పశ్చిమగోదావరి

రాష్ట్రంలో బలీయమైన శక్తిగా బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో బలీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీని నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ అమలు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాదిలో కూడా పార్టీ బలీయంగా ఎదుగుతుందన్నారు. బూత్ స్థాయి నుంచి పటిష్టంగా రూపుదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏ ప్రతిఫలం ఆశించని స్వచ్ఛంద కార్యకర్తలను నియోజకవర్గంలో పూర్తికాల బాధ్యులుగా నియమించాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించారన్నారు. ఇప్పటికే 28 మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను నియమించామన్నారు. పూర్తికాల బాధ్యులకు గుంటూరు జిల్లా నూతక్‌లో ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తామన్నారు. బిజెపి, తెలుగుదేశం నేతల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బిజెపి పక్ష నేత విష్ణుకుమార్‌రాజులతో ఈ కమిటీ ఏర్పాటైందన్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు కేంద్ర మంత్రులతో జాతీయ నాయకులు ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. బూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సుమారు 50 వేల మందితో మే నెలలో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పెదతాడేపల్లి, నందమూరు, పడాల, పట్టింపాలెం, మీనవల్లూరు, ప్రత్తిపాడు, రాచర్ల గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిమిత్తం రూ.2 కోట్లు మార్జిన్ మనీ మంజూరయిందన్నారు. జడ్పీ హైస్కూలును వారసత్వపు సంపదగా, విద్యా సాంస్కృతిక చిహ్నంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జడ్పీ చైర్మన్‌తో వివాదం ఉందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. జడ్పీ పాఠశాల అభివృద్ధికి సిఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావుతో చర్చించానన్నారు.
విధులు సక్రమంగా నిర్వర్తించని సిబ్బందిని ఇంటికి సాగనంపాలి
నరసాపురం, ఏప్రిల్ 15: మున్సిపల్ కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వర్తించని సిబ్బందిని ఇంటికి సాగనంపాలని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశానికి చైర్‌పర్సన్ పసుపులేటి రత్నమాల సాయి అధ్యక్షత వహించారు. సమావేశంలో టిడిపి కౌన్సిలర్లు బళ్ళ వెంకటేశ్వరరావు, వనె్నంరెడ్డి శ్రీనివాసు, అధికారి అనంత రామారావు, వైసిపి కౌన్సిలర్లు కామన బాల సత్యనారాయణ, డిఎస్‌ఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ఫలితంగా ప్రజలు రోగాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలో 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు గాను రోజూ 40 మంది గైర్హాజరు అవుతున్నారని, దీనిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. మున్సిపల్ మేనేజరు చండీదేవసేన మాట్లాడుతూ విధి నిర్వహణలో సిబ్బంది సహకరించడం లేదని, సిబ్బందిని నిలదీస్తే తాము రాజకీయ సిఫార్సులతో వచ్చామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి, వైసిపి కౌన్సిలర్లు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పని చేయని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ప్రైవేటు ట్రావెల్స్, ఆక్వా పరిశ్రమల వాహనాలు నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, దీనిపై అధికారుల ఊదాసీనతను నిరసిస్తూ టిడిపి కౌన్సిలర్లు బళ్ళ వెంకటేశ్వరరావు, వనె్నంరెడ్డి శ్రీనివాసులు చైర్‌పర్సన్ పోడియం ఎదుట బైఠాయించారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ రత్నమాల సాయి మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వాహనాల నిర్వాహకులతో వారంలోపు సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.