యోజన ఖాతాలతో బ్యాంకు ఖాతా అంటే తెలియని కోట్లాది మంది బ్యాంకు ఖాతాలు ప్రారంభించారన్నారు. బీమా సురక్ష యోజన, ఫసల్ బీమా యోజన, భేటీ పడావో, భేటీ బచావో, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన వంటి అనేక పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా బిజెపి అగ్రగామిగా ఉందన్నారు. 13 కోట్ల మంది బిజెపి సభ్యత్వాలు తీసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిజెపికి ఆదరణ పెరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రవీంద్రరాజు మాట్లాడుతూ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా వివిధ కమిటీలు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. లక్ష్యసాధనకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మీడియా సంబంధాలు, సామాజిక బాధ్యత-సద్వినియోగం అనే అంశంపై ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మాజీ అధ్యక్షుడు డి.సోమసుందర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శుభాకర్ కృష్ణ, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా కార్యదర్శి నార్ని తాతాజీ, దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మహిళా మోర్ఛ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, దళిత మోర్ఛ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపోలు వీరరాఘవులు, మహిళా మోర్ఛ జిల్లా అధ్యక్షురాలు సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇక యనమదుర్రులోకి శుద్ధిచేసిన జలాలు
రూ.100 కోట్లతో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు: కాలుష్య నియంత్రణ మండలి

భీమవరం, జనవరి 21: రానున్న రోజుల్లో యనమదుర్రు డ్రెయిన్‌గా పేరొందిన ఈ డ్రెయిన్‌లోకి శుద్ధిచేసిన జలాలను మాత్రమే విడుదల చేయనున్నట్టు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్ ఎస్.వెంకటేశ్వర్లు చెప్పారు. రూ.100 కోట్లతో కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను ఏర్పాటుచేయనున్నామన్నారు. ఇందుకు కావాల్సిన భూమి సేకరణ కూడా పూర్తిచేశామన్నారు. శనివారం భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కాలుష్య నివారణకు సూచనలు అనే అంశంపై సదస్సు సివిల్ హెడ్ డాక్టర్ ఎం.జగపతిరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ఇంజినీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తణుకు, భీమవరం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తారని, అక్కడి నుంచి శుద్ధిచేసిన జలాలను పైపులతో నేరుగా సముద్రంలోకి రెండు కిలోమీటర్లు లోపునకు వెళ్తాయన్నారు. అక్కడ మరోసారి నీరు ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయబడి నీరు సముద్రంలోకి తరలిస్తామన్నారు. దీన్ని జాతీయ సముద్ర అధ్యయన సంస్థ డిజైన్ రూపొందిస్తుందన్నారు. ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత పట్టణంగా భీమవరాన్ని తీర్చిదిద్దామన్నారు. కమిషనర్ సిహెచ్.నాగనర్సింహరావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల నుంచి చెత్తను తాడేపల్లిగూడెంలోని శుద్ధిచేసి, దాన్ని వర్మీ కంపోస్టు ద్వారా ఇతర అవకాశాలకు ఉపయోగిస్తారన్నారు. నిత్యం 60 మెట్రిక్ టన్నుల చెత్తను కంపోస్టుకు పంపించడం వల్ల 80 శాతం కంపోస్టు బాధ తగ్గుతుందన్నారు. ఎంఎ అన్సారీ, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పార్థసారధివర్మ, డాక్టర్ పి.ఎ.రామకృష్ణంరాజు, హెడ్ బ్రహ్మరాజు, రాజు, డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.