పశ్చిమగోదావరి

ఉత్తమ సేవలకు ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 15: వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తూ అత్యుత్తమ సేవలు అందిస్తున్న వారికి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్ధానిక పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి వీటిని అందజేశారు. జిల్లా గృహనిర్మాణసంస్ధ ప్రాజెక్టు డైరెక్టరు ఇ శ్రీనివాసరావు, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, ఐటిడిఎ పిఓ ఎస్ షాన్‌మోహన్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ కె బాలవెంకటేశ్వరరావు, జడ్పీ సిఇఓ డి సత్యనారాయణ, డ్వామా పిడి ముళ్లపూడి వెంకటరమణ, బిసి కార్పోరేషన్ ఇడి ఎన్ పుష్పలత, విభిన్నప్రతిభావంతుల శాఖ ఎడి వి ప్రసాదరావు, ఎల్‌డిఎం పి సూర్యారావు, ఎన్‌ఐసి డిఐఓ జివిఆర్‌ఎస్ శర్మలు మంత్రి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. సమాచారశాఖకు సంబంధించి రికార్డు అసిస్టెంట్ పులి వినాయకబాబు, ఆఫీసు సబార్డినేట్ పత్తి సాగర్, ఎపిఎస్‌ఆర్టీసీ పిఆర్వో కెఎల్‌ఎన్ నరసింహం, జంగారెడ్డిగూడెం డ్రైవర్ బి కోటి, ఐ ఆండ్ పిఆర్‌కు సంబంధించి టైపిస్టు కె జ్యోతి, టెక్నికల్ సబ్‌ఆర్డినేట్ ఎస్ గంగాధరరావులు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరితోపాటు వివిధశాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, పోలీసుశాఖకు సంబంధించి ఎస్సై, ఎఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, కార్యాలయ సిబ్బందికి మంత్రి పుల్లారావు ప్రశంసాపత్రాలు అందజేశారు.
‘సమాచార’సేవలకు ప్రశంసలు
జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పులి వినాయకబాబు, ఆఫీసు సబార్డినేట్ పత్తి సాగర్, ఐ అండ్ పిఆర్ డిపార్టుమెంట్‌లో టైపిస్టుగా పనిచేస్తున్న కె జ్యోతి, టెక్నికల్ సబార్డినేట్ ఎస్ గంగాధరరావుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వీరికి ప్రశంసాపత్రాలను ఆయన అందజేశారు. మూడు దశాబ్ధాలుగా సమాచార శాఖలో విశేష సేవలు అందిస్తున్న వినాయకబాబును ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సమాచార శాఖ ఎడి వి భాస్కర నరసింహం మాట్లాడుతూ అంకితభావం, చిత్తశుద్ధితో అహర్నిశలు విధి నిర్వహణలో భాగస్వాములు అవుతూ ప్రతీ ఒక్కరి మన్ననలు వినాయకబాబు పొందారని కొనియాడారు. డిపిఆర్‌వో ఆర్‌విఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ సమాచార శాఖకే వినాయకబాబు వనె్న తీసుకువచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రశంసాపత్రాలు పొందిన వారిని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు అభినందించారు.
పంద్రాగస్టు నాడు జన్మించిన ‘్భరతి’!
భీమడోలు, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవం రోజైన మంగళవారం భీమడోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఓ బాలిక జన్మించగా బాలికకు భారతి అనే పేరు పెట్టారు. గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన ములకలేటి సుబ్రహ్మణ్యం, భార్య శ్యామల ప్రసవం నిమిత్తం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో బాలిక జన్మించింది. ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వి మురళీ కృష్ణ, డాక్టర్ నిర్మలగ్లోరి, ఇతర వైద్య సిబ్బంది తల్లి, పిల్లకు ప్రభుత్వపరంగా అందజేసే ప్రోత్సాహకాలను అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాలిక జన్మించినందున భారతి అనే పేరును పెట్టుకుంటున్నట్లు తల్లిదండ్రులు ప్రకటించారు.
ఆకట్టుకున్న శకటాలు
ఏలూరు, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో వివిధ ప్రభుత్వశాఖల ప్రగతిని, ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వివరిస్తూ వివిధశాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన శకటాలు అలరించాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రగతి రథం సామాజిక స్పృహ కల్పించేవిధంగా రూపొందించారు. రావోయి ‘చంద్ర’మామా...మా సాగు గాథ వినమా... అంటూ పలు గేయాల అలాపనతో ఈప్రగతిరథంపై ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. అదేవిధంగా రైతురథం, జిల్లా గృహనిర్మాణసంస్ధ, మెప్మా, పౌరసరఫరాలు, డిఆర్‌డిఎ, పశువైద్యరధం, కార్మికశాఖ, పశుసంవర్ధకశాఖ, జలవనరుల సంస్ధ, ఎస్సీ కార్పోరేషన్, వైద్యఆరోగ్యశాఖ, చంద్రన్న సంచారరథం, 108 అంబులెన్స్, 102-తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, అటవీశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, ఐటిడిఎ, బిసి కార్పోరేషన్, మహిళా శిశు సంక్షేమశాఖ, పర్యాటకశాఖ, రవాణాశాఖ, మత్స్యశాఖ, ఉద్యానవనం, సంచార భూసార పరీక్షా కేంద్రం, ఎస్‌ఎస్‌ఎ, అగ్నిమాపకశాఖలకు చెందిన ప్రగతిరథాలను ఈప్రదర్శనలో ప్రదర్శించటం జరిగింది. అయా శాఖలకు సంబంధించిన ప్రగతిని వివరిస్తూ వీటిని ఏర్పాటుచేశారు. ఈ శకటాల ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్ధానిక పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధురాలు గరగ వెంకటరమణమ్మను ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా సత్కరించారు. పెంటపాడు మండలం వెస్ట్‌విప్పర్రుకు చెందిన గరగ లక్ష్మయ్య సతీమణి గరగ వెంకటరమణమ్మ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.