పశ్చిమగోదావరి

సభ్యత్వ నమోదులో టిడిపి రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 3: తెలుగుదేశం పార్టీ సంస్థగత ఎన్నికల నిర్వహణ పూర్తి చేసుకుంది. సమర్ధవంతంగా జిల్లాలోని అన్ని వార్డు, గ్రామ స్థాయి సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుని, సభ్యత్వ నమోదుకు దూసుకువెళ్తోంది. జిల్లాలోని సభ్యుత్వ నమోదు చేసుకున్న ప్రతీ కార్యకర్తకు పార్టీ అదినేత, సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆశిస్సులతో గుర్తింపు కార్డులను అందివ్వనున్నారు. కార్యకర్తలు సభ్యుత్వ నమోదు చేసుకున్న కార్డులను భీమవరం తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నుంచి పంపిణి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించిందన్నారు. ఈ సారి 6లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకున్నారన్నారు. వీరందరికీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్డులను అదిస్తామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాలను ఎంతో అభివృద్ధి చేస్తున్నారని వారిని అభినందించారు. పార్టీ సభ్యత్వాలు నియోజవర్గంలో ఎంతో విజయవంతంగా పూర్తిచేశారన్నారు. అలాగే పార్టీలో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు పార్టీకి సేవలందించాలని, నియోజకవర్గంలో కొత్త కార్యవర్గాలు అన్ని కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మెంటే పార్థసారధి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వంవల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, జివితబీమా, ప్రమాద బీమా మొదలగు ఉపయోగాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, గనిరెడ్డి త్రినాధ్, తోట బోగయ్య, మెరగాని నారాయణ వర్మ, వెంకటేశ్వరరావు, నాగిడి తాతాజి, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.
అందరం కలిసి సేవ చేద్దాం
* భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అన్నదానం ప్రారంభం* హాజరైన జిల్లా కలెక్టర్ బాస్కర్

భీమవరం, మార్చి 3: ప్రభుత్వం పేదలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తోంది. స్వచ్ఛంద సంస్ధలు ముందుకు వచ్చి తమవంతు సహాయ సహకారాలు అందివ్వాలి. అందరం కలిసి సేవ చేద్దామని జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికిలో ప్రముఖ రైస్ కమీషన్ ఏజెంట్ గుడివాడ వెంకటేశ్వరరావు తనయుడు నాని నేతృత్వంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రోగుల బంధువులకు నిత్యాన్నదానం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రతీ రోజు 100 మంది రోగుల బంధువులకు అన్నదానం చెయ్యడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అదే విధంగా అన్నదానం కోసం ఆసుపత్రిపైన ప్రత్యేకమైన షెడ్డును నిర్మించారు. దీన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చెయ్యడం అభినందనీయమన్నారు. ఈ విధంగా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి తమవంతు సహకారాన్ని అందివ్వాలని పిలుపునిచ్చారు. రోగుల బంధువులకు ఉదయం, సాయంత్రం వేళల్లో సత్యసాయి సేవా సంస్థ ఉచిత భోజనాన్ని అందివ్వడం జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, ఆ విధంగా జిల్లా కలెక్టర్ సహకారం అందివ్వాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు, ఆసుపత్రి ఛైర్మన్ మామిడిశెట్టి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గనిరెడ్డి త్రినాధ్, చెల్లబోయిన వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఇది సమిష్టి విజయం
ఎమ్మెల్సీ ఎన్నికపై మంత్రి సుజాత
ఏలూరు, మార్చి 3 : జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోవడం సమిష్టి విజయమని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైన టిడిపి అభ్యర్ధులు అంగర రామ్మోహన్, మంతెన వెంకట సత్యనారాయణ రాజు (పాందువ్వ శ్రీను)లను మంత్రి పీతల సుజాత, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి జిల్లా కంచుకోట అని మరోసారి రుజువు చేయడం జరిగిందని, ఈ విజయంతో పార్టీకి మరింత ఉత్సాహం కలిగిందన్నారు. పార్టీ నాయకులంతా ఈ ఎన్నికల్లో ఐక్యంగా ఉండి కష్టపడి పనిచేసి ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి దోహదపడ్డారన్నారు.
బకాలయలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ కట్
గోపాలపురం, మార్చి 3: మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలు విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా సంబంధిత శాఖ అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు. దీంతో గత మూడు నాలుగు నెలలుగా గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలపై వత్తిడి చేస్తున్నా..తాము ప్రస్తుతం విద్యుత్ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో లేమని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. విడుదలవుతున్న అరకొర నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకే సరిపోతోందని, ఇక విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు సొమ్ములెక్కడవని ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు చెల్లించి, గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపాలని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పేరుపాలెంలో భారీ పండుగప్ప
మొగల్తూరు, మార్చి 3: మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామానికి చెందిన మోకా మురళీకృష్ణకు చెందిన చేపల చెరువులో శుక్రవారం భారీ పండుగప్ప జాతికి చెందిన చేప లభించింది. ఈ చేప ఏడు కేజీలు బరువు ఉందని, రూ.2.500లు ధర పలుకుతుందని రైతు పేర్కొన్నాడు. ఈ ప్రాంతంలోని చేపల చెరువుల్లో ఇంత భారీ పండుగప్ప లభించడం చాలా అరుదని ఆక్వా రైతులు చెబుతున్నారు.
పాందువ్వకు పదవితో ఉండిలో నూతనశకానికి నాంది
ఉండి, మార్చి 3:స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఉండి మండలం పాందువ్వకు చెందిన మంతెన వెంకట సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను) ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఉండి నియోజకవర్గం రాజకీయాల్లో నూతనశకానికి నాంది పలికింది. ఈప్రాంతం నుండి ఎమ్మెల్సీ అయిన రెండవ వ్యక్తి ఈయన. గతంలో 1973లో స్థానిక సంస్థల నుండి అప్పటి ఉప్పులూరు సర్పంచ్‌గా ఉన్న యర్రా నారాయణస్వామి ఎమ్మెల్సీగా ఎన్నికై జలగం వెంగళ్రావు కేబ్‌నెట్‌లో చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఉండి మండలంలో పాందువ్వ నుండి గతంలో ఎంపి గోకరాజు గంగరాజు మావగారైన వికెవిడి సత్యనారాయణరాజు ఎమ్మెల్యేగా గెలిసి టిడిపి ఉప నాయకుడుగా కూడా పనిచేశారు. తిరిగి అదే గ్రామం నుండి టిడిపి నుండి పాందువ్వ శ్రీను ఎన్నికవటంతో ఈప్రాంతంలోప్రజాప్రతినిధుల వరవడి కొనసాగింపుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
నెరవేరిన కలిదిండి డిమాండ్
మాజీ మంత్రి స్వర్గీయ కలిదిండి రామచంద్రరాజు ఆయన హాయాంలో నియోజకవర్గం సమావేశం ఎప్పుడు జరిగినా ఉండికి ఒక ఎమ్మెల్సీ కావాలని గట్టిగా కోరేవారు. ప్రత్యేకంగా పరిశీలకులుగా వచ్చిన నాయకులను తమ డిమాండ్‌గా పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళాలని కోరేవారు. ఇన్నాళ్లకు తిరిగి ఉండికి ఎమ్మెల్సీ స్థానం వచ్చి కలిదిండి డిమాండ్ నెరవేరింది. ఎమ్మెల్సీగా ఎన్నికైన పాందువ్వ శ్రీను ఉండి నియోజకవర్గంలో ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా కార్యకర్తలతో ఎప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి అందరివాడిగా మంచిపేరు ఉంది. పాందువ్వ శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికవటంతో ఉండి నియోజకవర్గంలోను ఆయన స్వగ్రామం పాందువ్వలోను కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాచీనకాలం నాణాలపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ సతీమణి కుందన ప్రభ
ఏలూరు, మార్చి 3 : ఆధునిక యువతకు పురాతన నాణాలు, కరెన్సీ నోట్ల గురించి తెలియజేయడానికి ఏలూరులో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసి భావితరాలకు ప్రాచీనకాలం నాటి నాణాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సతీమణి కుందన ప్రభ పేర్కొన్నారు. స్థానిక సి ఆర్ రెడ్డి పబ్లిక్ స్కూలు ఆడిటోరియంలో కనకమహాలక్ష్మి సహకార బ్యాంకు ఆధ్వర్యంలో పురాతన నాణాలు, పురాతన వస్తువులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల నాటి అరుదైన నాణాలు, కరెన్సీ నోట్లు ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహ్మదీయుల కాలం నాటి అతి చిన్న బంగారు నాణెం మొదలు కెనడా డాలరు, రష్యా, అమెరికా, జపాన్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాల్లో వినియోగించిన పురాతన నాణాలు అందరినీ అబ్బుర పరుస్తాయని పేర్కొన్నారు. నాణాలను ఎంతో శ్రమించి సేకరించిన విశాఖ కనక మహాలక్ష్మి సహకార బ్యాంకు మేనేజర్ జి శివప్రకాష్‌ను ఆమె అభినందించారు. బ్యాంకు పాలకవర్గం ఉపాధ్యక్షులు కొమ్మారెడ్డి రాంబాబు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించడానికి ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని, దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ మేనేజర్ ధనుంజయ, మేనేజర్ కోటేశ్వరరావు తదితరులుపాల్గొన్నారు.

సవాల్‌గా మారిన పింఛన్ల పంపిణీ
వీరవాసరం, మార్చి 1: మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ కార్యదర్శులకు సవాల్‌గా మారింది. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. పింఛన్లు ఇచ్చే ట్యాబ్‌లు పనిచేయకపోవడం, నెట్‌వర్క్ అందుబాటులోకి రాకపోవడంతో పింఛనుదారులు నరకం అనుభవిస్తున్నారు. మత్స్యపురిపాలెం, దూసనపూడి, బొబ్బనపల్లి, నేలపోగుల తదితర మారుమూల ప్రాంతాల్లో రోజుకు రెండు, మూడు గంటలు తప్ప మిగిలిన సమయాల్లో ట్యాబ్‌లు పనిచేయడం లేదు. దీంతో వికలాంగులు, వయోవృద్ధులు పంచాయితీ కార్యాలయాల వద్దకే టిఫిన్లు, భోజనాలు తెచ్చుకుంటున్నారు. అధిక పింఛనుదారులుండే వీరవాసరం పంచాయితీ వద్ద శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది వరకు పింఛన్ల కోసం లబ్ధిదారులు బారులు తీరారు. వీరవాసరం పంచాయితీ కార్యాలయంలో ఒకే ట్యాబ్ ఉండడంతో ఒక్కొక్కరు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. పింఛనుదారుల వేలిముద్రలు ట్యాబ్‌కు అనుసంధానం కాకపోతే వారి నేత్రాలను ఐరిష్ తీయాల్సి వస్తోంది. అదీ పనిచేయకపోతే మరో గంట, రెండు గంటలు పింఛనుదారు ఆగాల్సి వస్తోంది. దీంతో వారి సహాయకులు కూడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నేరుగా బ్యాంకులో పింఛన్లు జమచేయాలని పలువురు పింఛనుదారులు కోరుతున్నారు.
వేసిలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీకి నిర్ణయం
ఉంగుటూరు, మార్చి 3: వేసవిలో రెండువేల ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇంటింటికీ పంపణీ చేసేలా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సలహా కమిటీ నిర్ణయించింది. శుక్రవారం పిహెచ్‌సిలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బొమ్మిడి అప్పారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండువేల ప్యాకెట్లు ఆసుపత్రిలో ఉంచేలా, మరో రెండువేల ప్యాకెట్లు గ్రామంలో పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. అలాగే బిపి, షుగర్ ఉన్న రోగులకు రికార్డు బుక్‌లెట్ ప్రచురించి అందచేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అదనపు డిఎంహెచ్‌ఒ ఉమాదేవి మాట్లాడుతూ చేబ్రోలు పిహెచ్‌సిని ఎ గ్రేడుకు తీసుకురావడానికి సిబ్బంది కృషిచేయాలన్నారు. సమావేశంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ఎంపిపి గోలి శ్రీనివాసరావు, సింగలూరి రామకృష్ణ, డాక్టర్ ఆనందం, డాక్టర్ శే్వత, డాక్టర్ శ్రీనివాసు పాల్గొన్నారు.

ముగ్గురు ఇండిపెండెంట్లు నామినేషన్ల ఉపసంహరణ
ఏలూరు, మార్చి 3 : జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటీలో వున్న ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం మధ్యాహ్నం వారు నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను జిల్లా జాయింట్‌కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి కోటేశ్వరరావుకు అందజేశారు. స్వతంత్ర అభ్యర్ధులు డి ఎస్ ఎస్ ప్రసాద్, మేడపాటి సాయి చంద్ర వౌళీశ్వరరెడ్డి, నెల్లి రాజేష్ తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. కార్యక్రమంలో డి ఆర్‌వో కట్టా హైమావతి, భూసేకరణ అధికారులు ఆర్‌వి సూర్యనారాయణ, పుష్పమణి పాల్గొన్నారు.