పశ్చిమగోదావరి

బెనిఫిట్ షోల ఆదాయం రెడ్‌క్రాస్‌కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 28: జిల్లాలో కొత్త సినిమాల బెనిఫిట్‌షోలపై వచ్చే ఆదాయాన్ని రెడ్‌క్రాస్ సంస్ధకు చెందేలా తగుచర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు, రెడ్‌క్రాస్ సంస్ధ ఛైర్మన్ డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక జడ్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన రెడ్‌క్రాస్ సంస్ధ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పలు సినిమాలు బెనిఫిట్‌షోలతో ప్రారంభమవుతున్నాయని, దీనిపై వచ్చే ఆదాయం పూర్తిగా రెడ్‌క్రాస్‌కు చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని ప్రతీ మండలంలో రెడ్‌క్రాస్ బ్రాంచిలను ఏర్పాటుచేస్తామని, అయా మండలాల్లో సామాజిక, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాలో గత రెండునెలల్లో 17 నేత్రాలను దానంగా సేకరించామని, భవిష్యత్‌లో నేత్రదానాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రెడ్‌క్రాస్ నూతన భవన నిర్మాణానికి రూ. 15లక్షలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. రెడ్‌క్రాస్ అధ్యక్షులు డాక్టరు ఎంబిఎస్‌వి ప్రసాద్, వైస్‌ఛైర్మన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సభ్యులు గురజాడ శ్రీకాంత్, ఎల్ వెంకటేశ్వరరావు, బి వెంకటేశ్వరరావు, చిరంజీవి, కంభాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
చౌకడిపోల్లో నూరుశాతం లావాదేవీలు
ఏలూరు, ఫిబ్రవరి 28: జిల్లాలో చౌకడిపోల్లో నూరుశాతం నగదురహిత లావాదేవీలు జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు తహసిల్దార్లను ఆదేశించారు. స్దానిక కలెక్టరేట్ నుండి మంగళవారం తహసీల్దార్లు, పౌరసరఫరాల అధికారులు, డీలర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన నగదురహిత లావాదేవీలపై సమీక్షించారు. మార్చి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రజలకు నిత్యావసర సరుకులు చౌకడిపోల్లో అందిస్తారని, ప్రతి కార్డుదారుడు వేలిముద్ర ఆధారంగా నగదురహిత లావాదేవీలు జరిపేలా చూడాలన్నారు. జిల్లాలో 770 చౌకడిపోలకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని రెండురోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డిఎస్‌ఒ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.