పశ్చిమగోదావరి

వణికిస్తున్న ఈదురు గాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి, జూన్ 27: ఆకస్మాత్తుగా వీస్తున్న సుడిగాలులకు అరటి తోటలకు అపార నష్టం వాటిల్లుతోంది. ఎన్నడూ లేనివిధంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలకు జిల్లాలోని అరటి తోటలు చిగురుటాకులా వణికిపొతున్నాయి. ఇటీవల కురుస్తున్న ఈదురు గాలులతో కూడిన వర్షాలకు అరటి తోటలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు అక్కడక్కడా బలమైన సుడిగాలులు వీస్తున్నాయి. సుడు గాలులు ఒకచోట ఉంటే మరోచోట కనిపించడం లేదు. జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో అరటిని సాగు చేస్తుండగా నిడదవోలు నియోజకవర్గంలో అత్యధికంగా పది వేల ఎకరాల్లో రైతులు అరటిని సాగు చేస్తున్నారు. గోదావరి తీర ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోనే సుడి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. గాలులు వీచిన చోట అరటి తోటలు నేలమట్టమవుతున్నాయి. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇంతకుముందు 20 రోజుల క్రితం ఇలాంటి సుడిగాలులే వీచగా నిడదవోలు ప్రాంతంలో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. అప్పట్లోనే తూర్పుగోదావరి జిల్లాలో కూడా గోదావరి తీర ప్రాంతంలోనే సుడి గాలులకు అరటి పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రస్తుతం తీర ప్రాంతమైన నిడదవోలు నియోజకవర్గంలో సుడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సుడిగాలులకు అరటికి సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు వ్యవశాయశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అరటి తోటలకు ఇంతకాలం గిట్టుబాటు ధర లేక అల్లాడిన రైతులు ప్రస్తుతం ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ చేతికందిన పంట దక్కక తల్లడిల్లుతున్నారు.