పశ్చిమగోదావరి

ఉన్మాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుకునూరు, మే 11: పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులయ్యే వారికిచ్చే ప్యాకేజీ మొత్తం తనకే కావాలంటూ ఒక యువకుడు ఉన్మాదిగా మారాడు. తోడబుట్టిన అన్ననే కొనే్నళ్ల క్రితం హతమార్చిన ఆ కసాయ తాజాగా మరో అన్న, వదినలపై దాడిచేసి, గాయపరిచాడు. చివరకు కన్న తల్లిని సైతం కర్రతో కొట్టి హతమార్చాడు. కుకునూరు మండలం కమ్మరిగూడెంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా వున్నాయి. కమ్మరిగూడెం గ్రామానికి చెందిన సత్యవతికి ముగ్గురు కుమారులు. మొదటి వాడు భద్రం, రెండవ వాడు రమేష్, మూడవ వాడు శ్రీను. 2006లో వచ్చిన పోలవరం ప్యాకేజీకి సొమ్ము విషయంలో తన పెద్దన్నయ్య అయిన భద్రంతో గొడవపడిన చిన్నవాడైన శ్రీను అతడిని హత్యచేశాడు. అప్పుడే జైలు శిక్ష పడి బెయిల్‌పై వచ్చాడు. తాజాగా మరో రెండెకరాల 13 కుంటలకు రూ.25 లక్షల ప్యాకేజీ రావడంతో ఈ సొమ్మును సైతం తనే చేజిక్కించుకోవాలని భావించాడు. అందుకు అడ్డుగావున్న రెండవ అన్నయ్య అయిన రమేష్, వదిన లక్ష్మిపై బుధవారం దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వారిని చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. కాగా గురువారం మొత్తం ప్యాకేజీ సొమ్ము తనకే ఇవ్వాలంటూ తల్లి సత్యవతితో గొడవపడ్డాడు. పక్కనే వున్న కర్రతో ఆమెపై దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. ఈ ఘోరాన్ని చూసిన గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక సిఐ చిరంజీవి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు.

అన్యాక్రాంతమైన దళితుల భూముల లెక్కలు తేలుస్తా
ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ శివాజీ

టి నరసాపురం, మే 11: జిల్లాలో గిరిజనులు, దళితుల భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని, త్వరలో దీనిపై కమిటీ వేసి వాటి లెక్కలు తేలుస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఛైర్మన్ మాట్లాడుతూ కొంతమంది భూస్వాములు దళితులకు తక్కువ సొమ్ము చెల్లించి భూములను ఆక్రమించారని, జిల్లాలోని అన్ని మండలాల్లో త్వరలో దళిత, గిరిజనుల భూములపై సమావేశం ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన భూములను గిరిజనులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటానన్నారు. నేటికీ దొరతనం కొనసాగటం సిగ్గుచేటని, ప్రతి ఒక్క దళితుడు విద్యనభ్యసించి సంఘంలో తల ఎత్తుకుని తిరగాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి కృషిచేస్తానన్నారు. అనంతరం పదవ తరగతిలో మండలంలో ప్రథమస్థానం సాధించిన కె రాజేష్‌కు రూ.5వేల నగదును అందించారు. ఇళ్లస్థలాలు, పోడు భూములకు పట్టాలిప్పించాలని దళిత, గిరిజనులు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కర్రా రాజారావు, అలుగు ఆనందశేఖర్, సర్పంచ్ సోంబాబు, కాకర్ల సత్యనారాయణ, తహసీల్దార్ ఎన్ నాగరాజు, విల్సన్, టి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.