పశ్చిమగోదావరి

క్విట్ ఇండియా స్ఫూర్తితో చైనా వస్తువులు బహిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 15: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చైనా వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వినియోగించాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పిలుపునిచ్చారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్ళి దౌత్యపరంగా చైనాను దోషిగా నిలిపిందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారన్నారు. మహాత్మాగాంధీజీ నాయకత్వంలో అహింసా ఉద్యమం, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వంటి వారు విప్లవోద్యమం నిర్వహించి ప్రాణాలను సైతం త్యాగం చేశారన్నారు. 70 ఏళ్ళ తర్వాత కూడా స్వాతంత్య్రోద్యమ లక్ష్యం నెరవేరకపోవడం శోచనీయమన్నారు. గాంధీ పేరుతో నకిలీ గాంధీలు పాలన సాగించారని, వారి రంగు భారతీయమైతే, వారి మనస్సు దేశీయంగా అవినీతిపాలు చేశారన్నారు. విదేశీ బహిష్కరణోద్యమం స్ఫూర్తితో చైనా వస్తువులు బహిష్కరించి ఆ దేశ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లో భారతదేశ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్న చైనా తాజాగా డోక్లాం వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతోందన్నారు. మంత్రి కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, జడ్పీ హైస్కూళ్లల్లో మంత్రి మాణిక్యాలరావు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, బిజెపి పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, మున్సిపల్ వైస్‌చైర్మన్ కిలాడి ప్రసాద్, మాజీ వైస్‌చైర్మన్ గొర్రెల శ్రీ్ధర్, బిజేపి ఫ్లోర్ లీడర్ యెగ్గిన నాగబాబు, మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, బిజెపి నాయకులు కంచుమర్తి నాగేశ్వరరావు, కోట రాంబాబు, తహసీల్దార్ పాశం నాగమణి, ఎంఇఒ వి.హనుమ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
ఏలూరు, ఆగస్టు 15: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్లుగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ముందుకెళుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇదే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఇప్పటికే ఫలితాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ ప్రధానమైన పశ్చిమగోదావరి వంటి జిల్లాలో వ్యవసాయరంగంలో రెండంకెల వృద్ధిరేటును సాధించామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్ధానిక పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగంలో 6619కోట్ల రూపాయల ఆదాయ వృద్ధితో 13.1శాతం వృద్ధిరేటును సాధించామని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2443 కోట్ల రూపాయల వృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో సాగునీటిని సమర్ధంగా వినియోగించుకుని మూడవ పంటకు రైతులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో రైతులకు 250కోట్ల రూపాయల విలువైన విత్తనాలను 75శాతం సబ్సిడీపై అందించినట్లు వివరించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 2016కోట్ల రూపాయలు రైతులకు, 112 కోట్ల రూపాయలు కౌలురైతులకు వ్యవసాయరుణాలుగా అందించామని తెలిపారు. 4.95లక్షల మంది రైతులకు రెండు విడతలుగా 929 కోట్ల రూపాయల రుణమాఫీ మొత్తాలను వారి ఖాతాలకు జమ చేశామన్నారు. యాంత్రీకరణకు మరింత ప్రోత్సాహం అందిస్తూ 70కోట్ల రూపాయల విలువైన యంత్రాలను 32వేల మంది రైతులకు అందజేసినట్లు తెలిపారు. అలాగే మరో 110కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ యంత్రాలను అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టును చేపట్టామన్నారు. జిల్లాకే కాకుండా మొత్తం రాష్ట్ర భవిష్యత్‌నే సమూలంగా మార్చివేయగలిగే సామర్ధ్యం ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారాన్ని అందిస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా ప్రస్తుత వ్యవసాయసీజన్‌లో 29టిఎంసిల జలాలను అందించి వేల కోట్ల రూపాయల పంటను కాపాడగలిగామన్నారు. యనమదుర్రు డ్రైన్, ఎర్రకాల్వ అభివృద్ధి పనులు, తమ్మిలేరు ఆధునీకరణ పనులను 210కోట్ల రూపాయలతో చేపట్టామన్నారు. అలాగే ఆయిల్‌పామ్, కోకో సాగులో రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి ప్రధమస్ధానంలో ఉందని తెలిపారు. 68కోట్ల రూపాయలతో ఉద్యానవన రైతులకు వివిధ పంటల సాగుకు రాయితీగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి 16వేల కోట్ల రూపాయల విలువైన చేపల, రొయ్యల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఆక్వా పరిశ్రమలో రాష్ట్రంలోనే జిల్లా రెండవస్ధానంలో ఉందని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 28 సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. రైతు కూలీల వలసలను నివారించేందుకు పెద్దఎత్తున పనిదినాలను కల్పిస్తున్నామని, ఉపాధి పధకం కింద మూడులక్షలకు పైగా రైతు కూలీ కుటుంబాలకు ఈ ఏడాదిలో ఇంతవరకు కోటి 5లక్షల పనిదినాలను కల్పించి 150కోట్ల రూపాయలను వేతనాలుగా చెల్లించినట్లు తెలిపారు. నీరు-చెట్టు పధకం కింద జిల్లాలో 130కోట్ల రూపాయలతో 38వేల జలసంరక్షణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 6.60లక్షల మంది డ్వాక్రా మహిళలకు 395కోట్ల రూపాయలను పెట్టుబడి నిధిగా అందించినట్లు తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశ్యంలో జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 162 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి వెయ్యి కోట్ల రూపాయల విలువైన 6.60కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీపం పధకం కింద లక్షా 40వేల గ్యాస్‌కనెక్షన్లు అందించి జిల్లాను పొగరహిత జిల్లాగా ప్రకటించినట్లు తెలిపారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పర్వదినాల సందర్భంగా నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేశామని మంత్రి పుల్లారావు తెలిపారు. జిల్లాలో చంద్రన్న ఆరోగ్య పరీక్షల కార్యక్రమం కింద 6.60లక్షల మంది పేదలకు ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు స్వచ్చమైన వాతావరణం కల్పించేందుకు సప్తవర్ణ కార్యక్రమం కింద జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజు దుప్పట్లు మార్చే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నామన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి అధికప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్ధులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కాపు కార్పోరేషన్ ద్వారా 9వేల మంది లబ్దిదారులకు 90కోట్ల రూపాయల సబ్సిడీని అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యాటక అవకాశం ఉన్న పాపికొండలు, కొల్లేరు, యలమంచిలి లంక, నరసాపురం, ఎర్రకాల్వ జలాశయం తదితర ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా అభివృద్ధిలో తోడ్పాటునందిస్తున్న పోలీసు యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రగతికి పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపిలు తోట సీతారామలక్ష్మి, గోకరాజు గంగరాజు, రాష్ట్రప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి), మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం రవిప్రకాష్, జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీప్, అదనపు ఎస్పీ రత్నం, డిఆర్వో కె హైమావతి, ఆర్డీవో జి చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు.
ఆనందాన్నిచ్చిన పోలవరంలో పతాకావిష్కరణ
పోలవరం, ఆగస్టు 15: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కాంట్రాక్టు ఏజన్సీ కార్యాలయంవద్ద జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి అనేక మంది ప్రాణాలు అర్పించారని, ఈ సందర్భంగా వారికి నివాళులర్పించాలన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం.., ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని ఎంతో ఆశతో రైతాంగం ఎదురుచూస్తోందన్నారు. ఈ సీజన్లో ఇప్పటికే 20 టిఎంసిల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిందని, కృష్ణా జలాలు ఇప్పటికి కూడా ఆల్మట్టి ప్రాజెక్టు దాటి రాలేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, పోలవరం ప్రాజెక్టు ఆధార్టీ, సిడబ్ల్యూసి సహకారంతో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీలతోపాటు విదేశీ సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తిచేయడానికి కృషిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా 18సార్లు, వర్చ్య్‌వల్ ఇన్స్‌పెక్షన్ ద్వారా 36సార్లు పనులు పరిశీలించి, నిర్మాణం వేగవంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా, పోలవరం ప్రాజెక్టు మాత్రమే శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 194 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందని, అలాగే వరదల సమయంలో కుడి, ఎడమ కాలువల ద్వారా 350 టిఎంసిల నీటిని వినియోగించుకోవచ్చునన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా లోటులో ఉన్నా, రాష్ట్ర రైతుల కోసం ప్రాజెక్టు నిర్మాణానికి అనేక కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. పట్టిసం ఎత్తిపోతలు నిర్మించి నదుల అనుసంధానం ద్వారా దేశానికే ఆదర్శమయ్యామన్నారు. జల వనరుల ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం షెడ్యూల్ ప్రకారం పూర్తిచేసి, రైతులకు నీరందించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధిలో మైలురాయి ప్రాజెక్టు అని, 2018 నాటికి గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా నీరు తరలించేందుకు ప్రణాళిక రూపొందించుకుని, దానిని కర్తవ్యంగా భావించి పూర్తిచేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం మంత్రి దేవినేని గేట్ల తయారీ కేంద్రం వద్దకు చేరుకుని, అక్కడ కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్పిల్‌వేలో అమర్చే 48 గేట్ల నిర్మాణం పూర్తవడంతో బేకం కాంట్రాక్ట్ ఏజన్సీ ప్రతినిధులతోపాటు సిబ్బందిని అభినందించారు. తయారైన గేట్లను తరలించేందుకు ఆరి జెంటల్ గెడ్డర్స్ నిర్మాణానికి పూజచేసి ప్రారంభించారు. మంత్రి వెంట ప్రాజెక్టు ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులు తిరుమలేష్, యువరాజ్, సత్యారావు, ప్రాజెక్టు అధార్టీ సభ్యులు జయస్వాల్, ఉకుంసింగ్, పోలవరం డిఎస్పీ రవికుమార్, సిఐ కె బాలరాజు, ఇఇలు, డిఇలు, సిబ్బంది ఉన్నారు.
ప్రణాళికాబద్ధంగా రాష్ట్భ్రావృద్ధి
కొవ్వూరు, ఆగస్టు 15: రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా సిఎం చంద్రబాబు అభివృద్ధిపథంలో తీసుకువెళుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. స్థానిక సంస్కృతోన్నత పాఠశాల ఆవరణలో కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జవహర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కొవ్వూరు నియోజకవర్గస్థాయిలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ధ్యేయంతో నియోజకవర్గస్థాయిలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగాను, 2029 నాటికి దేశంలోనే మొదటి రాష్ట్రంగాను, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపొందించేందుకు చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలన్నారు. కొవ్వూరు నియోజకవర్గాన్ని గత మూడు సంవత్సరాల కాలంలో రూ.450 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, ఈ స్వాతంత్య్ర ఫలాలను అందరికీ అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గత మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికను మంత్రి జవహర్ సభలో వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ షరీఫ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశానికి ముందు మంత్రి జవహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, వ్యవసాయ, గృహనిర్మాణ, చంద్రన్న బీమా పథకంల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. అనంతరం విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందజేసిన ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి జవహర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఐసిడిఎస్, వైద్య-ఆరోగ్యశాఖ, డిఆర్‌డిఎ, వెలుగుశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉద్యాన శాఖ, పశుసంవర్థక శాఖ, విద్యాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను మంత్రి జవహర్, ఎంపి మురళీమోహన్ తిలకించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, దేశ భక్తి గీతాలు పలువుర్ని ఆకట్టుకున్నాయి. మున్సిపల్ కమిషనర్ జి నాగేంద్రకుమార్ సమావేశానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిడిపి శ్రేణులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విదేశీయులు
తాళ్లపూడి, ఆగస్టు 15: తాళ్లపూడి మండలంలో మంగళవారం చేపట్టిన స్వాతంత్య్రదిన వేడుకల్లో జర్మనీ వాసులు పాల్గొన్నారు. స్థానిక సెయింట్ యూజిన్ ఇంగ్లీషు మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ నిర్మల్ స్నేహితులతోపాటు 22 మంది జర్మనీ దేశస్థులు స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ చీరలు కట్టుకుని, దేశ నాయకుల చిత్రాలు చేతపట్టి, మూడు రంగుల పూలమాలలు ధరించి, అందర్నీ ఆకట్టుకున్నారు. జెండా వందనం అనంతరం ప్రతిజ్ఞ చేశారు. జర్మనీ వాసులకు ఇదొక మధురానుభూతి కాగా, ఇక్కడి వారికి వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. జర్మనీ నుంచి వచ్చిన వారిలో కొంత మంది ఫ్రొపెసర్లు, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. సెయింట్ యూజిన్ స్కూలు కరస్పాండెంట్ బెంజిమెన్, ప్రిన్సిపాల్ నిర్మల్ వీరికి ఆతిథ్యం ఇచ్చారు.