పశ్చిమగోదావరి

పర్యాటక హబ్‌గా ఏలూరు కాలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 15 : ఏలూరు కాలువను ఆర్నెల్లలో పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి చెప్పారు. స్థానిక పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో సోమవారం రాత్రి ఏలూరు అభివృద్దిపై జరిగిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఏలూరు అంటే మురికి కూపం అనే నానుడి ఉండేదని, ఆ పరిస్థితిని తొలగించి పర్యాటక హబ్‌గా ఏలూరును ప్రజలు మెచ్చే రీతిలో తీర్చిదిద్దుతానన్నారు. ఏలూరు కృష్ణకాలువ వెంబడి వున్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించడం జరిగిందని, రానున్న రోజుల్లో పూర్తి గ్రీనరీతో పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఏలూరు కాలువ ఆధునీకరణకు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని, త్వరలో నిధులు రానున్నాయని, రానున్న రెండునెలల్లో కాలువ ప్రాంతాన్ని పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దే పనులు చేపట్టి ఆర్నెల్లలో పూర్తి చేస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు అందరి సహకారంతో ఆక్రమణలు తొలగించి మాదేపల్లి రోడ్డు, చాటపర్రు రోడ్డు, తంగెళ్లమూడి, పత్తేబాద తదితర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టి యుద్ధప్రాతిపదికపై రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా తాను ముందుకు సాగుతానని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు. నగరంలో ఆధునిక మ్యూజియంను ఏర్పాటుచేస్తున్నామని, వెంకన్న చెరువు శ్మశానవాటికను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. 771 కోట్ల రూపాయల వ్యయంతో స్మార్ట్ సిటీ ఏర్పాటుతోపాటు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. తన తండ్రి బడేటి శ్రీహరిరావు పేరిట ట్రస్టును ఏర్పాటుచేసి గత ఏడాది పేద విద్యార్దుల విద్యాభివృద్ధికి 30 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 24న కొవ్వూరులో మినీ మహానాడు నిర్వహిస్తున్నామని, కార్యకర్తలు సభ్యత్వ కార్డు తీసుకుని హాజరుకావాలని కోరారు. ఈ నెల 20న టిడిపి జిల్లా కమిటీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, కో ఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు, మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు, కార్పొరేటర్లు మారం హనుమంతరావు, దాకారపు రాజేశ్వరరావు, కె ఉమామహేశ్వరరావు, పునుకొల్లు పార్ధసారధి, భీమవరపు హేమసుందరి, చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

మంత్రి నారాయణకు ఎంపి తోట పరామర్శ

భీమవరం, మే 15: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కుటుంబాన్ని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సోమవారం పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. నారాయణతో పాటు ఆయన సతీమణిని తోట సీతారామలక్ష్మి కలిసి తన సంతాపాన్ని తెలిపారు. జరిగిన సంఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.