పశ్చిమగోదావరి

తాబేలు మాంసం తిని మృతి చెందిన ఘటనపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 27: జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంకు చెందిన సోయం సత్యనారాయణ, అతని భార్య దుర్గమ్మ తాబేలు మాంసం తిని మృతి చెందిన ఘటనపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జి వెంకటరమణయ్య స్థానిక ఏరియా ఆసుపత్రిలో సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాబేలు మాంసం కూర వండుకుని తినడం, ఆ కూర ఏవిధంగా విషతుల్యం అయినదీ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. శనివారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న వైద్యులు డాక్టర్ రాజ్‌కుమార్‌ను విచారణ చేసినట్టు చెప్పారు. శనివారం రాత్రి 9.15 గంటలకు సోయం సత్యనారాయణను 108 అంబులెన్స్‌లో తీసుకు వచ్చారని, అప్పటికే అతను మృతి చెందినట్టు చెప్పారని తెలిపారు. తరువాత అతని భార్య దుర్గమ్మ, కుమారుడు మధును తీసుకు వచ్చిరని, వారికి ప్రాథమిక చికిత్స చేసి, కడుపులోని విషాహారాన్ని కక్కించినట్టు తెలిపారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు చెప్పినట్టు తెలిపారు. వీరిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకు వెళ్ళారని, శనివారం రాత్రి 12.35 గంటలకు దుర్గమ్మ కూడా మృతి చెందినట్టు చెప్పారు. మధు అక్కడే చికిత్స పొందుతున్నట్టు, అతని చిన్నాన్న బి వెంకటేశ్వరరావు దగ్గరుండి వైద్యం చేయిస్తున్నట్టు చెప్పారు. అతను కోలుకుంటున్నాడని చెప్పారు. తాబేలు మాంసం తిని అస్వస్థకు గురైన అర్జున్ అనే మరొక వ్యక్తి ఇంకో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతను కూడా కోలుకుంటున్నాడని తెలిపారు. మృతులను పోస్టుమార్టం చేసిన సందర్భంగా వారి శరీర అంతర్భాగాలను తీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే మరణాలకు అసలు కారణం తెలుస్తుందన్నారు. వండిన తాబేలు మాంసం కూరను కూడా పరీక్షలకు పంపినట్టు రమణయ్య తెలిపారు.
టిడిపిని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలి
నల్లజర్ల, ఫిబ్రవరి 27: గ్రామస్థాయి కమిటీలను బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించవచ్చని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం ముసుళ్లగుంట గ్రామంలో టిడిపి గ్రామస్థాయి కమిటీ నియామక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థాయి కమిటీలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉన్నట్లన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షునిగా అయినపూడి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా మారిశెట్టి సీతారాంబాబుకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి మండల శాఖ అధ్యక్షుడు ఏలేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
జీలుగుమిల్లి, ఫిబ్రవరి 27: తాబేలు మాంసం కూర విషాహారం కావడంతో మృతి చెందిన సోయం సత్యనారాయణ, దుర్గమ్మ కుటుంబ సభ్యులను సోమవారం పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పరామర్శించారు. వారి కుమారుడు మధు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. తాబేలు మాంసం కూర తిని అస్వస్థతకు గురైన వారితో మాట్లాడి వారిద్దరు మృతి చెందడానికి కారణం అడిగి తెలుసుకున్నారు. వీరి కుమార్తెలు ఉమాదేవి, మమత, చిన్న కుమారుడు మంగరాజులను పరామర్శించి, ఎనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం తెలుగుదేశం పార్టీ తరపున అందజేసారు. వీరికి ప్రభుత్వం తరపున వచ్చే ఆర్థిక సహాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటిసి బాసిన రాజబాబు, మండల టిడిపి అధ్యక్షుడు ఉండవల్లి సోమసుందరం తదితరులు పాల్గొన్నారు.