పశ్చిమగోదావరి

ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 19: మీకోసం వచ్చిన అర్జీలు పరిష్కారంలో అధికారులు సకాలంలో స్పందించకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తానంటే తాను సహించనని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల పరిష్కారానికి తాను అధికారులకు ఒక సమయం కేటాయించి స్వయంగా వెళ్లి పరిశీలించాలని చెప్పినా కొందరు అధికారులు తమకు నచ్చిన సమయంలో మూడు,నాలుగురోజులు గడిచినా వెళ్లకుండా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల ఫిర్యాదుదారులు మళ్లీమళ్లీ మీకోసం కార్యక్రమానికి వచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా దీనివల్ల మీకోసం కార్యక్రమంపై వ్యతిరేక భావం ఏర్పడుతోందన్నారు. అధికారులు తాను చెప్పిన సమయంలో ఫిర్యాదుదారుని వద్దకు వెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇరగవరం మండలం అర్జునిడిపాలెం గ్రామానికి చెందిన కె భాస్కరరెడ్డి వినతిపత్రం సమర్పిస్తూ తన భూమికి చుట్టుప్రక్కల కొందరు రొయ్యలసాగు చేస్తూ చెర్వులోని ఉప్పునీరు పొలాల్లో వదిలివేయటం వల్ల తమ పొలం సేద్యానికి పనికిరాకుండా పోతోందని, ఈవిధంగా పలువురు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. దీనిపై కలెక్టరు స్పందిస్తూ వెంటనే స్వయంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖాధికారులను ఆదేశించారు. పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన శేషగిరి వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలో కాల్వలకు లెవెల్ లేకపోవటం వల్ల క్రిందిభూములకు నీరందక సుమారు వంద ఎకరాలకుపైగా భూములు సాగుకు నోచుకోవటం లేదన్నారు. దీనిపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్‌ఇని కలెక్టరు ఆదేశించారు. భీమడోలు మండలం గుండుగొలను పంచాయితీలో నిధుల దుర్వినియోగం అయ్యాయని ఎం కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెంలోని చిన్నవంతెన సమీపంలో శంకరమఠం, గణపతి ఆలయం, పాఠశాల ఉన్న ప్రాంతంలో బ్రాందీషాపు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళంపల్లి బుచ్చిబాబు, రామకృష్ణ, మరికొందరు ఫిర్యాదు చేశారు. వీటిని పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టరు ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, డిఆర్వో కె హైమావతి, హౌసింగ్ పిడి ఇ శ్రీనివాసరావు, డిపిఓ కె సుధాకర్, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసులు, డిఇఓ గంగాభవాని పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసమే తీర్థయాత్రలు
*ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ
ద్వారకాతిరుమల, జూన్ 19: ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంతోబాటు రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగిస్తూ పౌర స్వేచ్ఛను హరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనువిప్పు కలిగించాలని చిన వెంకన్నను వేడుకుంటున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని సోమవారం సాయంత్రం ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత నిమిత్తం తాము తీర్థయాత్రలు చేస్తూ దేవుళ్లూ, దేవతలకు మొక్కుకుంటున్నట్టు చెప్పారు. తిరుమల నుండి ప్రారంభమైన తన యాత్ర విజయవాడ మీదుగా చిన వెంకన్న క్షేత్రానికి చేరినట్టు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం చట్ట వ్యతిరేక పాలన సాగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణాలో తమకు సహకారంతోనే చంద్రబాబు పాదయాత్ర చేశారని, తాము ఇక్కడ పాదయాత్ర చేస్తే అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో దళితల్లో మాదిగల సహకారంతోనే ఆయన గెలుపొందారన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు హామీ ఇవ్వడం వల్లే తామంతా ఆ పార్టీకి మద్దతు తెలిపినట్టు చెప్పారు. కాపులను బిసిల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించడం వల్లే పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు కాపు నేతలు చంద్రబాబుకు మద్దతు తెలిపారన్నారు. అయితే ఇచ్చిన మాట తప్పడంతోపాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్నారన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను తాను మాత్రం అనుభవిస్తూ మిగిలిన వారిని అణగదొక్కడం ఏమి న్యాయమని ఆయన ప్రశ్నించారు. జూలై 7న అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభ విజయవంతం అయ్యేందుకు తనకు శక్తి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్టు చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపని జగన్‌కు అందుకు నోరివ్వాలని కోరుకున్నానన్నారు. ఆయనతో ఎమ్మార్పీఎస్ నేతలు చెట్టే రాజు, వేటుకూరి విజయకుమార్ తదితరులు ఉన్నారు.