పశ్చిమగోదావరి

నేటినుంచి కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు, ఫిబ్రవరి 26: కృష్ణాజిల్లా కొల్లేటికోటలో వేంచేసియున్న శ్రీపెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 12వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 9వ తేదిన శ్రీజలదుర్గా , శ్రీ గోకర్ణేశ్వర స్వామివార్ల కల్యాణం జరగనుంది. అమ్మవారి ఉత్సవాలకు భారీగా యాత్రికులు రానున్న దృశ్య ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణంలో భారీ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను సోమవారం రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభిస్తారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగల వెంకటరమణ, కమ్మిలి విఠల్‌రావ్‌లతో పాటు పందిరిపల్లి గూడెం, కొల్లేటికోట, లక్ష్మీపురం, శృంగవరప్పాడు, గోకర్ణపురం, గుమ్మళ్లపాడు గ్రామాల పెద్దలు హాజరు కానున్నారు. యాత్రీకులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆలయ ఇఒ కొండలరావు విలేఖర్లకు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారి చంద్రశేఖరఆజాద్ ఇచ్చిన అదేశాలతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.
వైభవంగా శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి కల్యాణం

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మండంలోని తాడువాయిలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి దివ్య కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో శైవాగమోక్తంగా ఆలయ ప్రధానార్చకులు కాళ్ళకూరి రవికుమార్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణ కల్యాణ బ్రహ్మ, శైవాగమ పండితులు ఉండి సుబ్రహ్మణ్యశర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త కల్లూరి సత్యనారాయణ, రత్నకుమారి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించి కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఉత్సవాల మూడో రోజు ఆనవాయితీగా వస్తున్న అన్నసమారాధనను ఆలయం వద్ద ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, జడ్పీటిసి శీలం రామచంద్రరావు, ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఉప్పునూతల పుల్లారావు ప్రారంభించారు. స్వచ్ఛంద కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు అన్నసమారాధనలో సహాయ సహకారాలు అందించారు. ఎస్సై ఎం.కేశవరావు ఆధ్వర్యంలో అన్నసమారాధన వద్ద క్యూలైన్లు నిర్వహించారు. సుమారు పది వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. అన్నసమారాధనకు డికెడి సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు భారీ విరాళం అందజేశారని ఉత్సవ కమిటీ ఛైర్మన్ ఉప్పునూతల పుల్లారావు చెప్పారు. తొలుత ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం నేతలు కొడవటి సత్తిరాజు, పాపోలు శ్రీనివాసరావు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎస్.ఎస్.ఇస్మాయిల్, ఉత్సవ కమిటి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.