పశ్చిమగోదావరి

ఫిబ్రవరి నుండి హ్యాపీ సండేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 22: అన్ని కార్పొరేషన్లు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో హ్యాపీ సండేస్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి తొలి ఆదివారం నుంచి జిల్లాలో నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ప్రజలకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందివ్వాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు స్వచ్ఛ ఆంధ్ర వైస్ ఛైర్మన్ డాక్టర్ సిఎల్.వెంకటరావు ఇటీవల భీమవరం పర్యటనలో ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని విజయవాడ, రాజమహేంద్రవరం తదితర కార్పొరేషన్లలో హ్యాపీ సండేస్ అమలుచేస్తున్నారు. మున్సిపల్ పరిపాలనా శాఖ ద్వారా ప్రతీ నెల తొలి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదివారం నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లోని ఆయా వార్డుల్లో ఉన్న ప్రజలు స్థానికంగా జరిగే ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. కనీసం ఐదు గంటల పాటు ఈ హ్యాపీ సండేస్‌లో పాల్గొంటారు. దీనివల్ల ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడి, స్నేహపూరితమైన వాతావరణాన్ని తీసుకువస్తాయన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా వాకింగ్, సైక్లింగ్, యోగా, జాగింగ్ చేస్తారు. వీటితో పాటు క్రికెట్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, బాస్కెట్‌బాల్, నృత్యంతో పాటు ఆయా పురపాలక సంఘాల్లో ఏదైతే గ్రామీణ క్రీడలు ఉంటాయో వాటిని ఆడిస్తారు. యువత, చిన్నారులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ హ్యాపీ సండేస్‌కు ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానితులే.

తెలుగుదేశం పార్టీలో
సంస్థాగత ఎన్నికల సందడి
-నేటి నుంచి మే 23 వరకు:జిల్లా అధ్యక్షురాలు తోట

భీమవరం, జనవరి 22: తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఎన్నికలకు పార్టీ సర్వం సిద్ధం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంస్థాగత ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి మే 23 వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి వెల్లడించారు. గ్రామ, మండల, పట్టణ, జిల్లాస్థాస్ధాయిలో కొత్త కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత గ్రామ, వార్డుస్థాయిల్లో సోమవారం నుండి జనవరి 31 వరకు వార్డుస్థాయి కమిటీల ఎన్నికల నిమిత్తం ఎన్నికల అధికారుల నియామకం చేపడతారు. ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఎన్నికల అధికారులకు స్థానికంగా శిక్షణ ఇస్తారు. ఫిబ్రవరి తొమ్మిది నుండి 28 వరకు గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి ఒకటి నుండి ఆరో తేదీ వరకు మండల, పట్టణ కమిటీలకు అనుబంధ కమిటీలకు ప్రతినిధుల జాబితా, ఎన్నికల అధికారులను ఎంపిక చేస్తారు. మార్చి పది నుండి 12 వరకు ఎన్నికల అధికారులకు రాష్ట్ర పార్టీ శిక్షణ ఇస్తుంది. మార్చి 19 నుంచి ఏప్రిల్ అయిదు వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 21 నుంచి 28 వరకు జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 23 వరకు జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మే 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర పార్టీ నిర్వహించే మహానాడుకు హాజరవుతారు. జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వీరు పాల్గొనటం ఆనవాయితీ వస్తోంది.
నిర్వాసిత కాలనీల్లో వౌలిక సదుపాయాలు
జంగారెడ్డిగూడెం, జనవరి 22: పట్టణ శివార్లలో నిర్మించిన రెండు పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కాలనీల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత హామీ ఇచ్చారు. స్థానిక హైస్కూలు వద్ద ఐటిడిఎ ఆధ్వర్యంలో జాతీయ నిర్మాణ రంగ సంస్థ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల యువత కోసం ఏర్పాటు చేసిన ఉపాధి శిక్షణా కార్యక్రమం అనంతరం శనివారం పలువురు నిర్వాసితులు తమ సమస్యలు మంత్రికి వివరించారు. పట్టణంలోని వైఎస్సార్ నగర్ సమీపంలో నిర్మించిన పైడిపాక, రామయ్యపేట నిర్వాసిత కాలనీలోను, పేరంపేట రోడ్డులో బాట గంగానమ్మ గుడి వద్ద నిర్మించిన కాలనీల్లోను తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్టు నిర్వాసిత ప్రతినిధులు బొట్టా వెంకటరత్నం, డి.వీరభద్రరావు, గంగుల సీతారామయ్య తదితరులు మంత్రి దృష్టికి తెచ్చారు. గతంలో పైడిపాక నిర్వాసిత కాలనీలో ఇళ్ళకు ఇచ్చిన స్థలానికి అదనంగా మరో సెంటున్నర స్థలం ఇస్తామని చెప్పారని, ఆ స్థలం ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. దీనిపై మంత్రి సుజాత తహసీల్దార్ జివివి సత్యనారాయణను తక్షణమే స్థలం కేటాయిస్తూ పత్రాలు అందజేయాలని ఆదేశించారు. తామంతా గోదావరి నీరు తాగిన వాళ్ళమని, ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామాలు ఖాళీచేసి ఇప్పుడు ఇక్కడకు వచ్చామని, ఇక్కడి కాలనీల్లో కనీసం సరైన తాగునీరు లభించడం లేదన్నారు. బోరుల ద్వారా రంగుమారిన నీరు వస్తోందని, నీరు తాగాలంటే భయంగా ఉందని, అన్నం వండుకుంటుంటే రంగు మారిపోతోందని వివరించారు. సత్యసాయి స్కీమ్ ద్వారా గోదావరి నీటిని తమ కాలనీలకు అందించాలని కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని, అప్పటి వరకు వాటర్ ట్యాంక్‌ల ద్వారా రక్షిత మంచినీటిని అందించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కాలనీల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్డీఒ ఎస్.లవన్న చెప్పారు. దీనిపై కూడా నిర్వాసితులు ప్లాంటు నిర్వహణ సాధ్యం కాదని, తమకు గోదావరి నీటిని సత్యసాయి పంపింగ్ స్కీమ్ ద్వారా అందించాలని కోరారు. నిర్మాణం జరిగిన ఇళ్ళు వర్షం వస్తే కారిపోతున్నాయని, తలుపులు, కిటికీలు సక్రమంగా లేవని చెప్పారు. నిర్వాసితుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను కాలనీల్లో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీచేస్తామని, త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు.
ఎందుకిలా...

ఏలూరు, జనవరి 22 : అధికార వర్గాల్లో ఇప్పుడు దాదాపు ఒక్కటే అంశంపై చర్చ సాగుతోంది. మరోవైపు జిల్లాలో కూడా అదే అంశం పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. అధికారిక సమావేశాల్లో తెరపైకి కొత్త్భాష, కొత్త అభివ్యక్తీకరణ రావడమే ఇప్పుడు అన్ని చోట్లా చర్చకు దారితీసింది. జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ కాటంనేని భాస్కర్ బాధ్యతలు స్వీకరించిన తొలినాటితో పోలిస్తే ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో అధికారులు, ఉద్యోగులనుద్దేశించి వినియోగిస్తున్న కొత్త్భాషపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు దిగజారుతూవున్న సందర్భంలో ఇలాంటి భాష ఉపయోగిస్తున్నారా? లేక ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదన్న అసంతృప్తితో ఈ పదప్రయోగానికి సిద్ధమవుతున్నారా? అన్నది కూడా ఈ చర్చలో ఒక భాగంగా మారిపోయింది. ఏదేమైనా సమావేశాల్లో కలెక్టర్ అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి తరచుగా వినియోగిస్తున్న ఈ భాష పట్ల మాత్రం అధికార వర్గాల నుంచి అసంతృప్తి, ఆవేదనే వినిపిస్తోంది. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన ఇరిగేషన్ సమీక్షా సమావేశంలో ఆయన వినియోగించిన భాష అధికారులను విస్తుపోయేలా చేసిందంటే ఆశ్చర్యం కాదు. జిల్లాలో రైతుల వద్ద నుంచి ఎవరైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నా తనను చెప్పుతో కొట్టినట్లేనని కలెక్టర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. రూపాయి... లక్ష... అన్న తేడా లేకుండా అసలు లంచం తీసుకోవడాన్ని ఎవరూ సమర్ధించకపోయినా అలా తీసుకుంటే తనను చెప్పుతో కొట్టినట్లేనని కలెక్టర్ స్థాయి అధికారి వ్యాఖ్యానించడం మాత్రం తీవ్ర చర్చకు దారితీసింది. అదే విధంగా సమావేశం సందర్భంగా రైతుల నుంచి అధికారులు, ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నట్లు తెలిస్తే జీవితాంతం ఏ హోదాలో వున్నా వేటాడి వెంటాడి ఆ అధికారి భవిష్యత్తు అంధకారం చేస్తానని హెచ్చరించే స్థాయిలో వ్యాఖ్యలు కూడా అధికారులను తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టివేశాయనే చెప్పాలి. మొత్తం మీద ఇటీవలి కాలంలో వినిపిస్తున్న ఈ తరహా భాష దేనికి సంకేతమన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అలాగే లంచాలు తీసుకుంటే అలాంటి అధికారి భవిష్యత్తు ఉద్యోగ జీవితం ఎందుకూ పనికి రాకుండా చేస్తానని శపధం చేసిన రీతిలో చెప్పడం కూడా మరింత చర్చకు దారితీసింది. మరో పరిణామంలో ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ పనులు చేయాలని చెబుతున్నా ఎందుకు ఫలితాలు అందడం లేదని ప్రశ్నిస్తూనే ఇది నిర్లక్ష్యం కాదు తోలు మందంతో పొగరుబోతుతనంగా వ్యవహరించడమేనని వ్యాఖ్యానించడంతో జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులున్న సమావేశంలో గుసగుసలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఈ విధంగా అక్షింతల వర్షం కురిపించిన కలెక్టర్ వెనువెంటనే మళ్లీ మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులను తిట్టడం తనకు సరదా కాదని, పదిసార్లు చెప్పినా పనిచేయకపోవడంవల్లే బాధతో ఈ మాటలు అంటున్నాను తప్ప తనకు ఎవరిపై కోపం లేదని, తన ఉద్యోగ ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నానని, అందరూ కూడా అలాగే ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలన్నదే తన ఉద్దేశ్యమని ప్రస్తావించారు. ఇక ఆ తరువాత కూడా కొన్ని నిర్మాణ పనుల విషయంలో ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించిన సమయంలో సంతకం నిమిత్తం సిఇకి పంపామని చెప్పడంతో సంతకానికి వారం రోజులు కావాలా? చీఫ్ ఇంజనీర్ ఏమైనా పాకిస్తాన్‌లో వున్నారా? శత్రుదేశంలో పనిచేస్తున్నారా? ఒక్క సంతకానికి ఎందుకింత జాప్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ అధికారులు బిత్తరపోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చిన సరికొత్త భాష పట్ల అధికార వర్గాలు నోరు మెదపలేక, వింటూ ఉండలేక సతమతం అవుతున్నారన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

ప్రజలతో మమేకమవ్వాలి

తాడేపల్లిగూడెం, జనవరి 22 : బిజెపి కార్యకర్తలు ప్రజల్లో మమేకమై సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. పెంటపాడు మండలం రాచర్లలో ఆదివారం జరిగిన బిజెపి ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల అభిమానం సంపాదించడం ద్వారా పార్టీకి ఆదరణ పెంపొందించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయి వరకు ఉన్న సమస్యల్ని గుర్తించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఉత్తమ నాయకత్వాన్ని పెంపొందించే దిశగా కార్యకర్తలు కృషిచేయాలన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చి రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ అన్యాయాలను ఎదుర్కొని ప్రజల్లో మమేకమై పనిచేయాలన్నారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ మాట్లాడుతూ సోషలిజం, కమ్యూనిజానికి ప్రత్యామ్నాయంగా ఏకాత్మత - మానవత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, బిజెపి జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ప్రధాన కార్యదర్శులు నార్ని తాతాజీ, సుధాకర్ కృష్ణ, అశోక్ చక్రవర్తివర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోడూరి లక్ష్మీనారాయణ, కాయర్ బోర్డు సభ్యులు పివిఎస్ వర్మ, యువమోర్చా జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, దళితమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపోలు వీరరఘవులు తదితరులు పాల్గొన్నారు.
ఇవేం విభేదాలు ‘బాబూ’!

-ఒకే వీధిలో వేర్వేరుగా గడప గడపకు వైసిపి
యలమంచిలి, జనవరి 22: యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన గడప గడపకు వైసిపి కార్యక్రమంలో నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు వర్గం, గుణ్ణం నాగబాబు వర్గం రెండుగా చీలిపోయి ఒకే వీధిలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ శేషుబాబు వర్గంలో చెల్లెం ఆనందప్రకాష్, పాలకొల్లు మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు యడ్ల తాతాజీ, బిసి సెల్ నాయకుడు చినమిల్లి గణపతిరావు తదితరులున్నారు. అలాగే నాగబాబు వర్గంలో బోనం బులివెంకన్న, స్టాలిన్, కల్యాణ గంగాధర్ తదితరులున్నారు. ప్రచారంలో భాగంగా కొంతేరు సెంటరులో పిన్నమరెడ్డి రవి ఇచ్చిన అల్పాహార విందులో నాగబాబు వేరుగా కూర్చున్నారు. ఇటీవల యలమంచిలి రైతు భవనంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో జిల్లా నాయకుడు ఆళ్ల నాని సమక్షంలో ఇరువురి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. అప్పటి నుండి వారు విడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
విద్యాభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత
ఏలూరు, జనవరి 22 : ఆంధ్రప్రదేశ్‌ను విద్యాహబ్‌గా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్రంలో విద్యకు 20 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, వచ్చే బడ్జెట్‌లో విద్యారంగానికి ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి విజ్ఞాన కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర గనులు స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు టీచర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత యువత కూడా విదేశీ విద్యను ఆర్జించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా విజ్ఞానాన్ని సముపార్జించే విధంగా భావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు టీచర్లు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 43 శాతం పి ఆర్‌సి ఫిట్‌మెంట్ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ఉద్యోగుల వయోపరిమితిని 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచారని, ఉద్యోగులకు హెల్త్ కార్డులతోపాటు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతిచ్చిందని చెప్పారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందని పనితీరు ద్వారా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అందరి అభిమానాన్ని చూరగొనాలని ముఖ్యంగా ప్రభుత్వపరంగా విద్యారంగంలో జరిగే పనులన్నీ తెలుగునాడు టీచర్ల యూనియన్ ద్వారానే చేస్తామని వారి సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువనేత నారా లోకేష్ మదిలో మెదిలిన తెలుగునాడు అనుబంధ సంఘాలన్నింటినీ ఏకత్రాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రంలోని అంగన్‌వాడీ సంఘాలు, టీచర్ల యూనియన్, పట్ట్భద్రుల యూనియన్‌లను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. తెలుగునాడు టీచర్ యూనియన్‌కు ఏలూరులో భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఆ భవనంలో మహిళా టీచర్లకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన తర్వాత దిక్కుమాలిన స్థితిలో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబే దిక్కయ్యారని ఆయన సారధ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తోందని ఆయన చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే కె ఎస్ జవహర్ మాట్లాడుతూ తాను 15 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ చంద్రబాబు దయతో ఎమ్మెల్యే కాగలిగానని కొవ్వూరు నియోజకవర్గంలో 77 లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించామని చెప్పారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆధ్వర్యంలో ప్రతీ పాఠశాలోనూ విద్యార్ధినీ విద్యార్ధులకు బల్లల సౌకర్యాన్ని కల్పించారని చెప్పారు. రాష్ట్ర తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యాన్ని పెంచడమే కాకుండా గౌరవంగా జీవించే విధంగా టీచర్ల బదిలీ విధానంలో కౌన్సిలింగ్ పద్దతిని చంద్రబాబు ప్రవేశపెట్టారని చెప్పారు. పారదర్వకమైన డిఎస్‌సి విధానాన్ని అమలు చేయడం వలన వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని ఆయన చెప్పారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఉపాధ్యాయ అసోసియేషన్‌ల నాయకులు రూజ్‌వెల్ట్, తాడేపల్లిగూడెం మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యాయ అసోసియేషన్ నాయకులు కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగునాడు టీచర్ల అసోసియేషన్ వార్షిక క్యాలెండర్‌ను, డైరీని, వాల్ స్టిక్కర్లను సుజాత, బాపిరాజు, జవహర్‌లు విడుదల చేశారు.
డెల్టాను పరిరక్షించుకుందాం
-షేల్ గ్యాస్ తవ్వకాల వ్యతిరేక సదస్సులో సిపిఐ నేత మూర్తి

భీమవరం, జనవరి 22: డెల్టాను పరిరక్షించుకుందామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. పచ్చని డెల్టాను ఎడారిలా చేయాలని ప్రభుత్వం తరలిస్తే ఉద్యమిస్తామన్నారు. ఆదివారం భీమవరంలోని ఒఎన్‌జిసి కేజీ బేసిన్‌లో షేల్ గ్యాస్ తవ్వకాలు చేయనున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో తూర్పు, పశ్చిమ, కృష్ణాజిల్లాలకు చెందిన రైతులు, ప్రజలతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ ఈ తవ్వకాలతో ఖమ్మం, భద్రాచలం, రంపచోడవరం వంటి మెట్ట ప్రాంతాలన్నీ ప్రమాదంలో పడిపోతాయన్నారు. జిల్లా సిపిఐ కార్యదర్శి డేగా ప్రభాకర్, కృష్ణాజిల్లా పార్టీ సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యవర్గసభ్యులు కె సత్తిబాబు, మానవహక్కుల వేదిక కార్యదర్శి ముత్యాల శ్రీనివాసు, పట్టణ కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్, సహాయ కార్యదర్శి మల్లుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు లంకా కృష్ణమూర్తి, ఎఐటియుసి ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఉండి కాలువకు వంతుల వారీ నీరు
ఉండి, జనవరి 22: పశ్చిమడెల్టాలోని ఉండి కాలువకు ఈ నెల 23 నుంచి వంతులవారీ విధానం అమలు చేస్తున్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఉండి కాలువకు ఈ నెల 23 నుంచి 28 వరకు నీరు విడుదల చేస్తారు. తిరిగి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు వెంకయ్య వయ్యేరుకు నీటి విడుదల ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఉండి కాలువపై 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా వెంకయ్య వయ్యేరుపై కేవలం 60 వేల ఆయకట్టు మాత్రమే ఉంది. అందులో ఆకివీడు మండలంలో ఆక్వాసాగు అధికంగా ఉంది. అయితే ఉండికి వెంకయ్య వయ్యేరుకు గత రబీలో కూడా సమాన వంతులు ఉన్న సమయంలో రైతులు తమకు వెంకయ్య వయ్యేరు కంటే ఒక రోజు అదనంగా కావాలని అడిగారు. అయినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈసారి కూడా ఆటు ఆరు, ఇటు ఆరురోజుల వంతునే అమలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండికి వంతులో ఒకరోజు అదనంగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
రైలు ప్రమాద మృతులకు సంతాపం
ఏలూరు, జనవరి 22 : విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూనేరు రైల్వే స్టేషన్‌లో జరిగిన హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్రమాదంలో మరణించిన 40 మంది కుటుంబాలకు జిల్లా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేసినట్లు రాష్ట్ర మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం మంత్రి సుజాత ఆధ్వర్యంలో రెండు నిమిషాలు వౌనం పాటించి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘోర ప్రమాదం చూడలేదని, అమాయక ప్రజల ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయన్నారు. నిరంతరం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సుజాత రైల్వే శాఖను కోరారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సుజాత సానుభూతి తెలిపారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, ఎమ్మెల్సీ రామకృష్ణ, రాష్ట్ర తెలుగు నాడు ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, రూజ్‌వెల్ట్ తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
రాష్ట్భ్రావృద్ధికి శ్రమిస్తున్న చంద్రబాబు
గోపాలపురం, జనవరి 22: రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. గోపాలపురం-తొక్కిరెడ్డిగూడెం గ్రామాల మధ్య ఉన్న పిచ్చుకగండి కాలువపై వంతెన నిర్మాణానికి ఎంపి మురళీమోహన్ ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను దత్తత తీసుకున్న సంజీవపురం గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. తాను ఆ గ్రామాన్ని సందర్శించినపుడు ఆయా గ్రామాల్లో గిరిజనులను నాటుసారా తయారీ, విక్రయం మానుకోవాలని కోరానని, తన మాటకు కట్టుబడి ప్రస్తుతం ఆయా గ్రామాలు సారా రహిత గ్రామాలుగా మారడం సంతోషంగా ఉందన్నారు. జగన్నాధపురం నుండి గజ్జరం వెళ్లే రహదారి నిర్మాణానికి సుమారు రూ. 5.5 కోట్లు మంజూరయ్యాయని ఎంపి చెప్పారు. ఎమ్మెల్యే ముప్పిడి మాట్లాడుతూ పిచ్చుకగండి కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు దీర్ఘకాలంగా కోరుతున్నారన్నారు. వంతెన నిర్మాణం వల్ల కాలువకు అవతలివైపు ఉన్న సుమారు 30 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎఎంసి మాజీ చైర్మన్ నున్న వెంకట మోహనరావు మాట్లాడుతూ 1986లో పిచ్చుకగండి కాలువ వంతెన నిర్మాణం, గోపాలపురం-్భమోలు రహదారి వంతెన నిర్మాణం చేపట్టాలని కోరిన నేపథ్యంలో అప్పట్లో భీమోలు వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. తిరిగి టిడిపి హయాంలోనే పిచ్చుకగండి కాలువపై వంతెన నిర్మాణం చేపట్టడం ఆనందదాయకమన్నారు. కొవ్వూరుపాడు సర్పంచ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు పెనుమత్స రంగరాజు మాట్లాడుతూ కొవ్వూరుపాడులో భూగర్భ డ్రైయినేజీ నిర్మాణానికి ఎంపి, ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమోలు సర్పంచ్ బెజవాడ నాగమణి, ఎఎంసి చైర్మన్ ముళ్లపూడి వెంకట్రావు, జడ్పీటీసీ ఈలి మోహినీ పద్మజారాణి, వైస్ ఎంపిపి ఎం రత్నాజీచౌదరి, గద్దె హరిబాబు, దుర్గారావు పాల్గొన్నారు.