పశ్చిమగోదావరి

డొక్కు ఇంట్లో అగర్భ శ్రీమంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 3: బయటనుంచి చూస్తే ఆ ఇంటిలో ఎవరో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ నెలవారీ జీతంతో మూడువంతులకు పైగా అప్పులతో గడిచే కుటుంబంలా కన్పిస్తుంది. కానీ ఎసిబి అధికారులు శుక్రవారం ఆ ఇంటిపై దాడి చేయటంతో చుట్టుప్రక్కలవారు కూడా ఆశ్చర్యపోయారు. చివరకు ఆ ఇంటిలో దొరికిన ఆస్తుల చిట్టా చూసి ఎసిబి అధికారులే నిర్ఘాంతపోయారంటే ఆతిశయోక్తి కాదు. కనీసం ప్లాస్టరింగ్ కూడా లేకుండా ఎటువంటి నిర్వహణ కన్పించని ఆ రెండుగదుల ఇంటిలో కృష్ణాజిల్లా గన్నవరం సబ్‌ట్రెజరీ అధికారి నివాసం ఉంటున్నారని, ఆయనకు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కనీసం 15కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయంటే నమ్మశక్యం కాదనే చెప్పాలి. కానీ ఇది అంతా వాస్తవం. ఈవిషయంలో అలాంటి ఇంటిలో ఉంటే ఎసిబి కన్ను తనపై పడదన్న నమ్మకంతో ఆ అధికారి కొంత అతితెలివి ప్రదర్శించినా అధికారుల నిఘా, పరిశీలన నేపధ్యంలో ఎసిబి అధికారులకు ఆయన అడ్డంగా దొరికిపోయారు. కృష్ణా జిల్లా గన్నవరం సబ్‌ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న గడ్డం విజయగణేష్‌బాబు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు అభియోగంతో ఎసిబి వలలో చిక్కిపోయారు. శుక్రవారం ఎసిబి అధికారులు ఏలూరు, తాడేపల్లిగూడెం, కృష్ణా జిల్లా గన్నవరం ట్రెజరీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చివరకు ఏలూరులో గణేష్‌బాబు నివాసం ఉంటున్న ఆ డొక్కు ఇల్లులా కన్పిస్తున్న ప్రాంతం ఆస్తుల గనిలా మారిపోయిందని చివరకు తేలింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు ఈ తనిఖీలు ఆ ఇంటిలో సాగుతూనే వచ్చాయి. అయితే ఇవి పూర్తికాకపోవటంతో శనివారం కూడా తనిఖీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారంటే ఆ గని ఎంత లోతైందో అర్ధం చేసుకోవచ్చు. ప్రాధమికంగా బయటపడ్డ వివరాలను చూసినా గణేష్‌బాబు ఆస్తులు పరిశీలిస్తే కళ్లు బైర్లుకమ్మక మానవు. జిల్లాలోనే ఆయనకు దాదాపు 19రకాల ఆస్తులున్నట్లు దస్తావేజులు బయటపడ్డాయి. వీటిలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల స్ధలాలు, వ్యవసాయభూములు అనేకం వెలుగుచూశాయి. ఆయనకు ఆస్తుల కూడబెట్టడానికి జిల్లా సరిపోలేదేమోనన్నట్లుగా ఏకంగా మహారాష్టల్రోని నాందేడ్‌లో కూడా ఆస్తులను ఆయన కూడబెట్టారంటే ఈ చిట్టా ఏస్ధాయికి చేరిఉంటుందో అర్ధమవుతుంది. ఇక గణేష్‌బాబు మద్యం ప్రియుడు కూడా అవునో కాదో తెలియదుగాని ఆయన స్వాధీనంలో దేశీయ, విదేశీ మద్యం బాటిళ్లు భారీగా బయటపడ్డాయి. ఎక్సైజ్ నిబంధనలు కూడా దీనిలో ఉల్లంఘించడంతో ఆశాఖ కూడా తనవంతుగా ఒక కేసు నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన గడ్డం విజయగణేష్‌బాబు 1993లో జూనియర్ అక్కౌంటెంట్‌గా ఏలూరులో ట్రజరీలో ఉద్యోగంలో చేరారు. అనంతరం సీనియర్ అక్కౌంటెంట్‌గా పదోన్నతి పొంది ఏలూరు, నరసాపురంలలో పనిచేశారు. ఆతర్వాత ఎస్టీఓగా పదోన్నతి పొందిన ఆయన ఏలూరులో పనిచేస్తూ ఏడాదిన్నర క్రితం గన్నవరం బదిలీపై వెళ్లారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్లు సమాచారం అందటంతో ఎసిబి అధికారులు నిఘా పెట్టారు. పూర్తివివరాలు సేకరించిన అనంతరం శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. స్ధానిక అమీనాపేటలో ఆయన నివాసం ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. ఈసందర్భంగా పలు ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా భారీస్ధాయిలో వడ్డీవ్యాపారం చేసే గణేష్‌బాబు ఇంటిలో అప్పులు ఇచ్చిన వారి సంతకాలతో ఖాళీగా ఉన్న 78 ప్రామిసరీ నోట్లు, 26 బ్లాంక్ చెక్కులు దొరికాయి. ఇదే సమయంలో ఏలూరు ఆర్‌ఆర్ పేటలో నివాసం ఉంటున్న గణేష్‌బాబు స్నేహితుడు, జంగారెడ్డిగూడెం ఎస్‌టిఓ బసవరాజు ఇంటిలో కూడా ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఈతనిఖీల్లో ఎటువంటివాటిని గుర్తించలేదు. అదేవిధంగా తాడేపల్లిగూడెంలో ఉంటున్న గణేష్‌బాబు అత్తగారింటిలోనూ, బావమరిది ఇంటిలోనూ కూడా ఎసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. గన్నవరం సబ్‌ట్రజరీ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగాయి. స్థానిక శ్రీరామ్‌నగర్ 2వ రోడ్డులో మూడు అంతస్తుల భవనం, తంగెళ్లమూడిలో నూతనంగా నిర్మిస్తున్న మూడు అంతస్తుల భవనంతోపాటు మరో రెండు ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు పలు ప్లాట్లు, అపార్టమెంట్‌లకు సంబంధించిన దస్తావేజులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పూళ్ల గ్రామంలో వ్యవసాయభూములకు సంబంధించిన దస్తావేజులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవేకాకుండా మహారాష్టల్రోని నాందేడ్‌లో కూడా గణేష్‌బాబుకు ఆస్తులున్నట్లు గుర్తించారు. ఇక ఏలూరు పంజాబ్ నేషనల్ బ్యాంకులోని లాకర్‌ను తనిఖీ చేయగా 350 గ్రాముల బంగారం, కేజీ వెండి వస్తువులను ఎసిబి అధికారులు గుర్తించారు. ఇక వీటి అన్నింటికి మించి సంతానాన్ని విదేశాల్లో ఉన్నత చదువులు చదివించాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. సాధారణంగా ప్రతిభ చూపి అక్కడ సీట్లు సాధించుకోవాలని పిల్లలను ప్రోత్సహిస్తారు. అయితే అగర్భశ్రీమంతుడిగా మారిన గణేష్‌బాబు తన కుమారుడును చైనాలోను, కుమార్తెను అమెరికాలోను పేమెంట్ సీట్లలో చేర్చి మరీ మెడిసిన్ చదివిస్తున్నారు. ఈ దాడులలో జిల్లా ఎసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ, సిఐ యుజె విల్సన్, రాజమండ్రి ఎసిబి డిఎస్పీ ఎం సుధాకరరావు, సిఐ సూర్యమోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సిఐ యుజె విల్సన్ ఆధ్వర్యంలో గణేష్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.