పశ్చిమగోదావరి

‘దేశం’ కమిటీల్లో ఏజన్సీ, మెట్ట ప్రాంతాలకు దక్కని చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 24: తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలలో జిల్లాలోని ఏజన్సీ, మెట్ట ప్రాంతాలకు చోటు దక్కక పోవడంతో ఈ ప్రాంతంలోని కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జాతీయ కమిటీలోను, రాష్ట్ర కమిటీలోను దాదాపు పాతవారినే కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, కొత్తవారిని పరిశీలనకు సైతం తీసుకోలేదనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో రెండేసి, మూడేసి పదవులకు ఉన్నవారికి పార్టీ పదవులు కట్టబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం అహర్నిశలూ పాటుపడే రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీ నేతలకు తీరని అన్యాయం జరిగిందనే ఆరోపణ వినిపిస్తోంది. రిజర్వుడు నియోజకవర్గాల్లో నేతలకు పార్టీ పదవులు కూడా కట్టబెట్టకపోతే భవిష్యత్‌లో ఏ విధంగా పార్టీని ఆదుకుంటారనే ప్రశ్నలు తలెత్తాయి. ఒకే ప్రాంతానికి ఇబ్బడిముబ్బడిగా పార్టీ పదవులు సైతం కట్టబెట్టిన అధిష్టానం, ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సేవలందించే పలువురిని విస్మరించారని, కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని, పాత కమిటీలనే కొనసాగిస్తూ కొత్త సీసాలో పాత సారా చందంగా ఒకరిద్దరి మార్పుతో నూతన కమిటీలు వేసేసారనే ఆరోపణలు కూడా విన వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎమ్మెల్సీ ఎం.ఎ.షరీఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ముళ్ళపూడి రేణుక, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా మెంటే పార్థసారథి, మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శిగా కొక్కిరిగడ్డ జయరాజు, రాష్ట్ర హెచ్‌ఆర్‌డి సభ్యునిగా మద్దిపాటి వెంకటరాజును నియమించారు. వీరిలో వెంకటరాజు తప్ప మిగిలిన వారంతా డెల్టాలోని ఒకే ప్రాంతానికి చెందినవారని, ఏజన్సీ ప్రాంతం నుండి ఒక్కరిని కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్ ఇమ్మణ్ణి రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర వంటి సీనియర్ల పేర్లు కనీసం పరిశీలనలోకి తీసుకోలేదని, మంత్రి పదవి నుండి తొలగించిన తరువాత చింతలపూడి ఎమ్యెల్యే పీతల సుజాతకు పార్టీలో అత్యున్నత పదవి కట్టబెడతారనుకున్న తమకు నిరాశే మిగిలిందని కార్యకర్తలు వాపోతున్నారు. పీతల సుజాత పార్టీలో కీలక పదవికి అర్హురాలని, ఆమెతో పాటు పార్టీ సీనియర్లు మండవ లక్ష్మణరావు, జగ్గవరపు ముత్తారెడ్డి, కోనేరు వెంకట సుబ్బారావు, రాజాన సత్యనారాయణ (పండు), అబ్బిన దత్తాత్రేయ, రెండుసార్లు జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి, ఒకసారి పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసిన పెనుమర్తి రామ్‌కుమార్‌లను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న
ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆదాయ పన్ను శాఖ కమిషనర్
జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 24: మద్ది ఆంజనేయస్వామివారిని ఆదివారం ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, విజయచంద్ర దంపతులు దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, స్వామివారి తమలపాకులతో అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో వారికి వేదాశీస్సులు అందజేసి, స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్, కార్యదర్శి చోడగిరి శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రమేష్‌కుమార్, జిల్లా సహాధ్యక్షుడు బి.ఎన్.కిషోర్, జంగారెడ్డిగూడెం తాలూకా అధ్యక్షుడు వి.ఆదినారాయణ, కెఆర్‌కె వర్మ, ఐ.సుబ్బారావు, ఎన్.మార్రాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆదాయ పన్ను శాఖ కమిషనర్ (హైదరాబాద్) బి.వెంకట గోపీనాథ్, సత్యబబిత దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, తమలపాకులతో అష్టోత్తర పూజల అనంతరం ముఖ మండపంలో వేదాశీస్సులు అందజేశారు. వీరిని స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేసినట్టు దేవస్థానం ఛైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఇఒ శివ తెలిపారు.