పశ్చిమగోదావరి

లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 8 : నారా లోకేష్ సమర్ధవంతమైన పాలనను ప్రజలకు అందించగలరని, ఆయన సమర్ధతను గుర్తించి రాష్ట్ర మంత్రివర్గంలోకి చేర్చుకోవాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కోరారు. శుక్రవారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి పీతల ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి 50 లక్షలకు పైగా సభ్యత్వాన్ని కల్పించడంలో లోకేష్ ఎంతో కృతకృత్యులయ్యారని తెలిపారు. ఒక వైపు పార్టీని సమర్ధంగా నడుపుతూ పార్టీ కార్యకర్తలకు బీమా పధకాన్ని అమలు చేసి ఆపదలో వున్న కార్యకర్తలకు ఆయన అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగా లోకేష్ నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరారు. యువతరం ఆశాజ్యోతిగా లోకేష్ మంచి పేరు సంపాదిస్తున్నారని, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించడానికి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఆయన సేవలు ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా 65 వేల కోట్ల రూపాయలను కేవలం సంక్షేమ పధకాలకే వెచ్చిస్తూ ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వేసవి తీవ్రత అధికమవుతున్న దృష్ట్యా మంచినీటి చలివేంద్రాలను ఎక్కడికక్కడ ప్రారంభించాలని కోరారు. మంత్రివెంట ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎ ఎంసి ఛైర్మన్ కురెళ్ల రాంప్రసాద్, ఎంపిపి రెడ్డి అనురాధ తదితరులున్నారు.