పశ్చిమగోదావరి

ఆక్వా రైతులకు విద్యుత్తు ఛార్జీల భారం తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 27: జిల్లాలో ఆక్వా రైతులకు విద్యుత్తు చార్జీల భారం తగ్గిస్తామని జిల్లా పరిషత్ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్, మత్స్యశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణాజిల్లాతో పోల్చితే పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా రైతులకు విద్యుత్ కనెక్షన్ పొందాలంటే లక్షా 50 వేల రూపాయలు అదనపు భారం పడుతుందని, దీని వల్ల ఆక్వా రైతులు ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. కృష్ణాజిల్లాలో ఆక్వా రైతులకు కరెంటు ట్రాన్స్‌ఫార్మర్, లైన్ ఏర్పాటు విషయంలో రాయితీలుండగా పశ్చిమలో వాటిని ఎందుకు అమలుచేయడం లేదని తక్షణమే కృష్ణాజిల్లాలో మాదిరిగా పశ్చిమలో కూడా ఎల్‌టి మీటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించి కనీస ఛార్జీలు వసూలుచేయాలని ఆదేశించారు. జిల్లా జిల్లాకు ఎందుకు నిబంధనలు మారుతున్నాయని పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతులు ఏ పాపం చేశారని అదనంగా లక్షా 50 వేల రూపాయలు చెల్లించాలని ఈ విషయంపై అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆక్వా రైతులు కరంటు ఛార్జీల కష్టాలు తీరుస్తామన్నారు. గత పదేళ్లలో పాలించిన కాంగ్రెస్ నాయకులు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు పొలాల్లోనే పడిగాపులు కాసేవారని వేసవి వస్తుందంటే ప్రజీనాకం అల్లాడిపోతూ ఉక్కపోతకు భయపడే వారని గత మూడేళ్ల నుండి రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించి ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు.
చిన్న చిన్న సమస్యలు రైతులకు అక్కడికక్కడే పరిష్కరించడంలో విద్యుత్ అధికారులు స్పందించాలని కోరారు. జిల్లాను బహిరంగ మల విర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దామన్నారు. జాతీయ రమదారులు, రాష్ట్ర రహదారులు ప్రధాన ప్రాంతాలలో ప్రజల సౌకర్యార్ధం కమ్యూనిటీ టాయ్‌లెట్స్ నిర్మాణానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రతీ చోటా కమ్యూనిటీ టాయ్‌లెట్స్‌కు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం సమకూరుస్తుందని ఈ సొమ్ముతో మరుగుదొడ్లు నిర్మించి ఒక్కొక్కరి నుంచి రెండు రూపాయలు వసూలుచేసే విధానాన్ని అమలు చేస్తే భవిష్యత్తులో కమ్యూనిటీ టాయిలెట్లుకూడా పరిశుభ్రంగా ఉంచగలుగుతామని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లె ప్రాంతాలలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నిర్మాణాత్మకమైన చర్యలుచేపట్టామని దీని ఫలితంగా గత వేసవిలో తాగునీటి సమస్య కాని, విద్యుత్ సమస్య గానీ తలెత్తలేదని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎపి ఇపిడిసిఎల్ ఎస్ ఇ సత్యనారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేవ్వరరావులకు బాపిరాజు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఇంటింటా మంచినీటి కుళాయి కనెక్షన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందని, అవసరమైన ప్రాంతాలలో మంచినీటి రిజర్వాయర్లు నిర్మాణానికి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, అవసరమైన ప్రాంతాలలో మంచినీటి పైపులైన్ల విస్తరణ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని జిల్లాలో నిరంతరం తాగునీరు, విద్యుత్ సరఫరా అందించే జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ఆయన చెప్పారు.

మూతపడిన వస్త్ర దుకాణాలు
ఏలూరు, జూన్ 27 : వస్త్రాలపై వస్తు సేవా పన్ను విధానాన్ని తీసుకురావద్దని, ఈ విధానం వల్ల ప్రజలపై అదనపు భారం పడటమే కాకుండా అధికారుల వేధింపులు వ్యాపారులపై అధికమవుతాయని కోరుతూ ఏలూరు నగరంలో మంగళవారం రెడీమేడ్ హోల్‌సేల్ రిటైల్ వస్త్ర దుకాణాలు మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. మరో మూడు రోజులపాటు దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు దుకాణాలు మూసివేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హోల్‌సేల్ వస్త్ర వ్యాపారుల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చక్కా భాస్కరరావు, కందుల రామ్మోహనరావులు మాట్లాడుతూ జి ఎస్‌టి విధానం వలన అనేక ఇబ్బందులున్నాయని, ప్రజలపై అదనపు భారం పడుతుందని, వెంటనే తొలగించాలని కోరారు. కార్యక్రమంలో వ్యాపార సంఘ నాయకులు కమ్మ శివశంకర్, చోడబండి శ్రీనివాసరావు, గుళ్లపూడి రాజా, అల్లం పూర్ణచంద్రరావు, అందే కరుణ సుబ్రహ్మణ్యం, అల్లం వీరవెంకట సుబ్రహ్మణ్యం, యర్రా మూర్తి, నార్ని ఉమామహేశ్వరరావు, మద్దుల బదరీ తదితరులు పాల్గొన్నారు. నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టుటౌన్‌లో క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షులు చీమకుర్తి సాయి కృష్ణ, పొన్నా శంభుప్రసాద్, దొంతంశెట్టి విశే్వశ్వరరావు, వై నాగేశ్వరరావు, ఎ అప్పలరాజు, కనిగోళ్ల ప్రసాద్, సన్నిధి రాధాకృష్ణలు జి ఎస్‌టి పన్నుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. వస్త్రాలపై, రెడీమేడ్ దుస్తులపై జి ఎస్‌టి పన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నగరంలో వస్త్రాలు, రెడీమేడ్ దుకాణాలు మూతపడటంతో కొనుగోలుదారులు అసౌకర్యానికి గురయ్యారు.