పశ్చిమగోదావరి

ఇంటర్ స్టేట్ ర్యాంకర్ సాయసృజనకు సిఎం సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 29 : ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎంపిసి గ్రూపులో 991 మార్కులుసాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన ఆర్ సాయి సృజనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఏలూరులో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. లింగపాలెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఆర్ సాయి సృజన ఏలూరులోని శ్రీ భారతి విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ చదివింది. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో 991 మార్కులు సాధించి రాష్టస్థ్రాయిలో ద్వితీయ స్థానం సంపాదించింది. ఇక్కడకు సమీపంలోని ఒక ఫంక్షన్ హాలులో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆ విద్యార్ధినిని అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. అదే విధంగా భారతీ విద్యాసంస్థల డైరెక్టర్ అన్నపనేని రవికుమార్‌ను కూడా ఆయన అభినందించారు. కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
నల్లజర్ల, ఏప్రిల్ 29: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ముందుగా చంద్రబాబు పోతవరంలో మహిళా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే యూత్ భవనాన్ని, అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్ర గొడౌన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆర్‌ఎంసి బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నీరు - ప్రగతిలో ఆధునికీకరించిన చెరువును ప్రారంభించారు. శనివారం ఉదయం పోతవరం హెలీప్యాడ్ వద్ద ఆయనకు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్‌రావు, ఎంపిలు మాగంటి మురళీమోహన్, తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, పోతవరం సర్పంచ్ పసుమర్తి రతీష్ స్వాగతం పలికారు.