పశ్చిమగోదావరి

భక్తులపై తేనెటీగల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, మార్చి 19: మండలంలోని ముప్పినవారిగూడెంలో తేనెటీగలు దాడికి కొందరు భక్తులు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం..ముప్పినవారిగూడెంలో ఆదివారం కడియాలమ్మ గుడి వద్ద దుర్గమ్మ, గుబ్బలమంగమ్మ విగ్రహ ప్రతిష్ఠల సందర్భంగా గణపతి హోమం నిర్వహిస్తున్నారు. హోమ క్రతువు సమయంలో హోమగుండం నుండి వెలువడిన పొగ కారణంగా గుడి వద్ద ఉన్న పెద్ద మర్రిచెట్టుపై గల తేనెపట్టు నుండి తేనెటీగలు చెలరేగి భక్తులపై దాడికి తెగబడ్డాయి. చాలామంది భక్తులు తేనెటీగల భారినపడి గాయాలపాలయ్యారు. తీవ్రంగా గాయపడిన పురోహితుడు అనిపెద్ది విశ్వనాధశర్మ, భక్తులు భద్రయ్య, నరసింహారావు, రమణయ్య తదితరులు చికిత్స కోసం బుట్టాయగూడెం సామాజిక ఆసుపత్రికి చేరుకోగా, వారిని మెరుగైన చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ప్రత్యేక హోదాపై చట్టబద్ధత కల్పించడంలో సిఎం పాత్ర ఎనలేనిది

గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి
గోపాలపురం, మార్చి 19: ఎపికి ప్రత్యేక హోదాపై చట్టబద్ధత కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఎనలేనిదని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా టిడిపి ప్రచార కార్యదర్శి చెలికాని సోంబాబు కొనియాడారు. గోపాలపురం నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం వేళ్లచింతలగూడెం గ్రామంలో ఆదివారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గద్దె హరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయం కేంద్ర ప్రభుత్వం భరిస్తామనడం అభినందనీయమన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి మూలాలుగా ఉంటాయన్నారు. మార్చి నెలాఖరుకు నియోజకవర్గంలో నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి కృషిచేయాలన్నారు. జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శి చెలికాని సోంబాబు మాట్లాడుతూ గ్రామ కమిటీలు పూర్తయ్యాయని, ఏప్రిల్ రెండు నుండి 25లోపు మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. వేలిముద్రలు సరిగా పడని కారణంగా నిత్యావసర వస్తువులు సరిగా అందడం లేదని పలువురు కార్యకర్తలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జేష్ఠ శ్రీనివాసరావు, చదలవాడ ప్రసాద్, కె రాము, గద్దె దుర్గారావు, జేష్ఠ శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
మాలల రణగర్జనకు
తరలివెళ్లిన కార్యకర్తలు
అత్తిలి, మార్చి 19 : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అమరావతిలో జరిగే మాలల రణగర్జనకు అత్తిలి మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రయత్నాలు విరమించాలని, మాల ఉద్యోగుల తరపున రాష్ట్ర మున్సిపల్ టీచర్స్ సంఘ నాయకులు బొంతా బాలగంగాధర్ తిలక్, ఎస్సీ, ఎస్టీ మాల ఐక్య వేదిక జిల్లా యువజన కార్యదర్శి కొండే ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు వాహనాలపై తరలివెళ్ళారు.
పేదల కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి
నరసాపురం ఎమ్మెల్యే బండారు
నరసాపురం, మార్చి 19: పేదల కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యదర్శనం బస్సును ఆదివారం స్థానిక శ్రీ రాజగోపాలస్వామి ఆలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. హిందూ భక్తుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివ్య దర్శనం ఆనే ధార్మిక యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గం నుంచి నాలుగు బస్సులలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా దైవ దర్శనం చేయిస్తారన్నారు. విజయవాడ, జొన్నవాడ, శ్రీకాళహస్తి, తిరుమల, తిరుచానూరు, ఆహోబిలం, శ్రీశైలం, త్రిపురాంతకం వంటి పుణ్య క్షేత్రాలలో నాలుగు రోజుల పాటు ఉచిత దర్శనం, వసతి కల్పిస్తారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుసుపులేటి రత్నమాల సాయి, దేవాదాయ శాఖ సహాయ సంచాలకులు దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి, రాజగోపాలస్వామి ఆలయ చైర్మన్ గన్నవరపు శ్రీనివాసు, ఎఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, టిడిపి నాయకులు డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు, కొప్పాడ రవి, గుగ్గిలపు ధర్మాజీ, కొల్లు పెద్దిరాజు, భూపతి మంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గూడెం మార్కెట్ యార్డులో
మిర్చి విక్రయాలు

తాడేపల్లిగూడెం, మార్చి 19: మార్కెట్ యార్డులో గడిచిన రెండు వారాల కన్నా ఈ వారం ఎండుమిర్చి అమ్మకాలు అధికంగా జరిగాయి. మన రాష్ట్రంతోపాటు తెలంగాణా జిల్లాల నుంచి రైతులు ప్రత్యేక వాహనాల్లో ఎండుమిర్చి తీసుకొచ్చి యార్డులో లావాదేవీలు నిర్వహించారు. సన్నరకం 50 నుంచి 70 రూపాయల వరకు, లావు రకం 190 నుంచి 220 రూపాయల వరకు విక్రయాలు సాగాయి. మార్కెట్ యార్డుకు గత రెండు వారాల కన్నా ఈ వారం అధికంగా రూ.35వేలు ఆదాయం లభించిందని మార్కెట్ యార్డు ఛైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి తెలిపారు.