పశ్చిమగోదావరి

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 16: జిల్లాలో టెన్త్ పరీక్షల హంగామా మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో 246 పరీక్షా కేంద్రాల్లో 49822 మంది విద్యార్ధులు శుక్రవారం నుంచి ఈపరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 49822 మంది విద్యార్ధుల్లో 24731 మంది బాలికలు కాగా 25091 మంది బాలురు ఉన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్ధులు 49113మంది కాగా ప్రైవేటు విద్యార్ధులు 709మంది ఉన్నారు. ఉదయం 9.30గంటల నుండి మధ్యాహ్నం 12.15గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్ధులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత విద్యార్ధులను ఎట్టిపరిస్దితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించరు. మొత్తం 246 పరీక్షాకేంద్రాలకుగాను రెగ్యులర్ విద్యార్ధులకు 237, ప్రైవేటు విద్యార్ధులకు 9 కేంద్రాలను కేటాయించారు. మొత్తం 9పరీక్షా కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. ఇంతకుముందు అన్ని పరీక్షాకేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా యంత్రాంగం చివరినిముషంలో చేతులెత్తేసింది. దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేయటంతో అధికారులు వెనకడుగువేశారు. దీంతో అయిదు కేంద్రాల్లో మాత్రమే ఈసారికి సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. మిగిలిన 4 సమస్యాత్మక కేంద్రాల్లో స్క్వాడ్‌లను నియమించారు. జిల్లాలో కలిసిన కుకునూరు, వేలేరుపాడులలోని పరీక్షాకేంద్రాల్లో ప్రత్యేక స్క్వాడ్‌లను నియమించారు. అన్నిపరీక్షాకేంద్రాల వద్ద పరీక్షలు జరుగుతున్న సమయంలో 144సెక్షన్ అమలు చేస్తారు. పరీక్షల నిర్వహణకు 246మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 246మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను, 17మంది అదనపు డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 110మంది కస్టోడియన్లు, 14 ఫ్లైయింగ్‌స్క్వాడ్‌లను, 25మంది రూట్ ఆఫీసర్లను, 25మంది అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను, 45 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. వీరితోపాటు 2673మంది ఇన్విజిలేటర్లను కూడా నియమించారు. పరీక్షాకేంద్రాలకు ఇన్విజిలేటర్లను ఎంపిక చేసేందుకు లాటరీ పద్దతిని అమలుచేస్తారు. ఒక్కొ ఇన్విజిరేటర్ ఒక్కొ పరీక్షాకేంద్రంలో నాలుగురోజులు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పరీక్షాకేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు. చీఫ్ సూపరింటెండెంట్లు కూడా కెమెరా సౌకర్యం లేని సెల్‌ఫోన్లను మాత్రమే వినియోగించాలని అధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టెన్త్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటుచేశారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే 08812-230343 నెంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయవచ్చు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా పర్యవేక్షకులుగా ఆర్ నరసింహరావును నియమించారు. అంతేకాకుండా ఈసారి ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదువుకునేందుకు అదనంగా 15 నిముషాలపాటు సమయాన్ని కేటాయించారు.
ప్రాణాంతక వ్యాధులు సోకకుండా ప్రత్యేక చర్యలు
వైద్యశాఖాధికారులకు కలెక్టర్ భాస్కర్ ఆదేశం
ఏలూరు, మార్చి 16 : జిల్లాలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా తదితర ప్రాణాంతకరమైన వ్యాధులు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య శాకాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలేరియా కేసు నమోదైన ప్రాంతంలో మురుగునీరు, చెత్తా, చెదారం లేకుండా పరిసరాలు శుభ్రం చేయించాలని, దోమల మందులు స్ప్రే చేయించి తక్షణ చర్యలు కోసం నమోదైన పరిసర ప్రాంతాల్లో చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెచ్ ఐవి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రహదారుల ప్రక్కన త్వరలో ఏర్పాటుచేసే వాహన డ్రైవర్ల విశ్రాంతి కేంద్రాల వద్ద హెచ్ ఐవి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ వైద్య శాఖాధికారులను ఆదేశించారు. ఎన్‌టి ఆర్ ఆరోగ్య రక్ష పధకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇతర జిల్లాలో ఎన్‌టి ఆర్ ఆరోగ్య రక్ష పధకంలో ఎక్కువ మంది లబ్ధిదారులను జాయిన్ చేసారని మన జిల్లాలో ఆరోగ్య రక్ష పధకం సక్రమంగా సాగక పోవడం పట్ల సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డి ఎంహెచ్ ఓను కలెక్టర్ ఆదేశించారు. చంద్రన్న సంచార వాహనాలు జిల్లాలోని ప్రతి గ్రామంలో వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఉదయం 8 గంటలకు గ్రామాల్లోకి వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గ్రామంలో సంచార వాహనం ద్వారా చికిత్సలు అందించేందుకు సిబ్బంది ఫీల్డ్‌లోకి వెళ్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిసిహెచ్ ఎస్ డాక్టర్ శంకరరావు, డి ఎంహెచ్ ఓ కోటేశ్వరి, డి ఐవో మోహనకృష్ణ, అడిషనల్ డి ఎంహెచ్ ఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.