పశ్చిమగోదావరి

ఆర్యవైశ్యుల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, సెప్టెంబర్ 19: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకాన్ని రచించిన కంచె ఐలయ్యపై ఆర్యవైశ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనను పురస్కరించుకుని భీమవరంలోని ఆర్యవైశ్యులు బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో బంద్ పాటించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యాంకులు, ఆదాయపు పన్నుశాఖ కార్యాలయం, సెంట్రల్ ఎక్సైజ్, బిఎస్‌ఎన్‌ఎల్, తపాలాశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను ఆర్యవైశ్య సంఘాలకు చెందిన యువ నాయకులు మూయించివేశారు. దీంతో పాటు పట్టణంలోని అన్ని వాణిజ్య దుకాణాలు మూతబడ్డాయి. సినిమా థియేటర్లలో చిత్రాల ప్రదర్శన నిలిపివేశారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపుమేరకు అన్ని వాణిజ్య, వ్యాపార, వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. కొందరు స్వచ్ఛందంగానే బంద్ పాటించారు. స్థానిక ప్రకాశం చౌక్‌లో ఆర్యవైశ్యులు చేపట్టిన దీక్షలకు ఇతర సంఘాలు, వర్ణాలు తదితరులంతా మద్దతు పలికారు. వారికి సంఘీభావం ప్రకటించారు. కంచె ఐలయ్య అంతిమ సంస్కారాలను స్థానిక ప్రకాశం చౌక్‌లో ఏర్పాటుచేశారు. కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వరరావు, డిఎన్నార్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), ఛాంబర్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఐలయ్యపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలన్నారు. పుస్తకాన్ని విడుదల చేయకుండా అడ్టుకుని, అటువంటి రచయితలపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. తుమ్మలపల్లి శివ, భీమవరం మండల అధ్యక్షుడు కొప్పురావూరి శ్రీ ప్రసన్నాంజనేయులు, జూలూరి నాగేశ్వరరావు, మడిపల్లి కృష్ణమూర్తి, వబిలిశెట్టి రంగారావు, అదనపు ప్రధాన కోశాధికారి సోము సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గూటాలలో మూడు డ్రెడ్జింగ్ బోట్లు గుర్తింపు
పోలవరం, సెప్టెంబర్ 19: పోలవరం మండలం గూటాల పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపులో డ్రెడ్జింగ్ ద్వారా నీటి గర్భం నుండి ఇసుక తీస్తున్నారని ఫిర్యాదు రావడంతో తనిఖీకి వచ్చి మూడు డ్రెడ్జింగ్ బోట్లను గుర్తించినట్టు ఎజిఆర్‌బి డిఇ రత్నరాజు తెలిపారు. గోదావరి వరదల కారణంగా మూతపడిన ఈ ర్యాంపు వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైంది. పగలు రెండు చిన్న పడవల్లో కూలీల ద్వారా అవతలి ఒడ్డు నుండి ఇసుక తీసుకొస్తుండగా రాత్రి సమయాల్లో డ్రెడ్జింగ్ బోట్లతో అక్రమంగా ఇసుక తీసి రోజుకు 30 నుండి 40 లారీల వరకు తరలిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని కొందరు వ్యక్తులు ఫిర్యాదుతో తనిఖీకి వచ్చామని డిఇ తెలిపారు. ర్యాంపు సమీపంలో మూడు డ్రెడ్జింగ్ బోట్లను గుర్తించారు. వాటిని సీజ్ చేసి, కొవ్వూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బోట్ల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖాళీగా ఉన్న బోట్లను ఎలా సీజ్ చేసి తీసుకెళ్తారని అధికారులను నిలదీశారు. దీంతో డిఇ ఫోన్ ద్వారా విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి బోట్లలోని డ్రెడ్జింగ్ మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఇ రత్నరాజు విలేకరులతో మాట్లాడుతూ రాత్రి సమయంలో నిఘా పెంచమని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేస్తామన్నారు. రాత్రి సమయంలో డ్రెడ్జింగ్ చేస్తే బోట్లను సీజ్‌చేసి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఇ హెచ్చరించారు. ఆయన వెంట బోటు సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్, ఆర్‌ఐ కె నాగరాజు తదితరులు ఉన్నారు.