పశ్చిమగోదావరి

కొల్లేరు గ్రామాల ప్రజలంటే నాకిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 20 : తమ తాత, తల్లిదండ్రుల కాలం నుంచి కొల్లేరు గ్రామాల అభివృద్ధికి తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని, వారి అభివృద్ధే లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చిందని, అదే స్ఫూర్తితో తాను వ్యవహరిస్తున్నానని కొల్లేరు గ్రామాల ప్రజలంటే నాకిష్టమని ఎంపి మాగంటి బాబు అన్నారు. సోమవారం రామచంద్రరావుపేటలోని ఎంపి క్యాంపు కార్యాలయం వద్ద పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని కొల్లేరు గ్రామాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు ఎంపి మాగంటి బాబును కలుసుకుని కొల్లేరు సంఘ నాయకులు సైదు సత్యనారాయణకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని, అందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ కొల్లేరు గ్రామాల సమస్యల పరిష్కారానికి తాను చిత్తశుద్ధితో వ్యవహరిస్తానని, ఎమ్మెల్సీ విషయం తమ పరిధిలో లేదని, అయినప్పటికీ చంద్రబాబుకు కొల్లేరు గ్రామాల్లోని వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సముచితమని తాను మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లేరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇదే క్రమంలో తాడేపల్లిగూడెంనకు చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ కిలాడి వీరనాగ ప్రసాదరావు (కిలాడి ప్రసాద్)కి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలని కోరుతూ అనుచరులతో కలిసి ఎంపి మాగంటికి వినతిపత్రాన్ని అందజేశారు.
మరుగుదొడ్ల నిర్మాణం వేగంతం చేయాలి
కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, ఫిబ్రవరి 20 : ఉపాధి హామీ పధకం కింద మంజూరుకాబడిన మరుగుదొడ్లు నిర్మాణ పనులు వేగంతంగా పూర్తి చేయాలని ఎంపిడివోలను కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. సోమవారం ఎంపిడివో, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం కింద యాక్షన్ ప్లాను ప్రకారం నిర్వహించవలసిన పనులు పూర్తి చేసేందుకు ఎంపిడివోలు కృషి చేయాలని చెప్పారు. జిల్లాలో గతంలో మంజూరుకాబడి సగంలో నిలిచిపోయిన మరుగుదొడ్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌సి, బిసి, కాపు, మైనార్టీ వర్గాల వారికి రుణాలు మంజూరు విషయంలో ఎంపిడివో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు స్థల సేకరణ చేయాలని 900 గ్రామాలకు గాను ఇంకా 440 గ్రామాల్లో స్థలం సేకరించాల్సి వుందని త్వరగా స్థల సేకరణ జరిగితే అంగన్‌వాడీ భవన నిర్మాణాల సమస్య తీరుతుందన్నారు. జిల్లాలో చేపల చెరువులు అనుమతులు జీవో 7 ప్రకారం ఖచ్చితమైన వివరాల ప్రకారం అనుమతులు మంజూరుచేయాలని కలెక్టర్ తహశీల్దార్‌లకు చెప్పారు. వివరాలు సరిగ్గా లేని దరఖాస్తులు తిరస్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో జెసి కోటేశ్వరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, డి ఆర్‌డి ఎ పిడి శ్రీనివాసరావు, డి ఎస్‌వో సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.