పశ్చిమగోదావరి

పనిచేసే వారికి పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, ఫిబ్రవరి 28: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన జిల్లాలో స్థానిక సంస్థల నుండి విధాన మండలి సభ్యులను ఎన్నుకోవలసి వచ్చినప్పుడు పార్టీ వర్గాలు కోరుకున్నవారికే టిక్కెట్ ఇవ్వటం ద్వారా జిల్లాలో పనిచేసేవారికి టిడిపిలో పదవులు వస్తాయన్న సంకేతం చంద్రబాబు ఇచ్చారు. పంచాయతీ వార్డు సభ్యునిగా, సర్పంచ్‌గా, పాలకొల్లు మండల అధ్యక్షునిగా రెండు సార్లు ఎన్నికైన అంగర రామమోహన్ తొలి నుండి ఎన్ని సమస్యలున్నా పార్టీని వీడకుండా, ఎవరిని అభ్యర్థిగా నిలిపినా వారి విజయం కోసం పనిచేసిన వ్యక్తిగా, వివాదం లేని వ్యక్తిగా రాజకీయాలు నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిచిన ఆయనకు జడ్పీ వైస్ ఛైర్మన్ పదవి కూడా యిచ్చారు. తరువాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ఎక్కడ పరిశీలకులుగా వెళ్లినా తనదైన శైలిలో వివాదాలు లేని, విమర్శలు లేని విధంగా కృషి చేసి ప్రజల్లో, పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. బిసి ప్రతినిధిగా ఆయనను గుర్తించినా అన్ని వర్గాలు అభిమానాన్ని చూరగొన్న మంచి వ్యక్తి ఆయన. గతంలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే విధాన మండలి ప్రభుత్వ విప్‌గా ఆయనకు పదవినిచ్చి ముఖ్యమంత్రి అంగరపై ఉన్న వాత్సల్యాన్ని చాటుకున్నారు.
ఎవరీ పాందువ్వ శ్రీను...!
రెండవ అభ్యర్థి మంతెన వెంకట సత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను) 42 ఏళ్లకే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పొందారు. ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన శ్రీను రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. గతంలో రాష్ట్ర తెలుగుయువత కార్యాలయ కార్యదర్శిగా, అమలాపురం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 15 ఏళ్లుగా తెలుగుదేశంలో క్రియాశీలకంగా తెరవెనుక పనిచేస్తూ వచ్చారు. ఇంజనీరింగ్ పరిశ్రమ, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో ఉంటూ టిడిపి పట్ల ఆకర్షితులయ్యారు. మీకోసం యాత్ర కార్యక్రమంలో చంద్రబాబుకు సమన్వయ కర్తగా పనిచేశారు. పార్టీ తరఫున 2011లో సౌత్ ఆఫ్రికా పర్యటనలో పాల్గొన్నారు. 2012లో చైనా పర్యటించారు. చంద్రబాబు ఢిల్లీ దీక్షకు ఆయన ఏర్పాట్లు చేశారు. రాజకీయ కుటుంబానికి చెందిన శ్రీనుకు టిక్కెట్ ఇవ్వటం పట్ల అందరిలో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఎఎంసి చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, పట్టణ టిడిపి అధ్యక్షులు బోనం నరసింహారావు, కార్యదర్శి గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, మండల అధ్యక్షులు పెనె్మత్స శ్రీదేవి, బి సుజాత, టిడిపి నాయకులు కోడి విజయభాస్కర్, చిట్టూరి సీతారామాంజనేయులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
నియోజకవర్గం నుండి 40 కార్లు
ఏలూరులో అంగర రామమోహన్ నామినేషన్ కోసం మంగళవారం 40 కార్లలో పాలకొల్లు నుండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ర్యాలీని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు జెండా ఊపి ప్రారంభించారు.