పశ్చిమగోదావరి

పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 19 : ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం పాఠశాలల పనితీరుపై విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని అవి నిత్యం పరిశుభ్ర వాతావరణంలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులదేనని కలెక్టర్ చెప్పారు. కొన్ని పాఠశాలల్లో టాయిలెట్లకు తాళాలు వేసి ఉంటున్నాయని తన దృష్టికి వచ్చిందని తనిఖీ సిబ్బంది పాఠశాలలకు వెళ్లినప్పుడు ఎక్కడైనా మరుగుదొడ్లకు తాళం వేసి ఉన్నట్లు గమనిస్తే అందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పాఠశాలల పనిదినాలలో తప్పనిసరిగా మరుగుదొడ్లు తెరచి వుంచాలని సిబ్బందికి ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఉండకూడదని పిల్లలతోపాటు ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునేలా వాటిని ఉంచుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్ధులు చేతులు పరిశుభ్రం చేసుకునేందుకు వీలుగా రన్నింగ్ వాటర్‌తోపాటు లిక్విడ్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతీ పిల్లవాడూ టాయిలెట్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత భోజనానికి ముందు, ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కునేలా అలవాటు చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే ప్రాంతం కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం తయారు చేయడంలో గ్యాస్ మాత్రమే ఉపయోగించాలని ఎక్కడా గ్యాస్ అయిపోవడం వలన కట్టెలపై వంట చేస్తున్నామనే మాట వినిపించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం అందించేందుకు పిల్లల బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని పిల్లల హాజరును బట్టే మధ్యాహ్న భోజనం తయారు చేయాలన్నారు. ఎంత మంది పిల్లలు బయోమెట్రిక్ హాజరు వేసిందీ ప్రభుత్వానికి నివేదించకపోతే కుకింగ్ ఏజెన్సీలకు డబ్బులు వచ్చే అవకాశం లేదని అందువలన ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి హాజరు వివరాలను పంపాలన్నారు. జిల్లాలో ఇంకా 338 పాఠశాలల్లో కిచెన్ షెడ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని వాటిని కూడా త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంకల్పం సందర్భంగా అధికారుల తనిఖీ సమయాల్లో గుర్తించిన సమస్యలను ప్రధానోపాధ్యాయులు వెంటనే పరిష్కరించాలని డి, సి గ్రేడుల్లో ఉన్న పాఠశాలలు ఏ గ్రేడుకు వచ్చే విధంగా విద్యాప్రమాణాలు, సౌకర్యాలు పెంపొందించాలని చెప్పారు. పాఠశాలల్లో టీచింగ్ టెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి పాఠాలు బోధిస్తున్నదీ లేనిదీ, టీచర్ కూర్చుని పాఠాలు చెబుతున్నారా? నిలుచుని పాఠాలు చెబుతున్నారా? పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ చేతన్, డిఇవో గంగా భవానీ, సర్వశిక్ష అభియాన్ పివో డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, ఏలూరు డిప్యూటీ డిఇవో ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎఎన్‌ఎం ఆత్మహత్యాయత్నం
ఏలూరు, సెప్టెంబర్ 19 : ఎఎన్ ఎంపై ఒక వ్యక్తి నకిలీ రిపోర్టు వాయమని ఒత్తిడి చేయడంతో 20 మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కామవరపుకోట మండలం రామన్నపాలెంనకు చెందిన షేక్ మేరీ కామవరపుకోట పిహెచ్‌సిలో ఎఎన్‌ఎంగా చేస్తోంది. రామన్నపాలెం నల్లగోపువారిగూడెం తదితర ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ఈ నేపధ్యంలో నల్లగోపువారిగూడెం గ్రామానికి చెందిన శైలజ అనే వివాహిత గర్భిణీగా వున్న తరుణంలో 15 రోజుల క్రితం విజయవాడ శస్తచ్రికిత్సకు వెల్లి అక్కడ మృతిచెందింది. ఆమె భర్త రాంబాబు సోమవారం ఎ ఎన్ ఎం మేరీ వద్దకు వచ్చి తల్లి-బిడ్డ కార్డు రాసి ఇవ్వాలని, ఆ కార్డు రాసిస్తే తనకు ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని ఒత్తిడి చేశాడు. విజయవాడలో చనిపోతే తాను కార్డు ఇవ్వడం జరగదని తిరస్కరించింది. ఈ నేపధ్యంలో రాంబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెపై కేసు పెడతానని బెదిరించాడు. దీనితో మనస్థాపానికి గురైన ఎ ఎన్ ఎం 20 మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.