పశ్చిమగోదావరి

ఎసిబి ఇన్‌స్పెక్టర్ విల్సన్‌కు ఉత్తమ సేవాపతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 7: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించే అవార్డులకు జిల్లా అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టరు యుజె విల్సన్ ఎంపికయ్యారు. ఆయనకు ఉత్తమ సేవాపతకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 1995లో ఎస్‌ఐగా పోలీసుశాఖలో ప్రవేశించిన విల్సన్ పెదవేగి, ద్వారకాతిరుమల, పాలకొల్లు పట్టణ ఎస్సైగా పనిచేశారు. అనంతరం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐగాను, జిల్లా స్పెషల్‌బ్రాంచి ఎస్సైగా కూడా పనిచేశారు. అనంతరం ఇన్‌స్పెక్టరుగా పదోన్నతి పొంది 2010నుంచి 2012 వరకు జిల్లా స్పెషల్‌బ్రాంచి సిఐగా పనిచేశారు. అనంతరం 2012 ఆగస్టు నుంచి జిల్లా అవినీతి నిరోధక శాఖలో ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్నారు. 2009లో ఉగాది అవార్డుల్లో సేవా పతకాన్ని పొందిన విల్సన్ మళ్లీ ఈసారి ఉగాది అవార్డుల్లో ఉత్తమ సేవాపతకానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు 130 రివార్డులు, నాలుగు ప్రశంసాపత్రాలు ఆయన స్వీకరించారు. తొలినుంచి సమర్ధుడైన అధికారిగా పేరొందిన విల్సన్ పనిచేసిన ప్రతిచోటా ప్రజల మన్ననలు కూడా పొందారు.